Diwali : దీపావళి రోజు ఏ నూనెతో దీపాలు వెలిగిస్తే మంచిది… శాస్త్రం ఏం చెబుతుందంటే….! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Diwali : దీపావళి రోజు ఏ నూనెతో దీపాలు వెలిగిస్తే మంచిది… శాస్త్రం ఏం చెబుతుందంటే….!

 Authored By ramu | The Telugu News | Updated on :19 October 2024,6:00 am

ప్రధానాంశాలు:

  •  Diwali : దీపావళి రోజు ఏ నూనెతో దీపాలు వెలిగిస్తే మంచిది... శాస్త్రం ఏం చెబుతుందంటే....!

Diwali : హిందూ మతంలో దీపావళి పండుగను ఆశ్వీయుజ అమావాస్య రోజున రాత్రి చిమ్మ చీకట్లలో వెలుగులు నింపుతూ దీపాలను వెలిగిస్తారు. అయితే ఈ పండుగ లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది. నువ్వుల నూనె వేసి వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని నమ్ముతారు. ప్రస్తుతం కొంతమంది దీపాలకు బదులుగా కొవ్వొత్తులను ,విద్యుత్ దీపాలను వెలిగిస్తున్నారు. అయితే ఇలా ఇంటి ముందు వెలిగిస్తే సరిపోతుంది. కానీ ఇంటి గుమ్మం మరియు తులసి చెట్టు దగ్గర మాత్రం మట్టి ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి వేసి వెలిగించిన దీపాలను పెట్టాలి. అయితే దీపావళి పండుగ రోజున ప్రదోష సమయంలో లక్ష్మీదేవిని పూజించుకోవాలి. ఇక ఈరోజున ధనలక్ష్మికి పూజ చేస్తే ధన ధాన్యాలు సంపద కలుగుతాయని పురోహితులు చెబుతున్నారు. దీపం జ్ఞానానికి సంపద ఐశ్వర్యం ఆనందానికి ప్రతీకగా భావిస్తారు. కాబట్టి దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి దీపాలను పెట్టుకుంటే అమ్మ అనుగ్రహం తప్పనిసరిగా లభిస్తుంది. శాస్త్రం ప్రకారం దీపావళిలో దీపా అంటే దీపం అని… ఇక అవలి అంటే వరస అని అర్థం. కాబట్టి దీపావళి అంటే ఇంటి ముందు నువ్వుల నూనెతో దీపాలను వరుసగా వెలుగుతాయో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని నమ్మకం. అలాగే దీపావళి పండుగరోజు సాయంత్రం లక్ష్మి దేవిని పూజించుకొని తులసి కోట దగ్గర స్త్రీలు దీపాలను వెలిగించుకోవాలి. మీరు పెట్టే దీపంలో సకల దేవతలు వేదాలు ఉంటారని నమ్ముతూ శాంతి క్రాంతికి గుర్తుగా దీపాలను వెలిగించాలి…

Diwali : దీపాలను ఏ విధంగా వెలిగించాలి

దీపావళి రోజున వెలిగించే దీపాలను ఆవునేతితో లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయడం మంచిది. అయితే మొదటి దీపంలో వేప నూనె రెండు చుక్కలు, ఆవునెయ్యి కలిపిన దీపాన్ని పరమ శివుని ముందు వెలిగించడం ద్వారా విజయం ప్రాప్తిస్తుంది. దీపాలను నేరుగా అగ్గిపుల్లతో వెలిగించకూడదు. ఒక దీపాన్ని అగరబత్తితో వెలిగించి ఆ దీపంతో మరొక దీపానికి వెలిగించుకుంటూ దీపారాధన చేయాలి. ఆవు నెయ్యిలో సూర్యశక్తి నిండి ఉండడం వలన ఆరోగ్య, ఐశ్వర్య, సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. అయితే శాస్త్రం ప్రకారం దీపారాధన కుందిలో 5 వత్తులు వేసి ఆ ఇంటి ఇల్లాలు స్వయంగా వెలిగించాలి.

Diwali దీపావళి రోజు ఏ నూనెతో దీపాలు వెలిగిస్తే మంచిది శాస్త్రం ఏం చెబుతుందంటే

Diwali : దీపావళి రోజు ఏ నూనెతో దీపాలు వెలిగిస్తే మంచిది… శాస్త్రం ఏం చెబుతుందంటే….!

మొదటి వత్తి భర్త, సంతానం సంక్షేమం కోసమని, రెండో వత్తి అత్త మామల క్షేమానికి, మూడోది అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళ క్షేమానికి, నాల్గవది గౌరవం, ధర్మవృద్ధిలకూ, అయిదోది వంశాభివృద్ధి కోసం వెలిగించాలి. ఇక అర్ధనారీశ్వరునికి దీపారాధన చెయ్యాలి అనుకునేవారు కొబ్బరి నూనె ఉపయోగించడం మంచిది. దీని వల్ల అనోన్య దాంపత్య జీవితం సిద్ధిస్తుంది. అదేవిధంగా విఘ్నేశ్వరుని పూజలో కొబ్బరినూనెను ఉపయోగించడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. అయితే చాలామంది దీపాలలో నువ్వుల నూనెలకు బదులుగా వేరుశనగ నూనెను ఉపయోగిస్తారు. కానీ ఇలా చేయకూడదు ఎందుకంటే నూవ్వుల నూనె సకల దేవతలకు ఇష్టం. కాబట్టి నువ్వుల నూనెతో వెలిగించే దీపాలు దుష్పలితాలను దూరం చేసి సకలశుభాలను ఇస్తుంది. కనుక దీపారాధనలో పొరపాటున కూడా వేరుశనగ నూనెను ఉపయోగించకూడదు.

Tags :

ramu

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి