Categories: NewsTV Shows

Intinti Gruhalakshmi 6 Dec Today Episode : దివ్య కడుపు పోయేలా రాజ్యలక్ష్మి, బసవయ్య ప్లాన్.. రాజ్యలక్ష్మి ఇంట్లో పోయిన నందు పరువు.. ఇంతలో మరో ట్విస్ట్

Intinti Gruhalakshmi 6 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఇంటింటి గృహలక్ష్మి 6 డిసెంబర్ 2023, బుధవారం ఎపిసోడ్ 1120 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బుద్ధి ఉన్నవాడు ఎవడైనా వియ్యాల వారి ఇంటికి తాగి వస్తాడా అని బసవయ్య అంటాడు. దీంతో బాబాయి వదిలేయ్. ఎవరి బాధలు వారికి ఉంటాయి. అయితే ఇప్పుడు ఏంటి మీకు అని అంటుంది దివ్య. దీంతో మేము తప్పు చేశామని మాకు ఈ శిక్ష వేశారు. మరి మీ నాన్న చేసిన దానికి ఏం చేస్తావు. ఇలాంటి తాగుబోతును అందరికి నీతులు చెప్పే తులసి ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చింది. తనకైనా బుద్ధి ఉండాలి కదా అంటే.. నందుకు కోపం వస్తుంది. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు నందు. ఆ తర్వాత తులసి, పరందామయ్య, అనసూయ కూడా వెళ్లిపోతారు. ఇంటికి వెళ్లాక.. నందు ఇంట్లోని సామాన్లు అన్నింటినీ విసిరేస్తాడు. కోపం వస్తుంది నందుకు. ఎవ్వరూ నాతో మాట్లాడకండి. నన్ను ముట్టుకోకండి అంటాడు. నేను ఎవ్వరికీ అక్కర్లేనప్పుడు నాకూ  ఎవ్వరూ అవసరం లేదు. ఇక్కడ ఎవ్వరూ ఉండొద్దు అని అంటాడు నందు. నేనంటే తాగి ఉన్నాను.. మీకేమైంది అని అంటాడు నందు. నా వైపు ఒక్కరైనా మాట్లాడారా? వాళ్లను ఎదురించారా? నిలదీశారా? నా బంగారుతల్లి దివ్య ఒక్కతే ఈ నాన్న మీద జాలి పడింది. తను అర్థం చేసుకుంది. నాకు సపోర్ట్ గా నిలబడింది. ఏం మీరెవ్వరూ నిలబడలేదు. మీకేం కానా నేను. సంబంధం లేదా? పరాయివాడినా.. చెప్పండి. పరాయివాడిని అంటే.. ఇప్పుడే ఇంట్లో నుంచి వెళ్లిపోతాను అంటాడు నందు.

ఎవ్వరికీ నా మొహం చూపించను అనడంతో పోరా పో ఎవరిని బెదిరిస్తున్నావు అంటాడు పరందామయ్య. మీరు కూడా అలాగే అంటారేంటండి. వాడికి నచ్చజెప్పాల్సింది పోయి.. ఇలా అంటున్నారు ఏంటి అంటుంది అనసూయ. తప్పు చేసింది వాడు.. గొడవ చేసింది వాడు.. అంటాడు పరందామయ్య. నాకు అవమానం జరిగితే సినిమా చూసినట్టు చూశారు అంటాడు. మామయ్య.. మీరు ఆయన్ను రమ్మన్నారు కానీ.. తాగి రమ్మని చెప్పారా? అంటుంది తులసి. అక్కడ అవమానం జరిగింది ఆయనకు కాదు.. నాకు. తాగిన వాడిని తీసుకొస్తారా అని చెప్పి నిలదీశారు. అవమానం జరిగింది దివ్యకు. వాళ్ల నాన్న పచ్చి తాగుబోతు అని అందరికీ తెలిసింది. దాన్న ఇప్పుడు నానా మాటలు అంటారు. ఏమని సమాధానం చెప్పుకుంటుంది. తప్పు ఆయన చేసి మన మీద అరుస్తున్నారు ఎందుకు అంటుంది తులసి. దీంతో అవును నేను తాగాను. ఎందుకు తాగాను. ఈటల లాంటి మాటలతో నా గుండెల మీద పొడిచిన వాళ్లకు తెలుసు. క్షమించు అని కాళ్ల మీద పడ్డా కనీసం నా మొహం కూడా చూడని వాళ్లకు బాగా తెలుసు. మీరు మీ ఇష్టం ఉన్నట్టుగా అనుకోండి అంటాడు నందు. అత్తింట్లో దివ్య పరిస్థితి బాగోలేదు. రాక్షసి లాంటి రాజ్యలక్ష్మి పీక్కుతింటోంది. ఇప్పుడు ఈయన ఆవిడ చేతికి ఒక అస్త్రం ఇచ్చి వచ్చారు. ఇక తను ఊరుకుంటుందా? కేవలం కూతురు కాపురం కోసం ఆ ఇంట్లో నా కోపాన్ని కంట్రోల్ చేసుకొని అణిగిమణిగి ఉన్నాను అంటుంది తులసి. తాగి అరవడం కాదు.. ఛీ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది తులసి. చూశారా ఎలా అరుస్తుందో అంటే.. అరవడం కాదు నీకు వాతలు పెట్టాలి అని చెప్పి పరందామయ్య కూడా అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

Intinti Gruhalakshmi 6 Dec Today Episode : దివ్యకు నచ్చజెప్పిన విక్రమ్

మరోవైపు దివ్య.. తన నాన్న గురించే ఆలోచిస్తూ ఉంటుంది. బాధపడుతూ ఉంటుంది. ఇంతలో విక్రమ్ వస్తాడు. అక్కడి నుంచి వెళ్లిపోబోతుండగా.. దివ్య ఆగు. ఆ కన్నీళ్లు ఎందుకు అంటే ఏం లేదు అంటుంది. నా దగ్గర కూడా దాపరికమా అంటే.. అక్కడ అవమానం జరిగింది మా వాళ్లకే కదా అంటుంది దివ్య. మీ నాన్న తాగి రావడాన్ని సమర్థిస్తున్నావా అంటాడు విక్రమ్. నా సమాధానాన్ని నేను అక్కడే చెప్పాను కదా అంటుంది. ప్రశాంతంగా ఆలోచించు దివ్య. కోపం తెచ్చుకోకు దివ్య అంటాడు. మా ఇంట్లో వాళ్లు ఉక్రోషంతో ఉన్నారు. అవకాశం కోసం చూసి ఎదురు తిరిగారు అంటాడు విక్రమ్. వాళ్లు చేసిన తప్పు, మా నాన్న చేసిన తప్పు ఒక్కటేనా? వాళ్లు చేసిన తప్పుకు నిజానికి జైలులో పెట్టించాలి. మనవాళ్లే కదా అని చెప్పి వదిలేశాను. కనీసం అది కూడా లేకుండా మా నాన్న మీద అరిచారు అంటుంది దివ్య. నువ్వేం టెన్షన్ పడకు. నేను వెళ్లి మామయ్య గారికి క్షమాపణ చెబుతాను అంటాడు విక్రమ్.

మరోవైపు లాస్య.. నందుకు ఫోన్ చేస్తుంది. హలో ఎవరు అంటాడు. నీ మంచి కోరేదాన్ని అంటుంది లాస్య. దీంతో అలాంటి వారు ఎవ్వరూ లేరు. పెట్టేసేయ్ అంటాడు నందు. తన రూమ్ లో కూర్చొని ఫుల్లుగా మందు తాగుతూ ఉంటాడు నందు. మళ్లీ కాల్ చేస్తుంది. తులసి నీ మీద రివేంజ్ తీర్చుకుంటోంది అంటుంది లాస్య. మరోవైపు రాత్రి పూట భోజనం కోసం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు తులసి, పరందామయ్య, అనసయ. ఆయన్ను వదిలిపెట్టి తినడం ఎందుకు.. వెళ్లి పిలుచుకొస్తా అంటుంది తులసి. నువ్వు వద్దు నేను వెళ్తా అని అనసూయ వెళ్తుంది.

ఆ తర్వాత లాస్య ఫోన్ ను కట్ చేస్తాడు నందు. అనసూయ రూమ్ లోకి వస్తుంది. భోజనానికి రా అంటే ఆకలి లేదు అంటాడు నందు. మరోవైపు పుట్టింటి వాళ్లకు జరిగిన అవమానానికి దివ్య తలెత్తుకొని తిరిగేలా చేయకూడదు అని బసవయ్యకు మరో ప్లాన్ చెబుతుంది రాజ్యలక్ష్మి. విరుచుకుపడతా అని అంటాడు బసవయ్య. విక్రమ్ కు బిడ్డ పుడితే ఒక విధంగా ఈ ఆస్తికి వారసుడు పుట్టడమే. అదే జరిగితే విక్రమ్ నీ చేతుల్లోంచి పూర్తిగా జారినట్టే. అప్పుడు నువ్వు ఎన్ని తంటాలు పడ్డా సంజయ్ పేరు మీదికి ఆస్తి మారదు అంటాడు బసవయ్య. దివ్య బిడ్డ భూమి మీద పడకూడదు అని అర్థం అయింది అంటుంది రాజ్యలక్ష్మి.

దానికి ప్లాన్ అమలు చేస్తుంది రాజ్యలక్ష్మి. ఉదయమే కొబ్బరి బోండాం తెచ్చి దివ్యకు ఇచ్చి తాగు అంటుంది రాజ్యలక్ష్మి. అక్కడే విక్రమ్ కూడా ఉంటాడు. విక్రమ్ వెళ్లిపోయాక.. దివ్య కొబ్బరి నీళ్లు తాగాక.. ఈ కొబ్బరి బోండాంలో నీ కడుపు పోవడానికి ట్యాబ్లెట్స్ కలిపాను అంటుంది రాజ్యలక్ష్మి. దీంతో దివ్య షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Palm | మీ చేతిలో అర్ధ చంద్రం ఉంటే అదృష్టం మీదే..! మీ జీవిత భాగస్వామి ఎలా ఉంటుందో చెబుతున్న హస్తసాముద్రికం

Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…

2 hours ago

Green Chilli | పచ్చి మిరపకాయల అద్భుత గుణాలు .. కారంగా ఉన్నా ఆరోగ్యానికి వరంగా!

Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…

14 hours ago

Lemon | నిమ్మకాయ తొక్కతో చర్మ సంరక్షణ .. వ్యర్థం కాదు, విలువైన ఔషధం!

Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…

17 hours ago

Health Tips | భోజనం తర్వాత తమలపాకు తినడం కేవలం సంప్రదాయం కాదు.. ఆరోగ్యానికి అమృతం!

Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…

18 hours ago

Dried Chillies | ఎండు మిర‌ప‌తో ఎన్నో లాభాలు.. ఆరోగ్యంలో చేర్చుకుంటే చాలా ఉప‌యోగం..!

Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…

20 hours ago

Black In Color | న‌లుపుగా ఉండే ఈ ఫ్రూట్స్ వ‌ల‌న అన్ని ఉప‌యోగాలు ఉన్నాయా..!

Black In Color | ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్‌ను కూడా ఆహారంలో…

23 hours ago

Karthika Masam | కార్తీక మాసంలో 4 సోమవారాలు.. నాలుగు వారాలు ఈ ప్ర‌సాదాలు ట్రై చేయండి

Karthika Masam | కార్తీక మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో ప్రతి సోమవారం భక్తులు పరమేశ్వరుడిని పూజిస్తూ, ఉపవాస దీక్షలు…

1 day ago

Dresses | ఫ్యాషన్‌ కోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టకండి .. బిగుతుగా ఉండే దుస్తులు కలిగించే ప్రమాదాలు

Dresses | ఈ రోజుల్లో ఫ్యాషన్ అంటే అందరికీ మక్కువ. స్టైలిష్‌గా, ట్రెండీగా కనిపించాలన్న కోరికతో చాలా మంది ఫిట్టెడ్…

2 days ago