Maha Shivratri : మహాశివరాత్రి నాడు ఈ ఒక్క వస్తువుని తెచ్చుకుంటే శివుని అనుగ్రహం తప్పక కలుగుతుంది…!!
Maha Shivratri : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శివుడికి కొన్ని విషయాలంటే ఎంతో ప్రీతికరం. శివరాత్రి నాడు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే తప్పక శివుని అనుగ్రహం కలుగుతుంది. శివుని ఆశీస్సులతో కష్టాలన్నీ తొలగిపోతాయి. శివరాత్రి రోజు మీరు ఏ వస్తువులు ఇంటికి తెచ్చుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఏకముక రుద్రాక్షి : ఏకముక రుద్రాక్షి పరమ శివుని స్వరూపమని అంటుంటారు. ఇది హిందూ మతంలో శాంతి అలాగే శ్రేయస్సు గుర్తుగా చెప్తారు. మహాశివరాత్రి రోజు ఇంటికి తీసుకురావాలంటే రుద్రాక్షి కంటే గొప్పది ఇంకొకటి లేదు. మహాశివరాత్రి నాడు ఒక ముఖం రుద్రాక్షి తెచ్చి శివుని మంత్రాన్ని జపించి శుద్ధిచేసి ధరించాలి. దేవుడి ఇంట్లో ఉంచి పూజ చేసుకోవచ్చు..
మృత్యుంజయ మంత్రం : ఎవరి ఇంట్లో మృత్యుంజయ మంత్రం ఉంటుందో ఆ గృహంలో నీరసం, అనారోగ్యం, అశాంతి కలగవు. ఆ ఇంట్లో యంత్రం లేకపోతే మహాశివరాత్రి నాడు మృత్యుంజయ యంత్రాన్ని తెచ్చుకొని పూజించాలి.. రత్నాలతో చేసిన శివలింగం : శివలింగానికి జలాభిషేకం చేయకుండా శివరాత్రి సంపూర్ణం అవ్వదు. ఎవరికైనా గ్రహదోషం పోవాలంటే మహాశివరాత్రి రోజు శివలింగానికి జలాభిషేకం చేయాలి. రత్నాలతో కూడిన శివలింగాన్ని తీసుకొచ్చుకొని దేవుడి గదిలో ప్రతిష్టించాలి. నిత్యము పూజ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వలన గ్రహానికి సంబంధించిన అన్ని దోషాలు పోతాయి.. వెండి నంది : శివుని వాహనం నంది అన్ని శివాలయాలలో నంది విగ్రహాన్ని మనం చూస్తూనే ఉంటాం. మహాశివరాత్రి రోజు శివునితో పాటు నంది పూజ కూడా చేస్తుంటారు.
చేతిలో ధనం లేని వారు ఇంట్లో నిత్యం ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మహాశివరాత్రి నాడు వెండి నందిని తెచ్చి ఆరాధించాలి. ఆరాధన చేసిన తర్వాత డబ్బు జమ చేసిన ప్రదేశములు నందిని ఉంచుకోవాలి. ఈ విధంగా చేస్తే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి.. రాగి కలశం : మహాశివరాత్రి నాడు మీరు శివలింగానికి రాగి కలశంలో నీటిని సమర్పించడం వలన శివుని అనుగ్రహం కలుగుతుంది. కావున ఈ రోజున మీరు జలాభిషేకం కోసం రాగి కలశం తెచ్చుకోవాలి. ఇంట్లో ఎప్పుడు గొడవలు ఉంటే ఆ ఇంట్లో రాగి వస్తువులు తెస్తే సమస్యలన్నీ దూరమవుతాయి. ఇంట్లో శాంతి నేలకొంటుంది. అలాగే శివరాత్రి నాడు ఓం నమశివాయ అనే మంత్రాన్ని పఠించడం వలన అన్ని దోషాలు ,కష్టాలు తొలగిపోతాయి. జీవితంలో సంతోషంతో పాటు ఆర్థిక అభివృద్ధి కూడా కలుగుతుంది. నిత్యం శివ పూజ చేసే వాళ్ళు కు శివుని అనుగ్రహం తప్పక కలుగుతుంది..