Hanuman Jayanthi : శనివారమే హనుమాన్ జయంతి.. శని పోవాలంటే ఈ పూజ చేయాల్సిందే! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Hanuman Jayanthi : శనివారమే హనుమాన్ జయంతి.. శని పోవాలంటే ఈ పూజ చేయాల్సిందే!

Hanuman Jayanthi : దేశ వ్యాప్తంగా ఉన్న హనుమాన్ భక్తులు ఏడాదంతా వేచి చూసేది.. హనుమాన్ జయంతి కోసమే. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 16వ తేదీన హనుమాన్ జయంతి రాబోతుంది. ప్రతి ఏటా చైత్రమాసం పౌర్ణమి రోజున హుమాన్ జయంతి పండుగను నిర్వహిస్తుంటారు. అయితే ఇదే రోజున ఆంజనేయ స్వామి జన్మించాడని మన పురాణాలు చెబుతున్నాయి. అయితే ఈ రోజున ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరడంతో పాటు శనీశ్వరుడు కూడా మన […]

 Authored By pavan | The Telugu News | Updated on :14 April 2022,6:00 am

Hanuman Jayanthi : దేశ వ్యాప్తంగా ఉన్న హనుమాన్ భక్తులు ఏడాదంతా వేచి చూసేది.. హనుమాన్ జయంతి కోసమే. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 16వ తేదీన హనుమాన్ జయంతి రాబోతుంది. ప్రతి ఏటా చైత్రమాసం పౌర్ణమి రోజున హుమాన్ జయంతి పండుగను నిర్వహిస్తుంటారు. అయితే ఇదే రోజున ఆంజనేయ స్వామి జన్మించాడని మన పురాణాలు చెబుతున్నాయి. అయితే ఈ రోజున ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరడంతో పాటు శనీశ్వరుడు కూడా మన ఇంటిని వదిలి వెళ్తాడని భక్తుల నమ్మకం. అంతే కాదు దంపతుల మధ్య ఎడబాటు ఉన్నవారు ఒకటవుతారని కూడా విశ్వసిస్తుంటారు. అందుకే హనుమాన్ జయంతి రోజు వేకువ జామునే లేచి ఆలయాలు వెళ్లడం.. ప్రత్యేక పూజలు చేయడం చూస్తుంటాం.

అయితే ఈ సారి హనుమాన్ జయంతి శరనివారం రోజున రావడంతో మరింత ప్రాముఖ్యత పెరిగింది. చాలా ఏళ్లుగా సమస్యలతో బాధ పడుతున్న వారు, ఇబ్బందులున్న వారు.. ఏవైనా కోరికలు ఉన్న వారు శనివారం రోజు ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజ చేసి.. మీ కోరికలన్నీ నెరవేర్చుకోండి. అయితే ముందుగా ఆంజనేయ స్వామి గుడికి వెల్లి దర్శనం చేసుకోవాలి. వాయు పుత్రుడి ముందు దీపం వెలిగించాలి. ఆలయ ప్రాంగణంలోనే కూర్చొని 11సార్లు హనుమాన్ చాలీసా చదవాలి. ఇలా చేయడం వల్ల ఆంజనేయ స్వామి కచ్చితంగా ప్రసన్నమవుతాడు. అంతే కాదండోయ్ శని దోషం పూర్తిగా తొలగిపోతుంది. అలాగే ఆంజనేయ స్వామికి ఇష్టమైన గులాబీ మాల, జిల్లేడు పూల మాలను హనుమాన్ కి సమర్పించాలి.

hanuman jayanthi special puja

hanuman jayanthi special puja

11 రావి ఆకులను తీస్కొని దానిపై రామ నామం రాసి… స్వామి వారి ముందుంచాలి. అలాగే తమలపాకులను కూడా సమర్పించాలి. సుందర కాడం పఠించడం వల్ల ఆంజనేయ స్వామి కృప మీపై ఉంటుంది.శనిదోషం పోగొట్టుకోవాలి అనుకునే వాళ్లు ఆవ నూనె దీపం వెలిగించడం మంచిది. అలాగే ఈ దీపంలో రెండు లవంగాలు ఉంచి పూజిస్తే మరింత మంచిది. మీ స్తోమతను బట్టి రామాయణం, శ్రీరామ రక్ష స్తోత్రం పఠించడం, సింధూరం, నూనె, తమలపాకులు సమర్పించడం వల్ల ఆంజనేయ స్వామి అమితానందం పొందుతాడు. అలాగే ఆవు నెయ్యితో చేసిన 5 రొట్టెలను నైవేద్యంగా సమర్పించండి. ఆంజనేయ జయంతి నాడు కొబ్బరి కాయ తీస్కొని గుడికి వెళ్లాలి. మీ తలపై కొబ్బరి కాయను పెట్టుకొనిఏడు సార్లు తాకించాలి. అనంతరం కొబ్బరి కాయను దేవుడి గదిలో పగలగొట్టండి. ఇలా చేయడం వల్ల జీవితంలో ఏర్పడిన అడ్డంకులు తొలగుతాయి.

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది