
Coconut Kheer Recipe : కమ్మ కమ్మని కొబ్బరి పాయసం.. ఎంత బాగుంటుందో.. దీంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా...!
Coconut Kheer Recipe : కొబ్బరి పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం.. ఈ పాయసం తినడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది.. దీనిలో కాలుష్యం పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఈ పాయసం తినడం వలన ఎముకలు దృఢంగా మారుతాయి.. ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.. రెగ్యులర్గా చేసుకునే పాయసం కాకుండా మన ఇంట్లోనే కొబ్బరికాయలు ఉంటూనే ఉంటాయి.. పండుగలు ఎప్పుడైనా లేదా నార్మల్ టైం లో కానీ చాలా స్పీడ్ గా చేసుకోవచ్చు.. ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేద్దామా.. దీనికి కావాల్సిన పదార్థాలు; బియ్యపు రవ్వ, నెయ్యి, కొబ్బరి, కుంకుమపువ్వు, పాలు, పంచదార, యాలకుల పౌడర్, జీడిపప్పు, కిస్ మిస్ లు మొదలైనవి.. తయారీ విధానం: ముందుగా మిక్సీజార్ లో మూడు స్పూన్ల బియ్యాన్ని వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని రవ్వల గ్రైండ్ చేసుకోవాలి. రవ్వలాగా ఉండాలి. ఇప్పుడు మిక్సీ జార్ లోకి ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుమును వేసుకోవాలి. నేను మీడియం సైజు పచ్చి కొబ్బరికాయ తురుమును వేసుకోవాలి.. తర్వాత స్టవ్ పై ఒక కడాయిని పెట్టి దాంట్లో రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి.నెయ్యి వేడయ్యాక కొన్ని జీడిపప్పులను వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి.
మీరు కావాలంటే కిస్మిస్ బాదం కూడా వేసుకోవచ్చు. గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని ఒక బౌల్లోకి తీసుకావాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యం రవ్వని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకసారి మొత్తాన్ని కలుపుకొని మరో స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. బియ్యం రవ్వని గోల్డెన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోవాలి.. కనీసం రవ్వ గోల్డెన్ కలర్ రావడానికి 5 నుంచి 7 నిమిషాల వరకు టైం పడుతుంది. రవ్వగోల్డెన్ కలర్ వచ్చాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ ని వేసుకొని లో ఫ్లేమ్ లో ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత అర లీటర్ పచ్చిపాలన పోసుకోవాలి. మొత్తాన్ని కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అరకప్పు షుగర్ ని వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి తురుము వేసుకుంటున్నాము అదే కప్పుతో అరకప్పు షుగర్ అయితే సరిపోతుంది. మీ టేస్ట్ ని బట్టి షుగర్ ని వేసుకోండి. అలానే కొద్దిగా కుంకుమ పువ్వు అని పాలలో నానబెట్టి వేసుకోవాలి. మీ దగ్గర కుంకుమపువ్వు లేకపోతే కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ ని వేసుకోవచ్చు.
ఎల్లో ఫుడ్ కలర్ కూడా ఆప్షనల్ మాత్రమే.. ఇప్పుడు మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ ని వేసుకొని మరోసారి కలుపుకోవాలి. షుగర్ అనేది కరిగి ఒక ఉడుకు పట్టగానే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక ఉడుకు పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకుందాం.. అంతే కొబ్బరి పాయసం రెడీ అయిపోయింది. ఇది వేడిగా కాని చల్లగా కానీ ఎలా తిన్నా సూపర్ గా ఉంటుంది. చల్లగా తినాలి అనుకున్న వాళ్ళు 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తర్వాత తినేయండి. తీసుకున్న తర్వాత కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము అలానే ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పును వేసుకోవాలి. ఈ పాయసం అద్భుతంగా ఉంటుంది. దీని రుచి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది..
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.