Thyroid : ఈ 3 టిప్స్ తో థైరాయిడ్ కి చెక్ పెట్టండి ఇలా...!
Thyroid : మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. మనం తీసుకునే ఆహారం మీదే మన ఆరోగ్యం ఆధారపడి ఉంది. ప్రస్తుత కాలంలో మనం తీసుకునే ఆహారమే సమస్యలను సృష్టిస్తుంది. కాబట్టి ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం చాలామంది బాధపడే సమస్యల్లో థైరాయిడ్ కూడా ఒకటి. చాలా చిన్న వయసులోనే చాలామంది థైరాయిడ్ సమస్య బారిన పడుతున్నారు. థైరాయిడ్ అనేది ముఖ్యంగా జీవ క్రియపై ప్రభావం చూపిస్తుంది. తద్వారా సమస్యలు అనేవి మొదలవుతున్నాయి. అయితే తీసుకునే ఆహార విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే థైరాయిడ్ ను అదుపులోకి తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
1) థైరాయిడ్ నియంత్రించడంలో కొబ్బరి ముఖ్య పాత్ర పోషిస్తుంది. కొబ్బరి తో తయారు చేసిన ఆహార పదార్థాలను థైరాయిడ్ తో బాధపడే వారికి మంచి ఆహారమని చెప్పవచ్చు. కొబ్బరిని తీసుకోవడం వలన థైరాయిడ్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. అంతేకాకుండా ఇది జీవక్రియకు బాగా సహాయపడుతుంది. ప్రతిరోజు ఒక స్పూన్ కొబ్బరి తీసుకుంటే థైరాయిడ్ తగ్గించవచ్చు. అంతేకాకుండా చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
2) గుమ్మడికాయ గింజలు కూడా థైరాయిడ్ నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. గుమ్మడికాయ గింజల్లో శరీరానికి కావాల్సిన పోషకాలు అన్ని లభ్యమవుతాయి. ఈ గింజల్లో జింక్ అనేది ఎక్కువగా ఉంటుంది. విటమిన్ లు, ఖనిజాలు వంటి పోషకాలను గ్రహించడానికి జింకు బాగా సహాయపడుతుంది. అంతేకాకుండా గుమ్మడికాయ గింజల్ని ఆహారంలో ఒక భాగం చేసుకోవడం వలన థైరాయిడ్ లెవెల్స్ అనేవి అదుపులో ఉంటాయి.
3) ఉసిరికాయ వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉసిరికాయలో రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఉసిరికాయ రసం త్రాగినా, ఉసిరిని ఆహారంలో చేర్చుకున్న చాలా మంచిది. ఇది కేవలం థైరాయిడ్ సమస్యనే కాదు. ఇతర అనారోగ్య సమస్యలను కూడా దరిచేరకుండా చేస్తుంది. నారింజ కంటే ఉసిరిలో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా శరీరాన్ని చాలా బలంగా మార్చుతుంది.
Jyotishyam : శాస్త్రంలో ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తుని జరిగే సంఘటనలను చెప్పడంలో బాబా వంగ కాలజ్ఞానం చాలా ప్రసిద్ధి గాంచింది.. బాబా…
Rajitha Parameshwar Reddy : ఉప్పల్ డివిజన్ Uppal Division సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్టుగా కార్పొరేటర్ మందుముల రజితాపరమేశ్వర్రెడ్డి Rajitha…
Raashii Khanna : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ ప్రధానంగా…
Boy Saved 39 Acres : హైదరాబాద్లో హైడ్రా విభాగం ప్రజల మనసుల్లో విశ్వాసం సాధించుకుంటూ, అక్రమ నిర్మాణాలపై కఠినంగా…
Vitamin -D : శరీరంలో విటమిన్ డి లోపిస్తే కోన్ని సమస్యలు తలెత్తుతాయి. డి -విటమిన్ సూర్య రష్మి నుంచి…
Saree Viral Video : ఇప్పటి వరకు చీర కట్టడంలో ఇబ్బంది పడేవారికి ఇది ఓ శుభవార్త. ఇకపై చీర…
Raj Tarun - Lavanya : యంగ్ హీరో రాజ్ తరుణ్ మరియు లావణ్య మధ్య జరుగుతున్న వివాదం ఇప్పుడు…
Chandrababu : 75వ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గమైన కుప్పంలో అభిమానులు వినూత్నంగా…
This website uses cookies.