Surya Aradhana
Surya Aradana : సూర్యుడు.. సాక్షాత్తు దైవంగా అందరూ భావిస్తారు. ఆరాధిస్తారు. అనాదిగా సూర్యారాధనకు విశేషమైన ఆదరణ ఉంది. పూర్వీకులు సూర్యుడిని ఆరాధించి అనేక ప్రయోజనాలు పొందినట్లు మనకు అనేక పురాణాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఈ కాలంలో ఆరోగ్యం కోసం పలు వైద్యశాలలు వెళ్తుంటారు. కానీ నిజానికి ఆరోగ్యం కోసం పూర్వీకులు చెప్పిన విధానాలు పాటిస్తే తప్పక ఆరోగ్యం లభిస్తుంది. పలువురు ఈ విషయాన్ని నిరూపించారు కూడా. ప్రస్తుతం శ్రీకృష్ణుని కుమారుడు సాంబుడు కుష్టు రోగగ్రస్తుడైనపుడు సాక్షాత్తూ శ్రీకృష్ణుడి ఆదేశం ప్రకారం సాంబుడు సూర్యోపసన చేసాడు. దీంతో సూర్య భగవానుడు అతనికి స్వప్న దర్శనమిచ్చి తన ఏకవింశతి నామావళిని వినిపించి, పారాయణం చేయమన్నాడని పురాణాలలో ఉంది. అత్యంత ప్రభావవంతమైన ఈ స్తోత్రాన్ని ఎవరైతే సూర్యోదయ సమయంలో పఠిస్తారో వారికి తప్పక ఆయుః, ఆరోగ్యం కలుగుతాయి.
If you worship the sun with this hymn, diseases will be eaten!
‘‘ భాస్కరో భగవాన్ సూర్యః చిత్రభానుర్విభావసుహు
యమః సహస్రాంశుమాలీయమునా ప్రీతిదాయకః
దివాకరో జగన్నాధః సప్తాశ్వస్య ప్రభాకరః
లోక చక్షుః స్వయంభూశ్చ ఛాయారతి ప్రదాయకః
తిమిరారిర్దినధవో లోకత్రయ ప్రకాశకః
భక్తబంధుః దయాసింధుః కర్మసాక్షీ పరాత్పరః
ఏకవింశతి నామాని, యః పఠేదుదితే మయి
తస్య శాంతిం ప్రయచ్ఛామి సత్యం సత్యం వదామ్యహమ్’’
ఈ సూర్యారాధన చేస్తే ఆయువు, ఆరోగ్యం పెరుగుతాయి. శుచితో భక్తితో సూర్యోదయం సమయంలో ఈ ఆరాధన చేయాలి. కనీసం 40 రోజులు చేస్తే మీకు మంచి ఫలితాలు కన్పిస్తాయి.
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
This website uses cookies.