Maha Shivratri : మహాశివరాత్రి నాడు శివుడికి ఇవి సమర్పించండి చాలు.. అఖండ ధన లాభం మీ సొంతం..!
ప్రధానాంశాలు:
Maha Shivratri : మహాశివరాత్రి నాడు శివుడికి ఇవి సమర్పించండి చాలు .. అఖండ ధన లాభం మీ సొంతం..!
Maha Shivratri : మన సనాతన ధర్మంలో మహాశివరాత్రికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇక ఈ సంవత్సరం శివరాత్రి మార్చి 8న వచ్చింది. శివుడు పార్వతిని పెళ్లాడింది ఈరోజు అని నమ్ముతారు. శివరాత్రి రోజు ఉపవాసం, పూజ, జాగారానికి ఎంతో విశిష్టత ఉంది. శివుడి అనుగ్రహం కోసం మహాశివరాత్రి రోజు భక్తులు ఎంతో విశేషంగా పూజిస్తుంటారు. అయితే ఈ మహాశివరాత్రి రోజున కొన్ని పుష్పాలు శివుడికి పూజ చేయడం మంచిది. శివుడికి ఎంతో ప్రీతికరమైన ఈ పూలు సమర్పించడం వలన శివుడి ఆశీర్వాదాలు లభిస్తాయి. ఇక హైందవ ధర్మంలో మల్లె పువ్వులు ప్రేమకు స్వేచ్ఛకు చిహ్నంగా భావిస్తారుష ముఖ్యంగా వాహనం కొనుగోలు చేయాలనుకునేవారు శివుడికి మల్లెపూలను సమర్పిస్తే కోరిక నెరవేరుతుంది. ఎన్నో రోజులుగా చేయాలనుకుంటున్నా పనులు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా నెరవేరుతాయి. అలాగే అవిసె పూలు కూడా సమర్పించడం వలన శివుడి ఆశీస్సులు లభిస్తాయి.
ఈ సమయంలో విష్ణు ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి. ఇక శమీ పూలు కూడా మహాశివరాత్రి నాడు శివుడికి సమర్పిస్తే ఎంతో మంచి జరుగుతుంది. శని దేవుడు దయ కూడా లభిస్తుంది. ఆర్థిక సంక్షోభం, ఆహార సమస్యలు ఎదుర్కొంటున్న వారు మహాశివరాత్రి నాడు జోహి పూలను సమర్పించాలి. ఈ పూలతో బోలా శంకరుడిని పూజిస్తే వారికి ఎలాంటి డబ్బు కొరత ఉండదు. ఇక శివుడికి ఎరుపు రంగు తెలుపు రంగు పూలు అంటే ఎంతో ఇష్టం. మందార పూలతో కనుక శివుడిని పూజిస్తే మోక్షం లభిస్తుంది. జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని నమ్మకం. ఇక శివుడికి అత్యంత ప్రీతికరమైన పువ్వులలో ఒకటి ఉమ్మెత్త. ఇది లేకుండా శివుడిని ఆరాధిస్తే ఆ పూజ అసంపూర్ణమవుతుంది అంటారు. శివలింగంపై ఉమ్మెత్త పువ్వులు పెట్టడం వలన వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. మనసులో ఉన్న కోరికలు కూడా నెరవేరుతాయి.
ఇక శివరాత్రి నాడు శివుడికి గులాబీ పూలతో పూజ చేస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది. దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. ఇక శ్రేయస్సు శాంతికి చిహ్నంగా భావించే తామర పువ్వులు కూడా శివుడికి సమర్పించవచ్చు. పూజలో సమర్పించడం వలన మోక్షం లభిస్తుంది. ఇక శివుడికి అత్యంత ప్రీతికరమైన పువ్వులలో ఒకటి జిల్లేడు పూలు. మహాశివరాత్రి రోజు శివుడిని తెల్లజిల్లేడు పువ్వులతో ఆరాధిస్తే మానసికం,గా శారీరకంగా చేసిన పాపాలు తొలగిపోతాయని అంటారు. ఇక మహాశివరాత్రి నాడు శివుడికి నైవేద్యంగా బెల్లం తో కూడిన నైవేద్యాలను సమర్పిస్తే పరమశివుడు ఎంతో సంతోషిస్తాడని అంటారు. అలాగే నైవేద్యంగా కొబ్బరికాయ ముక్కలు కూడా పెట్టవచ్చు. అలాగే ఎండు ద్రాక్ష, అరటి పండ్లు, ఖర్జూరాలు కూడా శివుడికి పెట్టవచ్చు. ఈ నైవేద్యాలు శివుడికి సమర్పించడం వలన సకల సౌభాగ్యాలు లభిస్తాయని నమ్మకం.