Koti Deepotsavam 2023 : కోటి దీపోత్సవం .. భక్తులకు కావాల్సిన సమాచారమిదే..!

Koti Deepotsavam 2023 : అశేష ప్రజాశక్తి.. విశేష ఆధ్యాత్మిక ఆసక్తి.. కలిసివెలిగే అఖండజ్యోతి.. భక్తి టీవీ కోటి దీపోత్సవం. నెంబర్ వన్ న్యూస్ ఛానెల్ ఎన్టీవీ, భక్తిటీవీ సగర్వంగా సమర్పించే కార్యక్రమం ఈ కోటి దీపోత్సవం. ఎన్టీఆర్‌ స్టేడియం వేదికగా రచనా టెలివిజన్‌ ప్రతీ ఏటా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న విషయం విదితమే కాగా.. ఆ మహా దీపయజ్ఞం ప్రస్తుతం దిగ్విజయంగా ప్రజ్వరిల్లుతోంది. జగజ్జేయమానంగా వెలుగులీనే దీపకాంతులొకవైపు.. ప్రవచనామృతాలు.. కళ్యాణ కమనీయాలు మరొకవైపు.. కార్తీకమాసాన కదిలివచ్చిన కైలాసమే ఈ కోటి దీపోత్సవం. భక్తి టీవీ, ఎన్టీవీ ఆధ్వర్యంలో 14 రోజుల పాటు జరిగే మహా వైభవం. శివకేశవులని ఒకేవేదికపై కోటీదీపాల మధ్య దర్శించుకునే యోగమే కోటి దీపోత్సవం. జనం గుండె లోతుల్లో దాగిన భక్తిభావాలను ఒక్క వేదిక మీదకు తెచ్చే పవిత్రప్రయోగమే ఈ కోటిదీపోత్సవం.

వేదికనెక్కే వేద పండితులు, అతిథులుగా హాజరయ్యే అతిరథమహారథులు, ప్రతిరోజూ వేలు, లక్షలుగా హాజరయ్యే భక్త జనం వరకు అందరిదీ ఇదేమాట. ప్రవచనామృతంతో మొదలై, ప్రత్యేక అర్చనలతో పవిత్రత సంతరించుకుని, దేవదేవుల కళ్యాణ మహోత్సవాలు, లింగోద్భవం, నీరాజనాలతో భక్తులకు నిండైన ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రతిరోజూ పంచుతుంది..ఈ దీపోత్సవం. ఇక ఉత్సవ విగ్రహాల ఊరేగింపు.. దానికదే చూసితీరాల్సిన ఓ మహోజ్వల ఘట్టం. తిరుమల, యాదగిరిగుట్ట సింహాచలం, భద్రాచలం, కాళేశ్వరం, శ్రీకాళహస్తి, వేములవాడ, బెజవాడలాంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల దేవతామూర్తులను చూసి భక్తకోటి పులకించిపోయే అద్భుత దృశ్యం ఈ కోటిదీపోత్సవంలో ప్రతిరోజూ సాక్షాత్కారమవుతుంది. దేశం నలుమూలల నుంచి పీఠాధిపతులు, మహాయోగలు, ఆధ్యాత్మికవేత్తల సందేశాలతో కోటిదీపోత్సవ వేదిక ఒక ఆధ్యాత్మిక దివ్యఅనుభూతికి నిలయంగా మారుతుంది. వీటన్నిటినీ మించిన అద్భుతం ..భక్తజనకోటి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే దేదీప్యమాన దృశ్యం.. కోటి కాంతులు ఒకేసారి ప్రసరించే దివ్యానుభవం.. దీప ప్రజ్వలనం. లక్షలాది మంది భక్తులు ఒకేసారి ఒకే ప్రాంగణంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే ఈ దృశ్యం చూడాలే తప్ప మాటల్లో చెప్పలేం. ”దీపం జ్యోతిః పరంబ్రహ్మ.. దీపం సర్వతమోపహం.. దీపేన సాధ్యతే సర్వం.. సంధ్యాదీప నమోస్తుతే” అంటారు..’ ఒక దీపమే మరో దీపాన్ని వెలిగించగలదు..

దీపం పక్కనే దీపాన్ని వెలిగిస్తే ఆ దీపాల వరుసకు లోకమంతా వెలుగుల మయం అవుతుందని నమ్మకం.. దీపం వెలుగుకు, జ్ఞానానికి సంకేతం, అధ్యాత్మికంగా దీపానికి చాలా ప్రముఖ్యం ఉంది..మన సంస్కృతికి సంప్రదాయానికి దీపారాధన పట్టుగొమ్మగా నిలిచింది.. అటువంటి సంప్రదాయాన్ని భవిష్యత్‌ తరాలకు సమున్నతంగా పరిచయం చేయడమే లక్ష్యంగా 2013 నుంచి భక్తి టీవీ కోటిదీపోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తుంది. మొత్తంగా దీపం జ్యోతి పరబ్రహ్మ అనే దివ్యసందేశం ఇవ్వడమే ధ్యేయంగా సాగే ఈ కోటి దీపోత్సవం ఈ నెల 14 మంగళవారంతో మొదలై, నవంబర్ 27 వరకు హైదరాబాద్, ఎన్టీఆర్‌ స్టేడియంలో జరుగుతుంది. ఈ కార్తీక మాసాన ఆ శివకేశవ సాక్షిగా సాగే కోటిదీపార్చన మహోత్సవంలో పాల్గొని.. అపూర్వ సాంస్కృతిక కదంబాలు.. సప్తహారతుల కాంతులు.. కోటి దీపాల వెలుగులు.. మహాదేవునికి మహానీరాజనాలను తిలకించండి.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

3 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago