Holi Festival : చిన్న పెద్ద ఎంతో ఘనంగా జరుపుకునే హోలీ పండుగ రానే వచ్చింది. ఇక ఈ హోలీ పండుగ రోజు చిన్న పెద్ద అంతా కలిసి రంగులు లేదా రంగు నీళ్లను ఒకరిపై ఒకరు చల్లుకుంటూ ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. అయితే ఈ హోలీ పండుగను కేవలం భారతీయులు మాత్రమే కాదు నేపాల్ బంగ్లాదేశ్ లో కూడా జరుపుకుంటారని చెప్పాలి. అయితే హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. ప్రతి ఏడాది పాల్గొన మాసంలో పౌర్ణమి రోజున ఈ హోలీ పండుగ అనేది వస్తుంది. అయితే ఈ ఏడాది మార్చి 25న హోలీ పండుగ వచ్చింది. ఇక ఈ హోలీ పండుగ జరుపుకోవడానికి కొన్ని పురాణ కథలు కూడా ఉన్నాయి. అయితే రాక్షస రాజు హిరణ్య కశకుడు కుమారుడు ప్రహ్లాదుడు విష్ణుమూర్తి భక్తుడు. అయితే ప్రహ్లాదుడు నిత్యం విష్ణుమూర్తి నామస్కరణ చేస్తున్నాడాని సహించలేని హిరణ్య ప్రహ్లాదుడిని అనేక రకరాలుగా బెదిరించే ప్రయత్నం చేస్తాడు. అయినప్పటికీ ప్రహ్లాదుడిలో ఎలాంటి మార్పు ఉండదు. దీంతో హిరణ్యుడు ప్రహ్లాదుడుని చంపేయాలని ప్రయత్నాలు కూడా చేస్తాడు. ఈ క్రమంలోనే తన సోదరి హోలికను పిలిచి ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకొని చితిలోకి దూకాల్సిందిగా హిరణ్యుడు ఆజ్ఞాపిస్తాడు.
అయితే సోదరుడు హిరణ్య ఆదేశాల మేరకు హోలిక ప్రహ్లాద్రుడుతో సహా మంటల్లో దూకేస్తుంది. ఇక అదే సమయంలో ప్రహ్లాదుడు శ్రీమహావిష్ణువుని పూజిస్తాడు. దీంతో ప్రహ్లాదుడు సజీవంగా బయటకు వస్తాడు. హిరణ్య సోదరి హోలిక మాత్రం అగ్నికి ఆహుతి అయిపోతుంది. అందుకే ఈ పండుగను హోలిక పూర్ణిమా అని కూడా పిలుస్తారు. ఇక ఆ రోజే హోలిక దహనం కూడా చేస్తారు. అందుకే ఈ హోలీ పండుగను ప్రజలు జరుపుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. ఇక ఈ పండుగ రోజు భగవంతుని ఆరాధన చేసిన తర్వాత రంగుల కేళి నిర్వహిస్తారు. ఇక ఈ పండుగ రోజు విష్ణు లక్ష్మీదేవి మరియు రాధాకృష్ణులను ఎక్కువగా పూజిస్తారు. తమ ఇంట్లో సిరిసంపదలు అలాగే అందరూ ఆరోగ్యంగా ఉండాలని పూజలు చేస్తారు. అయితే ఈ అపూర్వమైన పండుగ రోజు ఈ మొక్కను పూజించడం ద్వారా అనేక రకాల బాధలు తొలుగుతాయని ప్రజల నమ్మకం. ఈ మొక్కను పూజించడం వలన సమస్త కోరికలు తీరతాయట. ఇంతకీ ఆ మొక్క ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అయితే ఆ మొక్క పేరు ఇంద్రజాల్. పురాణాల ప్రకారం ఇంద్రుడు ఒకానొక సందర్భంలో రావణాసురునితో యుద్ధం చేస్తున్నప్పుడు తన మాయజాలాన్ని సముద్రంలో పరిచారట. ఇక అదే ఇంద్రజాల మొక్కగా మారిందని పురాణాలు చెబుతున్నాయి. ఇక ఈ ఇంద్రజాల్ మొక్క అనేది ఓ సముద్రపు మొక్క. ఈ మొక్క చాలా అరుదుగా దొరుకుతుంది.ఇక ఈ మొక్కలు మనకు రామేశ్వరం ,అండమాన్ ,నికోబార్ , లక్షదీప్ , సింగపూర్ వంటి సముద్ర తీరాలలో మాత్రమే దొరుకుతాయి. అయితే ఆర్థిక సమస్యలు వ్యాపార సమస్యలు కుటుంబ సమస్యలతో బాధపడేవారు దీనిని పూజిస్తే మంచి ఫలితాలను పొందుతారు. పురాణాలలో దీనిని ఒక శక్తివంతమైన మొక్కగా భావిస్తారు. అంతేకాక క్షీరసాగరం నుండి చాలా వస్తువులు వచ్చినట్లే ఈ మొక్క కూడా వచ్చినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. అందుకే దీనిని ఇంద్రుడు శక్తిని ప్రదర్శించే మొక్కగా పండితులు చెబుతుంటారు.
ఇంతటి మహిమ కలిగివున్న ఈ మొక్కను హోలీ రోజు పూజ చేసుకొని ఫ్రేమ్ గా చేసి ఇంట్లో ఉత్తర గోడకు తగిలించినట్లయితే శుభ ఫలితాలు పొందుతారట. ఈ విధంగా మొక్కను ఇంట్లో ఉంచడం వలన వాస్తు దోషాలు నరదృష్టి తొలగిపోతుంది. కావున ఈ హోలీ పండుగ రోజు మీరు కూడా ఈ మొక్కను పూజించి ఇంట్లో పెట్టుకోవడం వలన మంచి ఫలితాలను పొందవచ్చు.
గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. ది తెలుగు న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
This website uses cookies.