ఆడపిల్ల పుట్టడం కోసం దేవుడు ఈ ఇంటిని ఎంచుకుంటాడు…!
ఈరోజుల్లో కూడా టెక్నాలజీ ఇంత పెరిగినా కూడా చాలా చోట్ల ఆడపిల్ల పుట్టిందని భార్యని వదిలేయడం, ఆడపిల్లల్ని చంపేయడం మనం చూస్తూనే ఉన్నాం.. మగ పిల్లవాడు పుడితే ఏదో అదృష్టం అని.. ఆడపిల్ల పుడితే అరిష్టమని అంటూ ఉంటారు. చాలామంది ఇంటికి భారం అంటారు. ఆడపిల్ల పుడితే అసలు ఈ ఆలోచన ఎందుకొస్తుంది. అలాంటి లోకంలో జీవిస్తున్న మనం ఆడపిల్ల పుడితే పసికందుగా ఉన్నప్పుడే చంపేయడం లేదా బయటపడడం చేస్తున్నారు. ఈనాటికీ కూడా ఈ సమాజం ఎప్పటికీ మారదు అని అనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టినట్టే అని మన పెద్ద వాళ్ళు చెబుతూ ఉంటారు. అది నిజమేనా.. ఎందుకలా అంటారు.. అసలు ఎవరు ఇంట్లో ఆడపిల్ల పుడుతుంది. అనే విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం.. ఎలాంటి పనులు చేయడం వలన వారి ఇంటికి కూతురు, సంపదలు లభిస్తాయి అని. అర్జునుడు అడుగుతాడు.
ఒకరోజు అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా చెప్పాడు. ఎవరి ఇంట్లో అయితే కూతురు పుడుతుందో వారు తమ పూర్వ జన్మలో ఎన్నో పుణ్యకార్యాలు చేసి పుణ్యం సంపాదించి ఉంటారు. వారికి మాత్రమే తరువాతి జన్మలో ఆడపిల్లను పొందే అదృష్టం కలుగుతుంది. అలాంటి వారికే ఆడపిల్లకు తల్లిదండ్రులుగా ఉండే అదృష్టం దక్కుతుంది. వారి ఇంటికి సకల సంపదలు దక్కుతాయి అని చెప్తాడు. వారింట్లో లక్ష్మీదేవి ఎప్పుడు ఉంటుంది. ఎవరైతే కూతురుని పెంచగల సామర్థ్యం ఉంటుందో వారికి మాత్రమే కూతుర్ని ప్రసాదిస్తాడు ఆ భగవంతుడు. అలాంటి ఇళ్ళలోనే కూతురు పుడుతుంది. ఆ ఇల్లు మాత్రమే ఎంతో అదృష్టం చేసుకుంటుంది. ఒకసారి స్వామి వివేకానంద వైష్ణో దేవి ఆలయ మెట్ల మీదుగా వెళుతున్నారు.
అప్పుడు ఆయన పక్కనే ఒక రైతు తన కూతురుని భుజం మీద కూర్చోబెట్టుకుని మెట్లు ఎక్కుతున్నాడు. అది చూసిన వివేకానంద అతనిని అడిగారట ఎందుకు మీరు మీ కూతురు భారాన్ని మోస్తున్నారు అని.. అప్పుడు రైతు చెప్పాడు కూతురు ఎప్పుడు తండ్రికి భారం కాదు.. కుమార్తెలు ఎప్పుడూ తండ్రికి భారం కాదు.. వారు తమ భుజాలపై ఉంటే ప్రతి భారం చాలా తేలికవుతుంది. కూతురు ఎప్పుడూ డబ్బు కోసం చూడదు.. కేవలం గౌరవం కోసం మాత్రమే చూస్తుంది. అయితే ఎవరు ఈ విధంగా ఆడపిల్ల పుట్టే భాగ్యాన్ని పొందుతారు. అని మీకు అనుమానం రావచ్చు.. పురాణాల ప్రకారం ఎవరైతే తన గత జన్మలో స్త్రీలతో ప్రవర్తించే తీరును బట్టి వారు తర్వాత జన్మలో స్త్రీలుగా పుడతారు. ఎవరైతే చనిపోయే ముందు స్త్రీని తలచుకుంటూ చనిపోతారో వారు స్త్రీలుగా జన్మిస్తారు అని గ్రంథాల్లో చెప్పబడింది.
ఎవరింట్లో అయితే ఆడపిల్ల పుడుతుందో వారి ఇల్లు అదృష్టానికి నిలయం. ఎందుకంటే లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఉంటుంది కాబట్టి.. మనం పోయిన జన్మలో పుణ్యాలు చేస్తే మనకు ఆడపిల్ల పుట్టే అదృష్టం దక్కుతుంది. లేదా మనం పుణ్యాలు చేస్తే వచ్చే జన్మలో మనం ఆడపిల్లగా పుట్టే అదృష్టం దొరుకుతుంది. ఆడపిల్లలు భారం అని ఆలోచించే విధానం మారాలి. అబ్బాయి ఇద్దరు సమానమే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు అందరూ అలా చూడగలిగిన రోజు నిజంగా ప్రపంచం ఇంకా ముందుకు వెళుతుంది..