Maha Shivratri 2023 : మహాశివరాత్రి నాడే శని త్రయోదశి.. ఆ రోజు శనీశ్వరుడికి దీపం ఇలా పెడితే జన్మ జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి
Maha Shivratri 2023 : ఫిబ్రవరి 18న మహాశివరాత్రితో పాటు శని త్రయోదశి రెండూ కలిసి వచ్చాయి. ఇది అత్యద్భుతమైన పుణ్య తిధి అది. ఈరోజున సాధారణంగా చాలామందికి కొన్ని సందేహాలు ఉన్నాయి. శివరాత్రి ముందు జరుపుకోవాలా? లేక శని పూజ ముందు జరుపుకోవాలా? అని. శనికి సంబంధించిన వాళ్లు ప్రదోషకాలంలోనే జరుపుకోవాలి. శనివారం త్రయోదశి తిధి కాబట్టి సాయంత్రం 5.39 నిమిషాల తర్వాత రాత్రి 8 గంటల వరకు ఉంటుంది.
ప్రదోషకాల సమయానికి గొప్పది శనిత్రయోదశి. శని దీపం పెట్టుకోవాలి. ఇప్పటి వరకు అక్షయ దీపం, లక్ష్మీ దీపం.. అంటూ రకరకాల దీపాలు పెట్టారు కానీ.. శని దీపం గురించి గరుడ పురాణంలో చెప్పారు. పాప కర్మలు చేసినా ఆయొక్క పాప కర్మల ఫలితాన్ని తగ్గించేందుకు విష్ణు భగవాణుడు చెప్పిన పరిష్కారం అది. శని దీపాన్ని ఏర్పరుచుకోవడం. గేదె నెయ్యి, నువ్వుల నూనె, ఆముదం. ఈ మూడింటిని సముపాళ్లలో తెచ్చుకొని శనికి దీపారాధన చేయాలి.
Maha Shivratri 2023 : జాతక రిత్యా వచ్చే సకల దోషాలు పోవాలంటే.. పొట్టు తీయని నల్ల మినుములు, నల్ల నువ్వులు, గల్ల ఉప్పు ఇవన్నీ పిండి చేసుకోవాలి. నల్ల బెల్లం కూడా పిండి చేసుకోవాలి. వీటన్నింటినీ కలిపి ముద్దలా తయారు చేసి ప్రమిదలా చేసి.. గేదె నెయ్యి, నల్ల నువ్వుల నూనె, ఆముదం నూనె వేసి తెల్ల వత్తులతో దీపారాధన చేయాలి. సాయంత్రం 5.40 నుంచి రాత్రి 8 గంటల వరకు దీపారాధన చేస్తే చాలా మంచిది.
జీవితంలో వృద్ధి లభించాలంటే చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేయాలి. ఈశ్వరుడికి శివరాత్రి నాడు అర్చన చేస్తే అభిషేకం చేస్తే శుభ ఫలితాలు వస్తాయి. అనారోగ్యంతో ఉన్నవాళ్లు, చదువులో రాణించాలనుకునే వాళ్లు, వివాహం కావాలనుకునే వాళ్లు, సంతానం కావాలనుకునే వాళ్లు కూడా శనీశ్వరుడికి పైన చెప్పిన విధంగా దీపారాధన చేయాలి.