Dussehra 2024 : ఈ ఏడాది దసరా ఎప్పుడు జరుపుకోవాలి..? శుభ సమయం ఎప్పుడు అంటే…!
ప్రధానాంశాలు:
Dussehra 2024 : ఈ ఏడాది దసరా ఎప్పుడు జరుపుకోవాలి..? శుభ సమయం ఎప్పుడు అంటే...!
Dussehra 2024 : ప్రతి ఏడాది అస్తయుజమాసంలోని శుక్లపక్షంలో దసరా పండుగను జరుపుకుంటారు. అయితే దసరా పండుగ అనేది హిందూమతంలోనే అత్యంత ముఖ్యమైన పండుగ. ఇక ఈ దసరా పండుగను చెడుపై మంచి విజయం సాధించినందుకు గాను జరుపుకుంటారు. అయితే పురాణాల ప్రకారం ఇదే రోజున శ్రీరాముడు లంక రాజు అయినటువంటి రావణాసురుడుని సంహరిస్తాడు. అంతేకాక ఇదే రోజున దుర్గాదేవి మహిషాసురుని సంహరిస్తుంది.అందుకే ఈరోజును విజయదశమి అని కూడా పిలుస్తారు. ఇక ఈ విజయదశమిలో దుర్గాదేవిని ప్రతిష్టించి నవరాత్రులు పూజిస్తారు. నవరాత్రులు ముగిసిన తర్వాత పదవరోజు దసరా పండుగను జరుపుకుంటారు. ఇక ఈ రోజు అనేక ప్రాంతాలలో రావణుడి దిష్టిబొమ్మను కూడా దహనం చేస్తూ ఉంటారు. మరి హిందూమతంలో ఇంతటి ప్రాముఖ్యత కలిగి ఉన్న ఈ దసరా పండుగ ఈ ఏడాది ఎప్పుడు జరుపుకోవాలి..శుభ సమయాలు ఏంటి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Dussehra 2024 దసరా 2024
హిందూ క్యాలెండర్ ప్రకారం దసరా పండుగ అశ్వయుజ మాసంలో దశమ తిది అక్టోబర్ 12 ఉదయం 10:58 గంటలకు ప్రారంభం కానుంది. అనంతరం మరుసటి రోజు అక్టోబర్ 13 ఉదయం 9:08 గంటలకు దశమి తిది ముగుస్తుంది.
Dussehra 2024 శుభ సమయం ఎప్పుడు అంటే
పంచాంగం ప్రకారం దసరా రోజు పూజకు శుభ సమయం మధ్యాహ్నం 2:03 నిమిషాల నుండి 2:45 వరకు ఉంటుంది. అంటే ఈ ఏడాది 46 నిమిషాల పాటు పూజలకు సమయం ఉంటుంది.
Dussehra 2024 పూజా విధానం…
దసరా పండుగ రోజు అభిజిత్ ముహూర్తంలో పూజలు నిర్వహించడం అనేది శుభప్రదంగా పరిగణించబడుతుంది. అయితే దసరా పూజను ఎల్లప్పుడూ ఈశాన్యం మూలలోనే నిర్వహించాలి.
దీనికోసం ముందుగా మీరు పూజా స్థలాన్ని గంగాజలంతో శుభ్రం చేసుకోవాలి.
అనంతరం తామర రేకులతో అష్ట భుజాలను తయారు చేసుకోవాలి.
ఈ సమయంలో అపరాజీతా దేవిని ప్రతిష్టించి ఆనందం మరియు కుటుంబ శ్రేయస్సు కోసం ప్రార్థించండి.
ఆ తర్వాత శ్రీరాముడు మరియు ఆంజనేయస్వామిని పూజించి నైవేద్యం సమర్పించాలి.
ఇక పూజ పూర్తయ్యే ముందు అమ్మవారికి హారతి ఇచ్చి నైవేద్యాలను సమర్పించాలి. అనంతరం ఆ ప్రసాదాలను అందరికీ పంచాలి.