Karthika Masam : సనాతన ధర్మంలో తిధులు ప్రకారం వచ్చే పండుగలు ఒకటి మూడు, ఐదు, రోజులలో జరుపుకుంటాం.. కానీ కార్తీకమాసం ఒక్కటే ఆ నెల మొత్తం పండగలా ఉంటుంది. ఈ కార్తీకమాసం శివకేశవులు ఇద్దరికీ ప్రీతికరమైన మాసం అంటారు. కార్తీక మాసంలో చేసే పనులు, పూజలు అన్నిటిక కొన్ని సైంటిఫిక్ రీసన్స్ ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అలాగే కార్తీకమాసం శివకేశవులకు ఎందుకు ఇష్టమని చెప్పే వివరణ కూడా అర్థం తెలుసుకుందాం.. అయ్యప్ప దీక్ష చేసేవారు ఇదే కార్తీకమాసంలో మొదలుపెడతారు. ఈ మాసంలో శివకేశవులను సమానంగా పూజిస్తారు. వాళ్లతో పాటు తులసీదేవికి నెల అంతా దీపం వెలిగించి పూజ చేస్తారు. తులసీదేవి క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవికి చెల్లెలిగా బయటపడింది. విష్ణువుని వివాహం చేసుకోవాలని ఆశపడింది. కాకపోతే లక్ష్మీదేవికి ఈ విషయం నచ్చలేదు. తులసీదేవి ఒక వృక్షంగా మారిపోతుందని శపించింది. విశ్వని వివాహం చేసుకోవడం అంటే ఎప్పుడూ అతని దగ్గర ఉండే అదృష్టాన్ని దక్కించుకోవడం.. m అతను సాలిగ్రామ రూపంలో ఉన్నప్పుడు తులసీదేవికి దగ్గరలో ఉంటానని వరం ఇచ్చాడు.కార్తీక్ శుక్ల ద్వాదశి రోజున ఇదే విషయాన్ని ఉద్దేశిస్తూ తులసి మొక్కను అలంకరించి పూజిస్తారు. ఇదే కార్తీకమాసంలో కృష్ణుడిని దామోదర అనే పేరుతో పూజిస్తారు. దీని వెనుక భాగవతంలో వివరించిన కథ ఉంది.
కార్తీక మాసంలో చేసే పనుల్లో ఉన్న సైన్స్ గురించి తెలుసుకునే ముందు కృష్ణుడు దామోదరుడైన కథ తెలుసుకుందాం.. అందరికీ సంబంధించిన కథ ఆఖరికి అల్లరిలో కూడా ఒక ఫిలాసఫీ అందించాడు. ఒకరోజున నందమహారాజు ఇంట్లో పని చేస్తున్న సేవకురాలు నుంచి వెన్న చిలికే పని పెట్టుకుంది. కుండ నిండా పాలు అందులో రోకలిని కవ్వంగా చేసి వెన్న కోసం చెరుకుతుంది. ఆ సమయంలో కృష్ణుడు చేసే అల్లరి చేర్చులను పాటగా పాడుతూ మురిసిపోయింది. చిలుకుతుంటే చేతికున్న గాజులు, కడియాలు, చెవులకున్న దుద్దులు సవ్వడి చేశాయి. జడలు పెట్టుకున్న పూలు అటూ ఇటూ చెదిరిపోయాయి. అప్పుడే చిన్ని కృష్ణుడు ఆ ప్రదేశానికి వచ్చాడు. నాకు ఆకలిగా ఉంది వెన్న తర్వాత చిలుకుదువు గాని ముందు నాకు పాలు పట్టించమ్మా అని ముద్దుగా అడిగాడు. బిడ్డ ఆకలిగా ఉందంటే చూస్తుండలేక వెంటనే వచ్చి చనుబాలు పట్టిస్తూ బిడ్డ అందాన్ని చూస్తూ చిరునవ్వుతో ఉండిపోయింది. అప్పుడే పొయ్యి మీద పెట్టిన పాలు పొంగె దశకు చేరుకున్నాయి. దాన్ని ఆపడానికి యశోదమ్మ పాలు తాగుతున్న కృష్ణుని పక్కన కూర్చోబెట్టి వెంటనే పరుగు తీసింది. ఆ కోపానికి కళ్ళు పెదాలు ఎర్రగా కందిపోయాయి.
కొరుకుతూ దగ్గరలో ఉన్న ఒక రాయిని తీసుకున్నాడు. దాన్ని అక్కడే పెట్టిన వెన్నకుండ కేసి కొట్టాడు. అంతే కుండ పగిలి పాలు అంతా నేలపాల అయ్యాయి. వెన్న చల్లా చదిరిపోయింది. కృష్ణ ఏడుస్తూ చాటుగా ఆ వెన్న తీసుకొని తింటున్నాడు. ఇంతలో యశోదమ్మ వెన్న చిలికిన ప్రదేశానికి తిరిగి వచ్చింది. విరిగిన కొండైతే ఉంది కానీ పిల్లవాడు కనిపించలేదు. అంతే ఆ పని చేసింది చిన్ని కృష్ణుడే అని అర్థం చేసుకోండి. వీడికి తెలివి బాగా పెరిగిపోయింది. కుండ పగలగొట్టాడని తెలిస్తే ఎక్కడ మందలించి దెబ్బలు వేస్తానని ఆలోచించి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంటూ నవ్వుకుంది. కృష్ణుడు కోసం బాగా వెతికింది. కానీ ఎక్కడ కనిపించలేదు. కాసేపు వెతికిన తరువాత ఒకచోట తిరగేసిన రోలుని ఎత్తుగా చేసుకొని దానిపై నిలబడి ఉండటం చూసింది. పగలగొట్టిన కుండలు సరిపోలేదు. అన్నట్టు ఇక్కడ పైకప్పుకి తాడుతో కట్టిన కుండ నుంచి వెన్న తీసుకొని తింటున్నాడు. దానితో పాటు ఆ ప్రదేశానికి కోతులు వస్తే వాటితో ఆ వెన్నను పంచుకుంటున్నాడు. ఇంతలో యశోదమ్మను చూసి తన అల్లరికి ఎక్కడ వచ్చి కొడుతుందేమోనని భయాన్ని ప్రదర్శించాడు. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే భయాన్ని నటించాడు.
ఈ నటనకు కారణం ఇప్పుడు తాను చేయబోయే లీల ఇంత చిన్న పిల్లవాడు నటించడమేంటి అని ఆలోచించేవారికి చిన్న ఇన్ఫర్మేషన్ విష్ణువుని దశావతారాల్లో కృష్ణ అవతారం తనలో ఉన్న దైవత్వాన్ని మొదటి క్షణం నుంచి గుర్తించిన అవతారం కొడుకు అల్లరిని చాటుగా గమనించి తనను చూశాడని తెలిసిన మరుక్షణం చేతిలో ఒక కర్ర పుచ్చుకొని కృష్ణుడివైపుగా యశోదమ్మ పరుగు తీసింది. యశోదమ్మ ఎంత ప్రయత్నించినా కృష్ణుడు చేతికి చిక్కలేదు. ఉండటానికి చిన్న పిల్లవాడు కానీ చిచ్చరపిడుగుల వేగంగా పరిగెడుతున్నాడు. యశోదమ్మకి ఓపిక నశించి కిందపడిపోయింది. దొరికి పోదామని తన వేగాన్ని తగ్గించుకున్నాడు. మొత్తానికి అలసిపోయిన యశోదమ్మ కృష్ణుడిని పట్టుకుంది.. తర్వాత ఏం జరిగిందో రెండవ పార్ట్ లో తెలుసుకుందాం…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
This website uses cookies.