మీ కార్యాలు విజయవంతంగా కావాలంటే దీపం ఇలా పెట్టండి ! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

మీ కార్యాలు విజయవంతంగా కావాలంటే దీపం ఇలా పెట్టండి !

ప్రతి ఒక్కరికి ఏదో ఒక లక్ష్యం. కానీ చేరుకోవడానికి అనేక అవాంతరాలు. ఆటంకాలు, వీటిని అధిగమించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమీ చేయలేని పరిస్థితి. గ్రహదోషాలు, పూర్వజన్మకృతాలు, గోచారం, వాస్తు ఇలా అనేక కారణాలు కావచ్చు. కానీ అవి తెలియక వాటి పరిష్కారాలకు డబ్బు ఖర్చుచేసి జేబులు ఖాళీ చేసుకుంటుంటారు. కానీ వీటన్నింటికంటే చాలా శక్తివంతమైనది, పండితులు చెప్పే అతి సులభమైన పరిష్కారం తెలుసుకుందాం… దీపం పెట్టడం అంటే జ్ఞానాన్ని వెదకడం అని పెద్దలు చెప్తారు. బాహ్యదీపం […]

 Authored By uday | The Telugu News | Updated on :25 January 2021,6:00 am

ప్రతి ఒక్కరికి ఏదో ఒక లక్ష్యం. కానీ చేరుకోవడానికి అనేక అవాంతరాలు. ఆటంకాలు, వీటిని అధిగమించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమీ చేయలేని పరిస్థితి. గ్రహదోషాలు, పూర్వజన్మకృతాలు, గోచారం, వాస్తు ఇలా అనేక కారణాలు కావచ్చు. కానీ అవి తెలియక వాటి పరిష్కారాలకు డబ్బు ఖర్చుచేసి జేబులు ఖాళీ చేసుకుంటుంటారు. కానీ వీటన్నింటికంటే చాలా శక్తివంతమైనది, పండితులు చెప్పే అతి సులభమైన పరిష్కారం తెలుసుకుందాం…

lamps to success your works

lamps to success your works

దీపం పెట్టడం అంటే జ్ఞానాన్ని వెదకడం అని పెద్దలు చెప్తారు. బాహ్యదీపం పెట్టడం నుంచి అంతరంలో దీపం వెలిగించుకోవడం దీని లక్ష్యం. ప్రసుత్తం సాక్షాత్తు విష్ణు స్వరూపంగా భగవద్గీతలో శ్రీకృష్ణుడు పేర్కొన్న వృక్షం రావిచెట్టు దీన్నే అశ్వత్థ వృక్షం అని కూడా అంటారు. ఈ చెట్టుకు ఆధ్యాత్మికతకు అనేక రహస్యాలు దాగిఉన్నాయి. వాటిలో ఒకటి తెలుసుకుందాం.. రావిచెట్టు విశేషాలతో కూడుకున్నది. పూర్వ జన్మ కర్మలను ఈ రావిచెట్టు తొలగించగలదు. అదేవిధంగా శాపాలు, దోషాలను గ్రహపీడలను నివారించగలదు. అందుకు మీరు చేయాల్సిందల్లా రావిచెట్టును పూజించడమే.

అంతేగాకుండా ఇంట్లో రావిచెట్టు ఆకులను వుంచి దానిపై దీపం వెలిగించడం ద్వారా శాప,దోష్కకర్మ ఫలితాలు వుండవు. పూర్వజన్మల పాపాలు తొలగిపోతాయి. రావిచెట్టు ఆకులను తీసుకొచ్చి… దానిపై ప్రమిదలను వుంచి నువ్వుల నూనెతో దీపమెలిగించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. రావి ఆకులను భగవత్ స్వరూపంగా భావించి, విష్ణునామస్మరణ అంటే ఓం నమో భగవతే వాసుదేవాయనమః అనే మంత్రాన్ని పఠిస్తూ దీపం పెడితే చాలు కొన్ని వారాలలో మీకు మంచి ఫలితాలు కన్పిస్తాయి.

uday

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది