ఈ స్తోత్రంతో సూర్యారాధన చేస్తే రోగాలు మాయం !

Authored By Devotional Desk | The Telugu News | Published on: April 15, 2021, 6:00 am

Surya Aradana  :  సూర్యుడు.. సాక్షాత్తు దైవంగా అందరూ భావిస్తారు. ఆరాధిస్తారు. అనాదిగా సూర్యారాధనకు విశేషమైన ఆదరణ ఉంది. పూర్వీకులు సూర్యుడిని ఆరాధించి అనేక ప్రయోజనాలు పొందినట్లు మనకు అనేక పురాణాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఈ కాలంలో ఆరోగ్యం కోసం పలు వైద్యశాలలు వెళ్తుంటారు. కానీ నిజానికి ఆరోగ్యం కోసం పూర్వీకులు చెప్పిన విధానాలు పాటిస్తే తప్పక ఆరోగ్యం లభిస్తుంది. పలువురు ఈ విషయాన్ని నిరూపించారు కూడా. ప్రస్తుతం శ్రీకృష్ణుని కుమారుడు సాంబుడు కుష్టు రోగగ్రస్తుడైనపుడు సాక్షాత్తూ శ్రీకృష్ణుడి ఆదేశం ప్రకారం సాంబుడు సూర్యోపసన చేసాడు. దీంతో సూర్య భగవానుడు అతనికి స్వప్న దర్శనమిచ్చి తన ఏకవింశతి నామావళిని వినిపించి, పారాయణం చేయమన్నాడని పురాణాలలో ఉంది. అత్యంత ప్రభావవంతమైన ఈ స్తోత్రాన్ని ఎవరైతే సూర్యోదయ సమయంలో పఠిస్తారో వారికి తప్పక ఆయుః, ఆరోగ్యం కలుగుతాయి.

If you worship the sun with this hymn, diseases will be eaten!

If you worship the sun with this hymn, diseases will be eaten!

Surya Aradana  : సాంబ సూర్యస్తుతి :

‘‘ భాస్కరో భగవాన్ సూర్యః చిత్రభానుర్విభావసుహు
యమః సహస్రాంశుమాలీయమునా ప్రీతిదాయకః
దివాకరో జగన్నాధః సప్తాశ్వస్య ప్రభాకరః
లోక చక్షుః స్వయంభూశ్చ ఛాయారతి ప్రదాయకః
తిమిరారిర్దినధవో లోకత్రయ ప్రకాశకః
భక్తబంధుః దయాసింధుః కర్మసాక్షీ పరాత్పరః
ఏకవింశతి నామాని, యః పఠేదుదితే మయి
తస్య శాంతిం ప్రయచ్ఛామి సత్యం సత్యం వదామ్యహమ్’’

ఈ సూర్యారాధన చేస్తే ఆయువు, ఆరోగ్యం పెరుగుతాయి. శుచితో భక్తితో సూర్యోదయం సమయంలో ఈ ఆరాధన చేయాలి. కనీసం 40 రోజులు చేస్తే మీకు మంచి ఫలితాలు కన్పిస్తాయి.

Devotional Desk

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp