Categories: DevotionalNews

గణపతిని ఆరాధిస్తే కలిగే ఫలితాలు ఇవే !

గణపతి.. సకలకార్యాలు దిగ్విజయం కావడానికి ఆరాధించే తొలి దైవం గణనాయకుడు. ఆయన అనుగ్రహం ఉంటేనే ఏ పని అయినా పూర్తవుతుంది. దేవతలు సహితం ఆయనను ఆరాధించనదే ఏ పని కూడా తలపెట్టరు. గణపతి బహురూపాలు ఉన్నాయి. ముఖ్యంగా 32 రకాల గణపతుల ఆరాధన ఎక్కువగా చేస్తారు. ఆయా రకాల గణపతి రూపాలను ఆరాధించడం వల్ల కలిగే ఫలితాలు తెలుసుకుందాం..

హరిద్ర గణపతి (పసుపుతో చేసిన గణపతి)

హరిద్ర గణపతిని పూజగదిలో పెట్టుకుని పూజిస్తే  అన్ని విధాల ధన, కనక, వస్తు,వాహనాలు వృద్ది చెందుతాయి. పసుపు గణపతి లేక హరిద్ర గణపతి పూజవలన దేహ కాంతి పెరుగుతుంది. సమస్త చర్మ రోగాలు నయం అవుతాయి .
పసుపు గణపతి లేక హల్దిగణపతి లేక హరిద్ర గణపతి పూజతో పాటు గౌరీ దేవీని పూజించటం ద్వార ఇంట్లో వుండే వధువుకు లేక వరుడుకు ఉన్న వివాహ దోషాలు తొలగిపోతాయి త్వరలో వివాహం నిశ్చయం అవుతుంది. హరిద్ర గణపతిని పూజిస్తే వారికి డబ్బు సమస్య రాదు .అప్పుల బాధ తొలగిపోతుంది.
కామెర్లు ఉన్నవారి ఇంటి వారు హరిద్ర గణపతిని దానంగా ఇస్తే కామెర్ల రోగం తొలిగిపోతుంది. దుకాణల్లో చాల రోజులుగా అమ్ముడు కాకుండా మిగిలివుండే వస్తువులఫై హరిద్ర గణపతిని తాకిస్తే వెంటనే వ్యాపారం అవుతుంది.

పగడపు గణపతి

పగడపు గణపతి ని పూజించటం వల్ల ఆరోగ్య రక్ష కలుగుతుంది. నరుల దిష్టి వంటి హాని కలగకుండా ఇది కాపాడుతుంది. ఇంటిలోగాని,వ్యాపారసంస్ధలలో గాని తూర్పు దిక్కు దోషాలు ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగంలో ఇబ్బందులు  ఉన్నవారు, నేత్రసమస్యలు ఉన్నవారు, తరచుగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ముఖ్యంగా రుణ విముక్తి కోసం పగడపు గణపతిని పూజించాలి.

మరకత గణపతి

మరకత గణపతిని పూజించడం ద్వారా తెలివితేటలు పెరుగుతాయి, జ్ఞాపకశక్తి పెరుగును. వ్యాపారం శ్రీఘ్రంగా అభివృద్దిపథంలో నడుస్తుంది. గుండె జబ్బులు, ప్రసరణ వ్యవస్థ లో లోపాలు,ఆపరేషన్ తర్వాత త్వరగా కొలుకోవడం, సరిచేస్తుంది. శరీరంలో ప్రాణ శక్తిని పెంపొందిస్తుంది.కంటి చూపు ని సరిగా ఉంచుతుంది. డబ్బు దుబార ని తగ్గిస్తుంది.

చందనం గణపతి

ఉద్యోగంలో  ఉన్నతి,  సంఘంలో గౌరవం కోసం చందన గణపతిని పూజించాలి.

స్ఫటిక గణపతి

భార్యాపుత్రులతో సుఖజీవనం, వృత్తి ఉద్యోగాలలో తగాదాలు లేకుండా ఉండడానికి స్పటిక గణపతిని పూజించాలి. వెండి గణపతిని పూజించిన ఇదే ఫలితం వస్తుంది.

నల్లరాతి గణపతి

అధిక శ్రమ నుంచి విముక్తి, శ్రమకు తగిన ఫలితం దక్కడానికి నల్లరాయితో చేసిన గణపతిని పూజించాలి .అంతేకాకుండా వీధి శూలాల నివారణకి కూడా నల్ల రాతి వినాయక విగ్రహలనే వాడడం మంచిది.

శ్వేతార్క గణపతి

శ్వేతార్కం లేదా తెల్ల జిల్లేడు మొక్క ఇంట్లో ఉంటే ఇక వారికి దారిద్య్ర బాధలు ఉండవు. శ్వేతార్క మూలానికి వశీకరణశక్తి ఉంటుంది. నరుల దిష్టి వంటి హాని కలగకుండా ఇది కాపాడుతుంది. ఇంటిలోగాని, వ్యాపారసంస్ధలలో గాని తూర్పు దిక్కు దోషాలు ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నవారు, నేత్రసమస్యలు ఉన్నవారు, తరచుగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు శ్వేతార్క గణపతిని పూజించటం గాని, శ్వేతార్క వేరుని తాయిత్తులలో ధరించటంగాని చేస్తే శుభప్రదం.

  • శ్రీవిద్య

Recent Posts

Blue Berries | బ్లూబెర్రీస్ .. ఆరోగ్యానికి సంజీవని ..చిన్న పండులో అపారమైన మేలు

Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్‌ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…

2 weeks ago

Remedies | మీన రాశి వారికి ఏలినాటి శని రెండో దశ ప్రారంభం..జాగ్రత్తగా ఉండాలని పండితుల హెచ్చరిక

Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…

2 weeks ago

Rukmini Vasanth | రుక్మిణి వసంత్ పేరిట మోసాలు .. సోషల్ మీడియాలో బహిరంగ హెచ్చరిక!

Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్  తన పేరుతో జరుగుతున్న మోసాలపై…

2 weeks ago

Moringa Powder | మహిళల ఆరోగ్యానికి అద్భుత ఔషధం మునగ ఆకు పొడి.. లాభాలు ఎన్నో

Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…

2 weeks ago

Sesame Seeds | మహిళలకు ఆరోగ్య వరం …చిట్టి గింజలతో లాభాలు ఎన్నో

Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…

2 weeks ago

Heart Attacks | భారతదేశంలో పెరుగుతున్న గుండెపోటులు.. నిపుణుల హెచ్చరిక!

Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…

2 weeks ago

Triphala Powder | త్రిఫల చూర్ణం పాలతో తాగితే కలిగే అద్భుత ప్రయోజనాలు.. శీతాకాలంలో ఎందుకు ప్రత్యేకం తెలుసా?

Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…

2 weeks ago

Mole | జ్యోతిషశాస్త్రం ప్రకారం కుడి బుగ్గపై పుట్టుమచ్చ ఉన్నవారి వ్యక్తిత్వ రహస్యాలు!

Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…

2 weeks ago