
Pitru Paksha : పితృపక్ష సమయంలో మగవారు ఈ తప్పులు చేస్తే ఇక అంతే... చాలా నష్టపోతారు...!
Pitru Paksha : హిందూ సనాతన ధర్మంలో ఏడాదిలోని ఒక నిర్దిష్ట కాలాన్ని పూర్వికులకు అంకితం చేయబడింది. ఈ కాలాన్ని పితృ పక్షం అని పిలుస్తారు. అయితే పక్షం అంటే 15 రోజులు. ఇక ఈ 15 రోజులు తమ పూర్వీకులు భూమి మీద ఉంటారనేది హిందువుల విశ్వాసం. కాబట్టి ఈ సమయంలో పూర్వీకుల శ్రద్ధ కర్మలను నిర్వహించి వారి ఆశీర్వాదాలను పొందుతారు. హిందూ క్యాలెండర్ ప్రకారం పితృ పక్షం భాద్రపద పౌర్ణమి తిదిన మొదలై భాద్రపద మాసం అమావాస్య తిథిన ముగుస్తుంది. అయితే ఈ ఏడాది పితృ పక్షం సెప్టెంబర్ 17వ తేదీ నుండి ప్రారంభమై అక్టోబర్ 02వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే పూర్వికులు తమ వారసులను కలవడం కోసం వస్తారని అలాగే పితృపక్షంలో చేసే నది స్నానం ,తర్పణం, దానం, శ్రద్ధ మరియు కర్మలకు, విశేష ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా పూర్వీకుల ఆత్మకు శాంతి కలిగి తమ వారసులను ఆశీర్వదిస్తారని నమ్మకం. అయితే ఈ సమయంలో మగవారు కొన్ని పనులను అస్సలు చేయకూడదు. ఒకవేళ ఆ పనులను పొరపాటున చేసిన పూర్వీకుల ఆగ్రహానికి గురవుతారని పండితులు చెబుతున్నారు. మరి పితృపక్ష సమయంలో మగవారు ఏ పనులు చేయకూడదో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…
పితృపక్ష సమయంలో ఇంట్లో ఎటువంటి శుభకార్యాలను చేయకూడదు. అలాగే ఈ సమయం ఇంట్లోని మగవారు కొత్త బట్టలను,కొత్త వస్తువులను కొనుగోలు చేయకూడదు. అంతేకాకుండా కొన్నిటికి దూరంగా ఉండాలి. అందులో తామసిక ఆహారానికి దూరంగా ఉంటూ సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ముఖ్యంగా మాంసం మద్యం వాటికి చాలా దూరంగా ఉండాలి.
పితృపక్ష సమయంలో మగవారు జుట్టును కత్తిరించుకోవడం అలాగే గడ్డం తీసివేయడం వంటి పనులు చేయకూడదు. ఒకవేళ చేసినట్లయితే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పూర్వీకుల కోసం నిర్వహించే ఆహారం మరియు ఆహార పాత్రల విషయాలను ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం మంచిది. రాగి , కుండ , ఇత్తడి పాత్రలలో ఆహారాన్ని సిద్ధం చేసుకోవాలి. అలాగే ఇనుప పాత్రల్లో వంట చేయకూడదు.
Pitru Paksha : పితృపక్ష సమయంలో మగవారు ఈ తప్పులు చేస్తే ఇక అంతే… చాలా నష్టపోతారు…!
పితృపక్ష సమయంలో కొత్త వ్యాపారాలను ప్రారంభించడం మరియు గృహప్రవేశాలు వంటివి చేయకూడదు. అంతేకాదు ఆహారంలో ఉల్లి వెల్లుల్లిని ఉయోగించకూడదు. ముఖ్యంగా ఈ సమయంలో నామకరణం పెళ్లిళ్లు , మహోత్సవాలు వంటి శుభకార్యాలను చేయకూడదు. ఒకవేళ ఈ సమయంలో ఈ పనులు చేస్తే పితృపక్షంలోని పితృదేవతలకు ఆగ్రహం వస్తుంది. దీంతో కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు డబ్బు నష్టం వంటివి ఉంటాయని పండితులు చెబుతున్నారు.
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
This website uses cookies.