Lord Shani : శనిదేవుడికి ఈ రాశులంటే మహాప్రీతి.. ఇందులో మీ రాశి ఉందా మ‌రి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Lord Shani : శనిదేవుడికి ఈ రాశులంటే మహాప్రీతి.. ఇందులో మీ రాశి ఉందా మ‌రి

 Authored By prabhas | The Telugu News | Updated on :17 May 2025,6:00 am

ప్రధానాంశాలు:

  •  Lord Shani : శనిదేవుడికి ఈ రాశులంటే మహాప్రీతి.. ఇందులో మీ రాశి ఉందా మ‌రి

Lord Shani : జ్యోతిష శాస్త్రంలో శని దేవుడిని తరచుగా కఠినమైన పాలకుడిగా చూస్తారు. కాబట్టి చాలా మంది అతని గురించి ఆందోళన చెందుతారు. శని దేవుడు న్యాయ దేవుడు. కర్మలకు అధిపతిగా, క్రమశిక్షణకు ప్రతినిధిగా శనిదేవుడిని భావిస్తారు. అటువంటి శని దేవుడికి కొన్ని ఇష్టమైన రాశులు ఉన్నాయి. ఆ రాశుల పట్ల శని దేవుడు ఎప్పుడు ప్రేమతో ఉంటాడని, ఆ రాశుల వారికి సకల శుభాలు కలిగి చేస్తాడని చెబుతారు. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

Lord Shani శనిదేవుడికి ఈ రాశులంటే మహాప్రీతి ఇందులో మీ రాశి ఉందా మ‌రి

Lord Shani : శనిదేవుడికి ఈ రాశులంటే మహాప్రీతి.. ఇందులో మీ రాశి ఉందా మ‌రి

వృషభ రాశి

వృషభ రాశి వారిపైన శని దేవుడి దయ ఉంటుంది. ఈ రాశి జాతకులను శని కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. ఈ రాశి వారు ఎటువంటి సమస్యలనైనా ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని శని దేవుడు ఇస్తాడు. శని దేవుని ఆశీస్సులతో వీళ్లు పనిలో విజయాలను సాధిస్తారు. ఆర్థికంగా పురోగమిస్తారు.

తులారాశి

తులా రాశి వారి పైన శని దేవుడి కటాక్షం పుష్కలంగా ఉంటుంది. శని దేవుడి దయవల్ల తులారాశి వారు బలమైన సంకల్పశక్తి ని ఏకాగ్రత సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఈ రాశుల వారికి ఆర్థిక ఇబ్బందులు కలగకుండా శని ఎప్పటికప్పుడు వారిని కాపాడతాడు.

మకర రాశి

మకర రాశి వారి పైన కూడా శని దేవుడి కటాక్షం ఉంటుంది. మకర రాశి జాతకులు శనిదేవుని ప్రేమ కారణంగా వారి జీవితంలో ఏ పని చేసినా విజయాలను సాధిస్తారు. శనిదేవుడు ఆశీర్వాదంతో జీవితంలో ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. ప్రతి రంగంలోనూ మకర రాశి జాతకులు విజయాలు సాధిస్తారు.

కుంభరాశి

శని దేవుడికి బాగా ఇష్టమైన రాశులలో కుంభరాశి ఒకటి. కుంభరాశి జాతకులు శని దేవుడు దయ కారణంగా శుభ ఫలితాలను పొందుతారు. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఎప్పటికీ ఇస్తాడు. ఆర్థికంగా లోటు లేకుండా చూస్తాడు. శనిదేవుడి ఆశీర్వాదంతో కుంభరాశి జాతకులు జీవితాంతం సంతోషంగా జీవిస్తారు.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి జాతకుల పైన శని దేవుడి కటాక్షం ఉంటుంది. వీరు ఏ పని చేసినా సత్ఫలితాలు వచ్చేలా చూస్తాడు. ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా, జీవితంలో సంతోషం ఉండేలా శని దేవుడు వీరిని ఆశీర్వదిస్తాడు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది