Maha Shivaratri Special : మహాశివరాత్రి రోజున జాగరణ చేస్తున్నారా… ఇలా చేయండి శివుని కటాక్షము మీపైనే ఇక…?
ప్రధానాంశాలు:
Maha Shivaratri Special : మహాశివరాత్రి రోజున జాగరణ చేస్తున్నారా... ఇలా చేయండి శివుని కటాక్షము మీపైనే ఇక...?
Maha shivaratri Special : మహాశివరాత్రి రోజున శివుని ఆశీర్వాదాలు పొందాలంటే అత్యంతమైన పవిత్రమైన రాత్రుల్లో జాగారం చేయటానికి మహాశివరాత్రి పరమ దినం ఒకటి. ఆ పరమశివుని దీవెనలు ఉండాలంటే భక్తులు పాటించాల్సిన పురాతన ఆచారాలు, ఆధ్యాత్మిక పద్ధతులు చాలా ముఖ్యం. ఉపవాసం మంత్రాలని జపించడం, రుద్రాభిషేకం చేయడం, భక్తితో మేల్కొని ఉండడం అన్ని అర్థవంతమైన ఆచారాలు, శివపురాణం, లింగ పురాణం వంటి హిందు రచనల ఆధారంగా రూపొందించబడిన ఈ ఆచారాలు. గత దుష్కర్మ లను శుభ్రపరుస్తాయి. శ్రేయస్సును అందిస్తాయి. ఆధ్యాత్మిక అవగాహనలకు దారితీస్తాయి. విజయం శాంతి లేదా దైవిక సంబంధం కోసం చూస్తున్నట్లయితే.. మహాశివరాత్రి రహస్యాల గురించి తెలుసుకొని ఆచరిస్తే మీ జీవితంలో మంచి జరుగుతుంది..

Maha Shivaratri Special : మహాశివరాత్రి రోజున జాగరణ చేస్తున్నారా… ఇలా చేయండి శివుని కటాక్షము మీపైనే ఇక…?
Maha Shivaratri Jagarana Special ఉపవాసం
మహాశివరాత్రి పరమ దినమున ఉపవాసమును ఉంటే శరీరం మరియు మనసు శుద్ధి అవుతుంది. పైగా ఆధ్యాత్మిక ఉన్నతి కూడా లభిస్తుంది.
నిర్జల వ్రతం:
కొంతమంది కటిక ఉపవాసం చేస్తారు. అంటే నీరు లేదా ఆహారం ఎటువంటిది కూడా తీసుకోకుండా ఉపవాసం కఠినంగా చేస్తారు.
Maha Shivaratri Jagarana Special పలహార్ వ్రతం:
కొందరు ఉపవాస దీక్ష రోజున పండ్లు మరియు పాలు, ఎండిన పండ్లు తింటారు.
పాక్షిక ఉపవాసం:
కొంతమంది భక్తులు ఖీర్, సాబుదాన, కొబ్బరి నీరు అంటే సాత్విక ఆహారాలను తీసుకుంటారు.
Maha Shivaratri Jagarana Special జాగరణ
మహాశివరాత్రి రోజున ఆ రాత్రంతా కూడా మేల్కొని ఉంటారు. జాగరణ చేసే వ్యక్తులకు దైవానుగ్రహం పొందుతారు. చేస్తే గత పాపాల నుంచి విముక్తిని కూడా పొందుతారు. ఈ సమయంలో శివమంత్రాలను జపిస్తే ఆధ్యాత్మిక శక్తి కూడా పెరుగుతుంది.
.’ ఓం నమః శివాయ’ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న శివ మంత్రం.
. మహా మృత్యుంజయ మంత్రం :
” ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారు కమిని బంధానన్ మృత్యోర్ ముత్య మైంది మామ్రుతాత్ “.
. రుద్రాభిషేకం చేయడం మరియు శివలింగాన్ని పవిత్రమైన నైవేద్యాలతో పూజించటం ఒక ముఖ్యమైన మహాశివరాత్రి ఆచారం. ఇంకా శివ అభిషేకాలు చేయాలి శివపురాణం ఈ కింది నైవేద్యంలో వివరించబడింది.
. పాలు.. స్వచ్ఛత, భక్తిని ప్రోత్సహిస్తుంది.
. తేనె.. తీపి, భక్తిని సూచిస్తుంది.
. నెయ్యి.. శ్రేయస్సు, కోరికల నెరవేర్చుతుంది.
. బిల్వపత్రాలు, చాలా పవిత్రమైనవిగా పరిగణించబడినవి. ఆత్మ శుద్ధి చేస్తాయి. పూల కర్మలను కూడా తొలగిస్తాయి.
. గంధం… శతలీకరణ, ఆధ్యాత్మిక ఉద్ధరణను అందిస్తాయి.
శివాలయాలను సందర్శించడం:
1). మహాశివరాత్రి నాడు, భక్తులు శివాలయాలలో ముఖ్యంగా, జ్యోతిర్లింగా మందిరాల వద్ద ప్రార్థన చేయడానికి గుమ్మి గుడతారు.
కొన్ని ప్రసిద్ధ జ్యోతిర్లింగాలు:
. వారణాసిలోని కాశీ విశ్వనాథ్, గుజరాత్ లోని సోమర్నాథ్ లింగేశ్వరం, గుజరాత్ లోని సోమరనాథ్, ఉజ్జయిని మహాకాళేశ్వర్, ఉత్తరాకాండ్ కేదార్నాథ్, తమిళనాడు రామేశ్వరం లింగాలు ఉన్నాయి.
శివపురాణం చదవడం:
పురాణం వంటివి శివ సంబంధిత రచనలను పటించడం లేదా భక్తి గీతాలను వినడం వల్ల ఆధ్యాత్మిక వాతావరణం కుటుంబంలో ఏర్పడుతుంది.
కొన్ని ప్రముఖ భజనలు:
. శివతాండవ స్తోత్రం.
. హర హర మహదేవ్, ఓం జై శివ ఓంకార..