Maha Shivratri 2023 : మహాశివరాత్రి నాడు ఉపవాసం ఎలా చేయాలి? ఏం తినాలి? ఏం తినకూడదు? గుడిలోని ప్రసాదం తింటే ఏమౌతుంది?
Maha Shivratri 2023 : అసలు మహాశివరాత్రి అంటే ఆరోజు అర్ధరాత్రి కోటి సూర్యకాంతులతో లింగాకారంగా ఉద్భవించాడు. ఇదే రోజు శివ పార్వతుల వివాహం కూడా జరిగింది. మహాశివరాత్రి నాడు శివ భక్తులు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేస్తారు. శివుడికి దగ్గరగా ఉంటారు. ఏ రోజు అయితే మాఘ మాస బహుళ చతుర్దశి రోజు చతుర్ధశ తిధి రాత్రి సమయంలో ఉంటుందో ఆ సమయంలో జాగరణ చేసి శివలింగానికి అభిషేకం చేయాలి. మహాశివరాత్రి రోజు సూర్యోదయానికి పూర్వమే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసి తలస్నానం చేయాలి.
తలస్నానం చేసిన తర్వాత పూజగదిని శుభ్రం చేయాలి. ఆ తర్వాత ఇంట్లో దీపం వెలిగించి శివుడి గుడికి వెళ్లి దర్శనం చేసుకోవాలి. శివరాత్రి రోజు ఉపవాసం చేయాలి. ఉపవాసం చేసే సమయంలో పండ్లు, పచ్చి పాలు మాత్రమే తీసుకోవాలి. ఉడికించిన, వండిన పదార్థాలు అస్సలు తినకూడదు. శివ నామ స్మరణ చేయాలి. దేవాలయంలో పెట్టే ప్రసారం తినవచ్చు. ఉపవాసం ఉన్నా కూడా అక్కడ పెట్టే ప్రసాదం తినాలి. ఎప్పుడైనా ప్రసాదం వద్దు అనొద్దు. ఈరోజు ఉపవాసం చేసే సమయంలో మంచంలో, కుర్చీలో కూర్చోకూడదు.
Maha Shivratri 2023 : రాత్రి 12 గంటలకు శివలింగానికి అభిషేకం చేయాలి
శివుడు అర్ధరాత్రి ఉద్భవించాడు కాబట్టి రాత్రి 12 గంటలకు శివలింగానికి అభిషేకం చేయాలి. లేదంటే.. గుడిలో శివలింగానికి అభిషేకం చేస్తున్నా చూస్తే చాలు. కోటి జన్మల ఫలితం లభిస్తుంది. పురాణాల ప్రకారం శివుడు గరళం మింగి మానవాళిని కాపాడిన రోజు శివరాత్రి అంటారు. అందుకే శివరాత్రి నాడు శివలింగానికి పూజ చేసి ఉపవాసం ఉండి రాత్రి మొత్తం జాగారం చేస్తే పుణ్యం, మోక్షం లభిస్తుందని పురాణాల్లో తెలియజేశారు. పరమ శివుడి కటాక్షం లభిస్తుంది. శివుడికి పత్రం, పుష్పం, ఫలం.. దేనితో అయినా పూజ చేసి ఆయన కటాక్షాన్ని పొందొచ్చు.