
Karthika Somavaram : కార్తీక సోమవారం నాడు ఉపవాసం ఎలా చేయాలి..?పూజా విధానం.... పాటించవలసిన నియమాలు...!
Karthika Somavaram : మనం కార్తీక సోమవారం నాడు పూజ ఎలా చేయాలి.. మరియు ఉపవాసం ఎలా చేయాలి.. పాటించాల్సిన నియమాల గురించి మనం తెలుసుకుందాం.. కార్తీక మాసంలో సోమవారాలు అతి విశిష్టమైనవి అని అందరికీ తెలిసిందే.. శివ కేశవుల అనుగ్రహం కలిగేలా ఈ సోమవారాలను గడపడానికి కార్తీక పురాణం పఠించడం చాలా మంచిది. కార్తీక సోమవారం నాడు ఉదయాన్నే నిద్ర లేచి తలస్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. పరమశివుడి విగ్రహం లేదా ఫోటోని గంధం, కుంకుమ, పసుపు పూలతో అలంకరించాలి. అలాగే పూజ గదిలో ఉన్న అందరూ దేవుళ్లను కూడా గంధం కుంకుమ పూలతో అలంకరించాలి. తర్వాత శివుడికి దీపారాధన చేసి శివపార్వతులను పూజించాలి. కార్తీక సోమవారం నాడు ఆవు నేతితో దీపారాధన చేయాలి. అష్టోత్తర శతనామావళి శివ అష్టోత్తర శతనామావళి అనే శ్లోకాలు పఠిస్తూ పూజ చేయాలి. గంధం కుంకుమ అక్షింతలతో అర్ధనారీశ్వరులను పూజించి నైవేద్యం సమర్పించి ఉపవాస దీక్షను పట్టాలి. సాయంత్రం మళ్ళీ శివ పూజ చేసి తులసి కోట ముందు ఇంటి ముఖ ద్వారం ముందు దీపారాధన చేసి నక్షత్ర దర్శనం తర్వాత ఉపవాస దీక్షను విరమించాలి.
ఉపవాసం ఎలా చేయాలి అంటే కార్తీక సోమవారం నాడు ఉల్లి, వెల్లుల్లి, మద్యం, మాంసం లాంటి వాటిని తీసుకోకుండా ఉండాలి. నక్షత్ర దర్శనం చేసేటప్పుడు కార్తీక దామోదర రక్షించు కాపాడు అని మనసులోని కోరికలు చెప్పుకొని నమస్కరించాలి. శివపార్వతుల అనుగ్రహం కలిగేలా ఈ కార్తీక సోమవారం గడపడానికి కార్తీక పురాణం ఒకటి కాదు రెండు కాదు ఆరు మార్గాలను సూచించింది. అందులో మొదటిది కార్తీక సోమవారం నాడు ఉపవాసం ఉండగలిగిన వారు ఉదయమంతా తులసి తీర్థం పుచ్చుకుంటూ శివ నామస్మరణతో కాలం గడపాలి. రాత్రంతా జాగరణ చేసి మర్నాడు అన్నదానం చేసి ఉపవాస ముగించాలి. రెండో పద్ధతి ఉదయం వేళలో ఆహారం తీసుకొని రాత్రంతా ఉపవాసం ఉంటారు. ఈ పద్ధతిని ఏకభుక్తం అంటారు. శివ దర్శనం చేసుకొని ఉపవాసం దీక్షను ముగిస్తారు. సూర్యాస్తమయానికి ఒక గంట ముందు ఒక గంట తర్వాత కాలాన్ని ప్రదర్శకాలంగా చెప్పుకోవచ్చు. ఇక నాలుగో పద్ధతి పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం వేళ ఎవరైనా బయాచితంగా పెట్టిన ఆహారం స్వీకరిస్తారు దీన్ని ఆయాచిత వ్రతం అంటారు.
ఇక ఐదో పద్ధతి కనీసం ఒక పూట కూడా ఉపవాసం ఉండలేని వారు ఉదయాన్నే తలస్నానం చేసి పగలంతా శివనామ స్మరణలతో గడుపుతారు. అలా కూడా చేయలేనివారు నువ్వులని దానం చేయడానికి ఆరో పద్ధతిగా కార్తీక పురాణం సూచిస్తుంది. కార్తీక మాసంలో నువ్వులను దానం చేయడం వలన చేసిన పాపాలు అన్నిటి నుంచి విముక్తులవుతారు.. కార్తీక సోమవారం నాడు అనుకోకుండా ఉపవాసం ఉన్న ఒక్కటి కూడా శివ సాహిత్యం దక్కిన కథ కార్తీక పురాణంలో ఉంది.కార్తీక సోమవారం నాడు స్నానం, ధ్యానం, జపం, ఉపవాసం, అభిషేకం ఇలా ఏ పని చేసినా కూడా విశేషమైన ఫలితం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు కార్తీక సోమవారం రోజు కార్తీక పురాణం చదువుకోవాలి…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.