Categories: DevotionalNews

Karthika Masam Snanam ఈ కార్తీక మాసంలో ఆడవాళ్లు రోజు తలస్నానం చేయాలా.?

Karthika Masam Snanam చాలామంది ఇలా చేస్తే మాత్రమే భగవంతుడు కరుణిస్తాడని అనుకుంటారు. చాలామంది భక్తి ప్రదర్శించే విషయంలో ఒక్కొక్కరి తీరు ఒక్కోలా ఉంటుంది. మరికొందరు మనసులోనే దేవుని ప్రార్థిస్తారు. ఇంకొందరు మానవసేవే మాధవసేవ అని మూగజీవాలకు సేవ చేయడం కన్నా ఇంకేముందనుకుంటారు. అయితే దైవారాధనలో భాగంగా నియమాలు పాటించడం మంచిదే కానీ ఇలా మాత్రమే చేయాలి. అలా చేయకపోతే దేవుడు కరుణించడు. ఇది భక్తి కాదు అనుకోవడం అసలు సరికాదంటారు పండితులు. సాధారణంగా కార్తీకమాసం అనగానే నెలరోజుల పాటు చక్కటి స్థానాలు, దీపాలు, పూజలు ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక వాతావరణమే కనిపిస్తుంటుంది. పంచాక్షరి అష్టాక్షరి మంతాలతో ఆలయాలు మారుమోగిపోతుంటాయి. కొందరు సోమవారాలు ఏకాదశి పౌర్ణమి రోజుల్లో నియమాలు పాటిస్తే.. మరికొందరు కార్తీకమాసం మొత్తం తెల్లవారుజామునే చన్నీళ్లతో తలకు స్నానాలు చేస్తుంటారు. కొందరైతే భక్తి పేరుతో అనారోగ్యాన్ని కూడా లెక్క చేయరు. కానీ తలకు స్నానం చేస్తేనే భక్తి అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే కార్తీకమాసంలో నిత్యం తలస్నానం చేయడం వెనుకున్న ఆంతర్యం వేరే అని చెబుతారు పండితులు.

సూర్యోదయానికి ముందు స్నానం చేయమనడం వెనుకున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే అప్పటివరకు బయటపడని అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే బయటపడతాయి. అప్పటివరకు తాము చాలా ఆరోగ్యంగా ఉన్నాం అనుకున్న వారిలో కూడా ఏదైనా అనారోగ్య సమస్య దాకుంటే అది బయటపడుతుంది. అంటే ఆరోగ్యం పై క్లారిటీ వస్తుంది. పైగా సూర్యోదయానికి ముందు చన్నీటి స్నానం శరీరానికి పట్టిన బద్ధకాన్ని వదిలించడంతోపాటు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. కానీ సూర్యోదయానికి ముందే స్నానం చేయకపోతే పాపం చుట్టుకు ఉంటుందని.. కొందరు ఉపవాసం ఉండకపోతే భక్తి కాదని అంటారేమోనని మరికొందరు ఆలోచిస్తారు.. భక్తి అయినప్పటికీ ఇలా చేస్తే మాత్రమే భక్తి అనుకోవద్దని సూచిస్తున్నారు పండితులు. ఎందుకంటే అప్పటికే చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు నిత్యం తలస్నానాలు చేయడం వల్ల అనారోగ్యం మరింత పెరుగుతుంది.

అందుకే మీ ఆరోగ్యం సహకరించకపోయినా కానీ నిత్యం తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. మీకు అంతగా పట్టింపు ఉంటే కార్తీకమాసం మొదటి రోజు, కార్తీక సోమవారం, ఏకాదశి, కార్తీక పౌర్ణమి, పోలీ స్వర్గం రోజు తలకు స్నానమాచరించి ఇంట్లో తులసి మొక్క దగ్గర ఆలయాల్లో దీపాలు వెలిగిస్తే సరిపోతుంది. కార్తీకమాసం నియమాలు ఆచరించేవారు ఇవి గమనించండి. కార్తీకమాసంలో మొదటి వారం రోజులు మీరు పాటించడం మరింత అనారోగ్య సమస్యల్లోకి కురుకుపోయారా అనేది గమనించుకోవాలి. కార్తీక మాసంలో ఈ నియమాలు పాటించకపోతే ఏదో జరిగిపోతుందని అపోహ నుండి బయటకు రావాలి. ఇక ఇళ్లలో స్నానం చేసేవారి సంగతి సరే.. కానీ నదుల్లో చెరువుల్లో స్నానాలు ఆచరించేవారు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అప్పట్లో నదుల్లో చెరువుల్లో ఇంత కాలుష్యం ఉండేది కాదు. నీరు స్వచ్ఛంగా ఉండేది కానీ ఇప్పటి పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసినదే.. అందుకే మీరు స్నానమాచరించే ప్రదేశంలో మీరు స్వచ్ఛంగా ఉందో లేదో గమనించండి. హిందూ ధర్మంలో పాటించే నియమాలన్నీ మన జీవన విధానాన్ని సక్రమంగా మార్చుకునేందుకు కొన్ని మంచి అలవాట్లు అలవర్చుకునేందుకు పరిసరాల పరిశుభ్రత కోసమే అని తెలుసుకోవాలి. దీన్ని బట్టి నడుచుకుంటే మంచిదని పండితులు సూచిస్తున్నారు…

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

4 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago