Mirror | రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదా? .. మీ ఇంట్లో వాస్తు దోషాలే కారణమా!
Mirror | నిద్ర మన ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో చెప్పనక్కర్లేదు. వైద్యుల ప్రకారం ప్రతి వ్యక్తి రోజుకు కనీసం 8 గంటలు నిద్రపోవాలి. అయితే కొంతమంది ఒత్తిడి, కుటుంబ సమస్యల వలన నిద్ర సరిగా పడక ఇబ్బంది పడతారు. కానీ కొంతమంది మాత్రం ఎలాంటి టెన్షన్ లేకున్నా రాత్రిళ్లు సరిగా నిద్రపట్టదని చెబుతారు. దీనికి కారణం వాస్తు దోషాలు కావచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
వాస్తు ప్రకారం ఇంట్లోని కొన్ని అమరికలు, దిశలు సరిగ్గా లేనప్పుడు శరీరానికి, మనసుకు సమతుల్యత దెబ్బతింటుందని చెబుతున్నారు. ఇక ఏ వాస్తు లోపాలు నిద్రపై ప్రభావం చూపుతాయో చూద్దాం
#image_title
1. బెడ్‌రూమ్‌లో వస్తువుల అమరిక
రాత్రిళ్లు సరిగా నిద్ర పట్టకపోతే, ముందుగా మీ బెడ్‌రూమ్‌లో వాస్తు సరిగా ఉందో లేదో చెక్ చేయాలి. మంచం సరైన దిశలో ఉందా, గదిలో అడ్డంగా వస్తువులు ఉన్నాయా అనే విషయాలు పరిశీలించాలి. ఈ చిన్న మార్పులతోనే వాస్తు సంతులనం వస్తుంది.
2. అద్దం ఉంచకండి
బెడ్‌రూమ్‌లో అద్దం ఉంచడం వాస్తు ప్రకారం మంచిది కాదు. అద్దం బెడ్ ఎదురుగా ఉంటే శక్తి ప్రవాహం దెబ్బతింటుందని, దాంతో నిద్ర భగం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
3. బెడ్‌రూమ్‌లో తినకండి
చాలా మంది సౌలభ్యం కోసం బెడ్‌రూమ్‌లోనే తినేస్తారు. కానీ ఇది వాస్తు శాస్త్రం ప్రకారం తీవ్రమైన తప్పు. ఇలా చేయడం వలన గదిలో ప్రతికూల శక్తులు చేరుతాయని, రాత్రిళ్లు నిద్ర సరిగా పట్టదని చెబుతున్నారు.
4. ఈశాన్య దిశలో బెడ్ పెట్టకండి
వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్య దిశలో మంచం ఉంచడం సరికాదు. ఆ దిశలో నిద్రపోవడం వలన మానసిక ప్రశాంతత తగ్గి నిద్ర భగం కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.