Kakabhushundi : రామాయణంలో కాకభూషుండి గురించి మీకు తెలుసా…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Kakabhushundi : రామాయణంలో కాకభూషుండి గురించి మీకు తెలుసా…!

Kakabhushundi  : రామాయణ చరిత్రలో ఉత్తరాఖండ లో కాకభూషుండి పాత్ర విలక్షణమైనది. కాకభూషుండి అత్యంత జ్ఞానవంతమైనవాడు మరియు రాముని భక్తుడు. కాకభూషుండికి ఒక మహర్షి శాపం కారణంగా తన జీవితం అంత కాకిల గడపాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు కాకభూషుండి ఎవరు.. ? రామ భక్తుడైన అతను కాకిల ఎందుకు మారాల్సి వచ్చింది..? ఇప్పుడు మనం తెలుసుకుందాం… Kakabhushundi  కాకభూషుండి ఎవరు… పురాణాల ప్రకారం పరమశివుడు పార్వతి దేవికి శ్రీ రాముని కథను వివరించాడు. అదే సమయంలో […]

 Authored By ramu | The Telugu News | Updated on :4 July 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Kakabhushundi : రామాయణంలో కాకభూషుండి గురించి మీకు తెలుసా...!

Kakabhushundi  : రామాయణ చరిత్రలో ఉత్తరాఖండ లో కాకభూషుండి పాత్ర విలక్షణమైనది. కాకభూషుండి అత్యంత జ్ఞానవంతమైనవాడు మరియు రాముని భక్తుడు. కాకభూషుండికి ఒక మహర్షి శాపం కారణంగా తన జీవితం అంత కాకిల గడపాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు కాకభూషుండి ఎవరు.. ? రామ భక్తుడైన అతను కాకిల ఎందుకు మారాల్సి వచ్చింది..? ఇప్పుడు మనం తెలుసుకుందాం…

Kakabhushundi  కాకభూషుండి ఎవరు…

పురాణాల ప్రకారం పరమశివుడు పార్వతి దేవికి శ్రీ రాముని కథను వివరించాడు. అదే సమయంలో ఒక కాకి కూడా ఈ కథని విన్నది. ఆ కాకినే మరో జన్మలో కాకభూషుండిగా పుట్టాడు. గత జన్మలో శివుని నోటి నుండి విన్న రాముని పూర్తి కథను కాకభూషుండి గుర్తుపెట్టుకున్నాడు. అయితే ఈ కథను అతను ఇతర వ్యక్తులు కూడా వివరించారు. శివుడు చెప్పిన కథని ఆధ్యాత్మ రామాయణం అంటారు.

Kakabhushundi  కథ విన్న పాముకి విముక్తి.

పురాణ గ్రంథాల ప్రకారం అత్యంత జ్ఞానవంతుడు అయినా కాకభూషుండి రామభక్తుడుగా వర్ణించబడింది. రామాయణంలో రాముడికి రావణుడికి మధ్య జరిగిన యుద్ధంలో రావణుడు యొక్క కుమారుడు మేఘనాథుడు శ్రీరాముడు మరియు లక్ష్మణుడిని పాముతో కట్టివేశారు. అప్పుడు నారద ముని ఆదేశానుసారం శ్రీరాముని లక్ష్మణుడు లను పాము బంధం నుంచి గరుత్మంతుడు విడిపించాడు.

సందేహాన్ని తొలగించిన కాకభూషుండి

శ్రీరాముడు పాముతో బంధించడం చూసి గరుత్మంతుడికి రామవతారం పై అనుమానం కలిగింది. అప్పుడు నారదుడు గరుత్మంతుడు సందేహాలను తీర్చడానికి బ్రహ్మదేవుడి వద్దకు పంపిస్తాడు. బ్రహ్మదేవుడు గరుత్మంతుని మహాదేవుని దగ్గరకు పంపిస్తాడు. మహాదేవుడు అతడిని కాకభూషుండి వద్దకు పంపిస్తాడు. కాకభూషుండి రాముని పాత్ర గురించి వివరించి గరుత్మంతుడి సందేహాలను తొలగించారు.

Kakabhushundi  కాకభూషుండి ఎలా కాకి అయ్యాడంటే.

గరుత్మంతుడి సందేహాలను తీర్చిన తర్వాత కాకభూషుండి కాకిగా మారిన కథను అతనికి వివరించాడు. మొదట కాకభూషుండి అయోధ్య పూరీలో ఒక శుద్రుని ఇంట్లో జన్మించాడు. అతను ఒక శివ భక్తుడు. అహంకార ప్రభావంతో శివశక్తిని పరదేవతలను నిందించడం మొదలుపెట్టాడు. అలా ఒకసారి అయోధ్యలో కరువు వచ్చింది. అప్పుడు అతను ఉజ్వయానికి వెళ్ళాడు. అక్కడ అతను ఒక బ్రాహ్మణుడికి సేవ చేస్తూ అక్కడే నివసించడం మొదలుపెట్టాడు. ఆ బ్రాహ్మణుడు కూడా శివభక్తుడే కానీ ఇతర దేవతలను నిందించలేదు. ఒకరోజు గురువు కాకభూషుండి చర్యలకు బాధపడుతూ శ్రీరాములపై ఉన్న భక్తిని కాకభూషుండి కి ప్రబోధించడం ప్రారంభించాడు.

శపించిన శివుడు.

అహంకారం మత్తులో కాకభూషుండి తన గురువుని అవమానించాడు. అయితే అప్పుడు శివుడికి కోపం వచ్చింది. ఇక దీనితో గురువుని అవమానించిన కాకభూషుండిని శివుడు శపించాడు. పాము రూపంలో పుట్టిన తరువాత 1000 సార్లు అనేక జాతుల్లో జన్మించాలి అని శివుడు కాకభూషుండికి శాపం ఇచ్చాడు. కాకభూషుండిని శివుడిని క్షమించమని కోరాడు. అప్పుడు శివుడు కాకభూషుండి చేసిన పాపాలను ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని చెప్పారు.

Kakabhushundi రామాయణంలో కాకభూషుండి గురించి మీకు తెలుసా

Kakabhushundi : రామాయణంలో కాకభూషుండి గురించి మీకు తెలుసా…!

లోమాష్ ఋషి శాపం.

కాకభూషుండి శ్రీరాముని పట్ల భక్తిని పెంచుకున్నాడు. అలా చివరకు బ్రాహ్మణ శరీరాన్ని పొందాడు. కాకభూషుండి జ్ఞానాన్ని పొందడం కోసం లోమాష్ ఋషి వద్దకు వెళ్లాడు.లోమాష్ ఋషి అతనికి జ్ఞానాన్ని పెంచే దిశగా సూచనలు సలహాలు ఇచ్చే సమయంలో కాకభూషుండి లోమాష్ ఋషి తో అనెక వాదనలు చేసేవాడు. అతని ప్రవర్తనకు ఆగ్రహించిన ఋషి కాకిగా మారమని శపించాడు. వెంటనే కాకభూషుండి ఎగిరిపోయాడు. శాప విముక్తి తర్వాత ఋషి పశ్చత్తాపడే కాకిని వెనకకు పిలిచాడు. రామ మంత్రాన్ని చెప్పి అనాయాస విముక్తిని పొందే వరాన్ని ఇచ్చారు. రామ మంత్రాన్ని స్వీకరించిన కాకి కాకభూషుండి అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది