Maha Shivratri : మర్చిపోయి కూడా శివుడి పూజలో ఈ వస్తువులను అస్సలు ఉపయోగించకండి .. శివుడికి పట్టరాని కోసం వస్తుంది ..!
ప్రధానాంశాలు:
Maha Shivratri : మర్చిపోయి కూడా శివుడి పూజలో ఈ వస్తువులను అస్సలు ఉపయోగించకండి .. శివుడికి పట్టరాని కోసం వస్తుంది ..!
Maha Shivratri : మహాశివరాత్రి ని హిందువులు అత్యంత విశిష్టమైనదిగా భావిస్తారు. ఈ శివరాత్రిను దేశవ్యాప్తంగా ఎంతో సంబరంగా జరుపుకుంటారు. ఇక ఈ సంవత్సరం శివరాత్రి మార్చి 8న వచ్చింది. భక్తులందరూ ఉపవాసం ఉండి జాగరణ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వలన శివుడి అనుగ్రహం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. ప్రతి సంవత్సరం శివరాత్రి పాల్గుణ మాసం కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి తిధి రోజున జరుపుతారు. అందులోనూ శివుడికి ప్రదోషకాలంలో చేసే పూజకు మరింత ప్రత్యేక ఉంది. మహాశివరాత్రి రోజు ఉదయాన్నే శివుడికి అభిషేకాలు, పూజలు ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తారు. అయితే పూజలో కొన్ని వస్తువులను అస్సలు ఉపయోగించకూడదట. వాటిని ఉపయోగించడం వలన శివుడికి పట్టరాని కోపం వస్తుందని అంటారు.
మొదటిగా తులసి అనేది శివుడి పూజలో నిషిద్ధం చేయబడింది. తులసి కేవలం విష్ణు పూజలోనే ఉపయోగించాలి. మహాశివరాత్రికి మాత్రమే కాదు సాధారణ రోజుల్లో కూడా శివుడి పూజకు తులసిని ఉపయోగించకూడదు. ఆ తర్వాత పసుపు అనేది కూడా శివ పూజలో ఉపయోగించకూడదు. పసుపు అనేది పవిత్రమైనది. ఇంట్లో ఏ శుభకార్యం అయినా పసుపు అనేది కచ్చితంగా ఉండాల్సిందే కానీ శివ పూజలో మాత్రం పసుపును వినియోగించకూడదు. పసుపు అనేది స్త్రీలకు సంబంధించింది. అందుకే పరమశివుడు పూజలో పసుపును ఉపయోగించరు. పసుపును అసలు శివలింగానికి కూడా పూయారు. అదేవిధంగా శంఖాన్ని కూడా శివ పూజలో వాడరు. ఈ శంఖంలో శంఖుడు అనే రాక్షసుడు నివసిస్తాడు. అందుకే మహాశివరాత్రి రోజు శంఖంతో నీటిని పూజలో ఉపయోగించరు.
అలాగే విరిగిన బియ్యాన్ని కూడా పరమేశ్వరుడు పూజలో ఉపయోగించరు. విరిగిన బియ్యంతో అక్షింతలను కూడా వాడరు. విరిగిన బియ్యాన్ని హిందూ మతంలో అశుభంగా భావిస్తారుష అలాగే సింధూరాన్ని కూడా శివుడు పూజలో ఉపయోగించరు. సింధూరాన్ని తమ భర్త సుదీర్ఘకాలం పాటు బ్రతకాలని స్త్రీలు నుదిటిపై ధరిస్తారు. అయినా సింధూరాన్ని పొరపాటున కూడా శివుడి పూజలో ఉపయోగించరు. ఇలా కొన్ని రకాల వస్తువులను పరమశివుడి పూజలో వాడరు. వీటికి అనేక కథలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి. మహాశివరాత్రి రోజు భక్తులు పూజలు, ఉపవాసం, జాగారం ఇలాంటివి చేస్తూ ఉంటారు. శివుడి అనుగ్రహం కోసం మహాశివరాత్రి రోజు భక్తులు ఎంతో విశేషంగా పూజిస్తుంటారు.