
Guru pournami : గురు పౌర్ణమి రోజు ఈ విధంగా పూజ చేస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతం....!
Guru pournami : ఆషాడ పౌర్ణమిని గురు పౌర్ణమి అని కుడా అంటారు. ఈరోజు గురువుల కృప కోసం భక్తిశ్రద్ధలతో పూజలు చేయడం లేదా వారిని గౌరవించడం చేస్తే సకల సుఖాలు కలుగుతాయని పెద్దలు చెబుతారు. అయితే గురు పౌర్ణమి విశిష్టత ఏమిటి..? ఈరోజు సాయినాధుడిని ఎలా సమర్పించాలి..? ఎలా పూజించాలి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. గు అంటే అంధకారం చీకటి అని అర్థం. రు అంటే తొలగించడం అని అర్థం. అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానాన్ని అందించే గురువు సాక్షాత్తు బ్రహ్మ అనడంలో సందేహమే లేదు. గురువుని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా పూజంచే సంస్కృతి మనది. పూర్వం గురుకుల విద్యా విధానం అమలు సమయంలో శిష్యులు గురువుని దైవంతో సమానంగా పూజించేవారు. గురువును కూడా శిష్యులను తమ కన్న బిడ్డల కంటే ఎక్కువగా ప్రేమించేవారు. అయితే అంతటి గురువుని పూజించడానికి ఒక రోజు ఉండడం దానిని గురు పౌర్ణమి గా జరుపుకోవడం జరిగింది.
ఆ రోజు గురువుని స్మరించడం వలన త్రిమూర్తులని పూజించిన పుణ్యఫలం లభిస్తుంది. గురువుని త్రిమూర్తి స్వరూపంగా ఆరాధిస్తాం. మన సాంప్రదాయాలలో అలాంటి గురు పౌర్ణమి రోజు ఉదయాన్నే నిద్ర లేచి స్థానం చేసి గురువు ఫోటోలను అలంకరించుకోవాలి. గురువు అంటే ఆదిశంకరాచార్యులవారు లేదా రామానుజులు మరియు సాయిబాబా లేదా వారి వారి శాఖలకు లేదా సాంప్రదాయాలకు అనుగుణంగా గురువుల చిత్రపటాలను శుభ్రం చేసి వాటిని అలంకరించాలి. తర్వాత వారికి పూజలు చేయాలి. కొత్త వస్త్రాన్ని పరిచి దానిమీద బియ్యం పోసి దాని చుట్టూ నిమ్మకాయలను ఉంచాలి. ఆది శంకరుడు ఆయన నలుగురు శిష్యులు వచ్చి వాటిని అందుకుంటారు అని పెద్ద నమ్మకం . పూజ అయిన తర్వాత తల ఒక పిరకడు బియ్యాన్ని తీసుకొని ఇంట్లో ఉండే బియ్యంలో కలపాలి. బియ్యం కొత్త వస్త్రం అనేది లక్ష్మీదేవి చిహ్నాలు. నిమ్మ పండు కార్య సిద్ధికి సూచికాలు అందుచేత గురు పౌర్ణమి రోజు పూజ చేసేటప్పుడు కుంకుమ విభూది పెట్టుకునే దేవతా స్తుతి చేయాలి. గురు పౌర్ణమి రోజున నుదుటన బొట్టు పెట్టుకోకుండా దేవత సుత్తి ఎట్టి పరిస్థితులను చేయకూడదు.
Guru pournami : గురు పౌర్ణమి రోజు ఈ విధంగా పూజ చేస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతం….!
ఇక ఆరోజు సాయంత్రం 6 గంటల సమయంలో ఆలయానికి వెళ్లి అక్కడ ఆవు నెయ్యితో దీపాలు వెలిగించే వారికి సుఖసంతోషాలు చేకూరతాయి. గురు పౌర్ణమి రోజున వస్త్ర దానం చేసే వారికి సకల సంతోషాలు చేకూరుతాయని స్వయంగా వ్యాసమహర్షి చెప్పినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆషాడం శుద్ధ పౌర్ణమి రోజున గురు పూజ చేసే వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. వస్త్ర ఆభరణాల గోదానాలతో పాటు గురువుని పూజించిన వారికి అష్టైశ్వర్యాలు చేకురుతాయి. ఆడంబరాలు కాకుండా నిజమైన మనసుతో గురువుని గౌరవిస్తూ వారు చెప్పిన విషయాలను ఆచరణలో పెట్టడమే నిజమైన గురుభక్తి గురుదక్షిణ.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.