Home » Devotional » Karthika Masam Deepam Ela Pettali In Devotional
Devotional

Karthika Masam : మీ ఇంట్లో శుభాలు జరగాలంటే కార్తీ మాసం 30 రోజులలో ఎన్ని దీపాలు వెలిగించాలి…

Authored By
aruna
The Telugu News | Published on: November 12, 2023, 3:30 pm
Advertisement

Karthika Masam : ఎలా చేయాలి దీపం ఎలా పెట్టాలి. సోమవారాల్లో ఉపవాసం ఎలా ఉండాలి. ఇంకా అనేక విషయాలు గురించి ఈరోజు తెలుసుకుందాం.. ఏ పూజ అయినా సరే తమకున్న ఆచారాలు, పద్ధతులు అలాగే ఆర్థిక స్తోమతను బట్టి చేసుకుంటూ ఉంటారు. అందరిదీ ఒకేలా ఉండాలని ఏమీ లేదు. ఈ కార్తిక మాసంలో అన్ని రోజులు కూడా చాలా పవిత్రమైన రోజులు. ఈ కార్తీకమాసంలో శివారాధన ఏ కాకుండా విష్ణుమూర్తి ని కూడా మనం ఆరాధిస్తాము.. అందుకే శివ కేసులు ఇద్దరికీ కూడా అత్యంత ప్రీతికరమైన మాసం ఈ కార్తీకమాసం. ప్రతి ఏడాది దీపావళి అమావాస్య మరిసిటి రోజు నుంచి ప్రారంభమై మళ్లీ వచ్చి అమావాస్య వరకు ఉంటుంది. అంటే నెల రోజులు పాటు ఈ కార్తీకమాసంలో శివకేశవులని ఎంతో భక్తి శ్రద్ధలతో నియమనిస్తులతో ఆరాధించే వారికి జన్మ ధన్యం అవుతుందని పండితులు చెబుతున్నారు. కార్తీకమాసం అంటేనే స్నానాలు, దానాలు, జపాలు, పూజలు ఇంకా దీక్షలు చేయడం.. ఉపవాస వ్రతాలు చేయడం అలాగే దీపాలను వెలిగించడం ఇంకా వనభోజనాలు వంటి వాటిని చేయడం వల్ల జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేసి అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే మహిమా నిత్వమైన మాసమే ఈ కార్తీకమాసం.

Advertisement

కార్తీక మాసం మొత్తం ఉదయాన్నే అంటే తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి నదీ స్నానాలు చేస్తారు. అది వీలు లేని పక్షాన బావి దగ్గరైన చెయ్యొచ్చు. అది కూడా వీలు లేనప్పుడు ఇంట్లోనే చల్లటి నీళ్లతో ఈ పవిత్ర స్నానాలనేవి చేయాలి. తర్వాత ఇల్లంతా శుభ్రపరచుకొని పూజా మందిరాన్ని కూడా ముగ్గులతో పువ్వులతో అలంకరించుకొని దీపారాధన చేయాలి. తర్వాత తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేయాలి. దీపారాధనకి ఎంతో విశిష్టమైన మాసం ఈ కార్తీకమాసం. అందుకే ఈ మాసంలో ఇంట్లో ఉన్న దేవుని ముందుగానే లేదంటే తులసి కోట దగ్గర కానీ లేదా దేవాలయాల్లో గాని దీపారాధన చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. ఇంకా దీపారాధన ఎలా చేయాలంటే ఇత్తడి కుందుల్లో గాని లేదా వెండి కుందుల్లో గాని లేదంటే ప్రమోదలలో అయినా సరే రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా చేసి ఒక కుందులో రెండు ఒత్తులు వేయాలి. ఇలాగే రెండు కుందులని సిద్ధం చేసుకోవాలి.

అలాగే ఈ దీపారాధనకి వాడాల్సిన నూనె గాని కొబ్బరి నూనెను గాని వాడితే మంచిది. ఈ కార్తీకమాసం మొత్తం పూజలు చేసేవారు ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, దుంపలు, ముల్లంగి అలాగే మాంసం మానేసి ఓన్లీ శాఖాహార భోజనం మాత్రమే తీసుకుంటారు. ఈ కార్తీకమాసం మొత్తం నియమనిష్టలతో భక్తిశ్రద్ధలతో చేసేవారికి తమ అభిష్టాలు తప్పక నెరవేరుతాయి. సోమవారం రోజున సాయంత్రం చేసినట్లయితే ఉదయం అంతా కూడా భోజనం చేయకుండా పాలు, పండ్లతో ఉండి సాయంత్రం సమయంలో స్నానం చేసి ఈ పూజ అయితే చేసుకోవాలి. అలాగే మంగళవారం రోజున సూర్యుడు ఉదయించక ముందే చేసుకునే వాళ్లయితే ఆరోజే తలస్నానం చేసి తులసిటి కోటముందు గాని గుడిలో గాని ఇలా చేసుకోవచ్చు.. ఇలా 365 వత్తులు కాల్చిన రోజు ఒక పూట భోజనం చేసినట్లయితే చాలా మంచిది… అన్ని శుభాలే జరుగుతాయి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి