Zodiac Signs : 2025 లో ఈ రాశుల వారికి డబ్బు మూటలు విసురుతున్న శుక్రుడు…!
ప్రధానాంశాలు:
Zodiac Signs : 2025 లో ఈ రాశుల వారికి డబ్బు మూటలు విసురుతున్న శుక్రుడు...!
Zodiac Signs : 2025 వ సంవత్సరంలో విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు మొదటిసారి శతబిషా నక్షత్రంలోకి జనవరి 4వ తేదీన ఉదయం 4:47 నిమిషాలకు ప్రవేశించాడు. ఇలా జనవరి 17వ తేదీ 7:51 నిమిషాల వరకు ఉండి ఆ తర్వాత పూర్వభద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఇలా శుక్రుడు శుక్రుడి నక్షత్ర సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
Zodiac Signs మేష రాశి
శుక్రుడి సంచారంతో మేష రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థికంగా అనేక ప్రయోజనాలను పొందుతారు. అయితే మేష రాశి జాతకుల వారికి సంపద స్థానంలో శుక్రుడు ఉన్నందున వీరికి ఆకస్మిత ఆర్థిక ధన లాభాలు మరియు శ్రేయస్సు లభిస్తాయి. ఇక వృత్తిపరంగా వీరికి బాగా కలిసి వస్తుంది. అలాగే సహ ఉద్యోగుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు నూతన వాహనాలను మరియు గృహాలను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
మిధున రాశి : శుక్రుడు శతభిషా నక్షత్రం లోకి ప్రవేశించడం వలన మిధున రాశి జాతకులకు శుభప్రదంగా ఉంటుంది. అయితే మిధున రాశిలో శుక్రుడు తొమ్మిదో స్థానంలో ఉండడం వలన వీరు కొన్ని సానుకూల మార్పులను చూస్తారు. దీంతో వారి జీవితంలో విజయాలను సాధిస్తారు. ముఖ్యంగా వృత్తి వ్యక్తిగతంగా మంచి పురోగతి ఉంటుంది. ఇక కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు తొలగి బంధాలు బలపడతాయి. కొన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం వలన లాభాలు చేకూరుతాయి.
వృశ్చిక రాశి: శతభిషా నక్షత్రంలోకి శుక్రుడు ప్రవేశించటం వలన వృశ్చిక రాశి జాతకులు అనేక ప్రయోజనాలను పొందుతారు. ఈ సమయంలో ఈ రాశి వారు నూతన వాహనాలను ఇల్లు ఆస్తులను కొనుగోలు చేస్తారు. శతభిషా నక్షత్రంలోకి శుక్రుడు ప్రవేశించడం వలన వృశ్చిక రాశి జాతకుల జీవితంలో అనేక మార్పులు సంభవిస్తాయి. ఇక వర్తక వ్యాపారాలు చేసే వారికి మంచి లాభాలు ఉంటాయి. అదేవిధంగా వ్యాపారంలో నూతన అవకాశాలు రావడంతో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం.