NTR : ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ఒకటే టాపిక్. అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది. ఏ హీరో.. ఏ దర్శకుడితో సినిమా కమిటవుతున్నాడు..ఎందుకు కమిటయిన కాంబినేషన్ క్యాన్సిల్ అయి అభిమానులను డిసప్పాయింట్ చేస్తున్నారు అని. అందుకు కారణం రీసెంట్‌గా కొన్ని క్రేజీ కాంబినేషన్‌లో అనుకున్న పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ తాత్కాలికంగా హోల్డ్‌లో పడటమే. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొమురం భీంగా ఎన్టీఆర్ నటిస్తున్న ఈ పాన్ ఇండియన్ సినిమాలో మెగా పవర్ స్టార్ రాం చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.
ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ – మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఒక పాన్ ఇండియన్ సినిమా ఎప్పుడో ప్రకటన వచ్చింది. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లో 30గా ఎన్టీఆర్ ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తారని వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ తర్వాత చేయాల్సిన సినిమా ఇదే. అయితే తాజాగా ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్‌లో సినిమా అనౌన్స్ అయి షాకిచ్చారు. యువ సుధ ఆర్ట్స్ బ్యానర్ – ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మించబోతున్నాయి.
అయితే కొరటాల శివ ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్‌తో సినిమా చేయాల్సింది. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న పుష్ప సినిమా తర్వాత కొరటాల శివ సినిమా చేయాలి. కానీ ఇప్పుడు తాజాగా వచ్చిన ప్రకటనతో అనుకున్న కాంబినేషన్స్ మొత్తం మారిపోయాయి. అల్లు అర్జున్ నెక్స్ట్ ఐకాన్ చేస్తాడా లేక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా ప్లాన్ చేస్తాడా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ఎన్టీఆర్ తో కాకుండా త్రివిక్రమ్ మహేష్‌తో సినిమా చేయనున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా కాంబినేషన్స్ మారడంతో ఎన్టీఆర్, బనీ ఫ్యాన్స్ మాత్రం బాగా డిసప్పాయింట్ అవుతున్నారట.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.