Sankranti Special : సంక్రాంతి పిండి వంటలు ప్రత్యేకత గురించి మీకు తెలిస్తే షాక్ అవుతారు…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sankranti Special : సంక్రాంతి పిండి వంటలు ప్రత్యేకత గురించి మీకు తెలిస్తే షాక్ అవుతారు…!!

 Authored By prabhas | The Telugu News | Updated on :14 January 2023,7:00 am

Sankranti Special : సంక్రాంతి అంటే అందరూ పిండి వంటలు తప్పకుండా చేస్తూ ఉంటారు. అలాగే ఇంకొక ప్రత్యేకత ముగ్గులు, గొబ్బెమ్మలు, క్రీడలు కోడిపందాలు లాంటివి జరుగుతూ ఉంటాయి.. ఇవి మాత్రమే కాకుండా సంక్రాంతి పండుగకు పిండివంటలు కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. ఈ పండుగకు సాంప్రదాయ వంటలు పాకుండలు, అరిసెలు, సున్నుండలు, సకినాలు, నువ్వులు ఉండలు, జంతికలు ఇంకా ఎన్నో రకాల పిండి వంటలను చేస్తూ ఉంటారు. హిందువులు ఘనంగా జరుపుకునే పండగలలో ముఖ్య పండుగ సంక్రాంతి. సాంప్రదాయాలకు సంస్కృతి కి నెలవు. ఈ పండగ హిందువుల పండుగలను జరుపుకునే విధానం పండగ ప్రత్యేకతగా తినే ఆహార పదార్థాలు ఎన్నో ఆరోగ్య విషయాలు ఉన్నాయని చెప్తున్నారు.. ఈ పండగకు ఆయా సమయాన్ని బట్టి సాంప్రదాయ వంటలను తయారు చేస్తూ ఉంటారు.

ఈ క్రమంలో సంక్రాంతి వచ్చిందంటే చాలు గొబ్బెమ్మలు, ముగ్గులు, గంగిరెద్దులు, ఆటలు కోడిపందాలు ఇవే కాకుండా గుమలాడుతూ నోరూరించే ప్రత్యేకమైన వంటలను తయారు చేస్తూ ఉంటారు. ఇలా ప్రాంతాలను బట్టి కొన్ని రకాల పిండి వంటలు తయారు చేస్తారు. ఈ ఒక్కొక్క పిండి వంటకు ఒక్కొక్క రుచి ఒక ప్రత్యేకత వీటిని తినడం వలన ఎన్నో ఉపయోగాలు ఈ సంక్రాంతి పిన్ని వంటలు ఆరోగ్య విషయాల గురించి మనం చూద్దాం… నువ్వుల ఉండలు : తెల్ల నువ్వులు, బెల్లం కలిపి చేసే ఈ నువ్వుల ఉండలు ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. నువ్వుల్లో విటమిన్స్, ప్రోటీన్స్ ఉంటాయి. చలికాలంలో నువ్వులు ఉండని తినడం చాలా మేలు జరుగుతుంది. ఎముకలు బలహీనత ఉన్నవారు వీటిని తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది..

If you know the specialty of Sankranti pastry

If you know the specialty of Sankranti pastry

సున్నుండలు : సంక్రాంతి అంటే తెలుగులో ప్రధానంగా గోదావరి జిల్లాలో ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఉండే సాంప్రదాయ పిండి వంట ఇది నెయ్యి మినపప్పు బెల్లం పంచదారతో తయారు చేస్తూ ఉంటారు. మినుములు ఆరోగ్యానికి ఎంతో శక్తిని అందిస్తాయి. బెల్లం రక్తాన్ని శుద్ధి చేస్తే నెయ్యి ప్రోటీన్ ప్రోటీన్లు అందిస్తుంది. కొత్త అల్లుళ్లకు తప్పకుండా ఈ సున్నుండలను పెడుతూ ఉంటారు. మినప గారెలు ; కనుమ రోజు మినప తినమని సామెత ఉంది. కనుక కనుమ రోజున గారెలు కోడికూరలేని తెలుగులో అంటూ ఉండవు. అంటే అతిశయోక్తి కాదు రుచిలోనే కాదు పోషకాల్లో కూడా మిన్న ఈ మినప గారెలు పొట్టు తీయని మినుముల్లో పుష్కలంగా ప్రోటీన్లు మాంసకృతులు ఉంటాయి.

ఇప్పుడు మారుతున్న జీవనశైలి విధానంలో ఎన్నో ఫాస్ట్ ఫుడ్స్ స్వీట్లు కేకులు ఇలాంటివన్నీ తింటున్నారు చిన్న వయసులోనే ఎక్కువ ఉబకాయం ఇతర సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కనుక ఆరోగ్యానికి ఆరోగ్యం ఇచ్చి మన సాంప్రదాయ వంటలు పిల్లలకి తప్పనిసరిగా పెట్టాలి. అరిసెలు : సంక్రాంతి పండగ అంటేనే అందరికీ గుర్తొచ్చేది అరిసెలు తెలుగు రాష్ట్రాలలో ప్రధానంగా గోదావరి జిల్లాలో అరిసెలు లేని సంక్రాంతిని చేసుకోవడం చాలా కష్టం వీటిని కొత్త బియ్యం బెల్లం పిండితో తయారుచేస్తారు.

అదనపు రుచి కోసం కొబ్బరి నువ్వులు కూడా వేస్తారు. ఈ ఫుడ్ ఐరన్ తో సహా ఎన్నో పోషకాలు శరీరానికి లభిస్తూ ఉంటాయి. జంతికలు : పండగలు సంబంధం లేకుండా అన్ని రకాల వయసుల వారిని అలరించే వంటకం జంతికలు సంక్రాంతికి జంతికలు ప్రతి ఇంట్లోనూ తప్పకుండా చేసే పిండి వంటకం రకరకాల రుచులతో తయారు చేసుకున్న ఈ జంతికలు ఐటెం బియ్యం, పెసరపప్పు లేదా శనగపిండి ఉప్పు కారం నువ్వులు జోడించి తయారు చేస్తూ ఉంటారు. ఇంకొందరు వాము కూడా వేస్తూ ఉంటారు ఇవి తేలిగ్గా జీర్ణం అవుతుంది.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది