Vastu : వంట గదిలో పూజ గది ఉండడం మంచిదేనా… వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారంటే…!
ప్రధానాంశాలు:
Vastu : వంట గదిలో పూజ గది ఉండడం మంచిదేనా... వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారంటే...!
Vastu : ప్రతి ఒక్కరికి సొంతంగా ఇల్లు నిర్మించుకోవాలనే కోరిక ఉంటుంది. ఆ కోరికతోనే తక్కువ స్థలం ఉన్నప్పటికీ ఎలాగోలా ఇల్లుని నిర్మించేస్తున్నారు.ఈ క్రమంలోనే సరిపడ చోటు లేక ఇంటి నిర్మాణంలో పలు రకాల తప్పులు చేస్తున్నారు.మరీ ముఖ్యంగా పూజగది విషయంలో కొన్ని రకాల పొరపాటు చేయడం వలన అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుత కాలంలో చాలామంది తమ కొత్త ఇంట్లో చోటు సరిపోక లేదా మరేదైనా కారణం వల్ల పూజగదిని కిచెన్ లేదా బెడ్ రూమ్ హాల్ లో ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే వాస్తు ప్రకారం పూజగది ఎక్కడ ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఆర్థిక ప్రయోజనాలు కలగడం కోసం పూజ గది ఎక్కడ పెట్టుకుంటే మంచిది. ఈ పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
-సాధారణంగా ఇరుకు గదులు ఉండడం వలన కొంతమంది కిచెన్ లోనే పూజగదిని ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే పూజగది కచ్చితంగా ఇతర గదులకు దూరంగా ఉండాలి. అలాగే శబ్దాలు లేని ప్రదేశంలో పూజాగదిని ఉంచడం మంచిది.
– పూజ చేస్తే ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. మరి ఇలా ఉండాలి అంటే పూజ గదిని ఎప్పుడు అందంగా అలంకరించాలి. ముఖ్యంగా ఇంట్లో పూజ చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తగ్గి పాజిటివ్ శక్తి పెరుగుతుంది.
– వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి పూజ గది తూర్పు ,ఈశాన్య మూల లేదా ఉత్తరమూలలో ఉండాలి. ఎందుకంటే పూజ చేసుకోవడానికి ఇవి అనుకూలమైన ప్రదేశాలు. ఈ దిశగా పూజలను నిర్వహించడం శుభప్రదం.
– వాస్తు శాస్త్ర ప్రకారం చూసుకున్నట్లయితే వంట గదిలో పూజాగది అసలు ఉండకూడదు. వంటగది అనేది అగ్ని మూలకంతో ముడిపడి ఉండడం వలన ఇంట్లో సానుకూల శక్తి తగ్గిపోతుంది. అలాగే వంటగదిలో వివిధ ఆహార పదార్థాలను వండుతారు. కొన్ని సందర్భాలలో మాంసాహారం కూడా వండుతారు. కాబ్బటి వంట గదిలో పూజ గది లేకపోవడమే మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
– కొత్తగా నిర్మించే ఇళ్లలో పూజ గదిని ప్రత్యేకంగా కట్టించుకోవడం వలన మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఇక ఈ పూజ గదిని వంటగదితో కానీ బెడ్ రూమ్ తో గాని సంబంధం లేకుండా ఉండేలా చూసుకోవాలి.అప్పుడే మీరు ఇంట్లో చేసే పూజలకు ఫలితాలు లభిస్తాయి. లేకపోతే తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుంది.