Naga Panchami 2023 : రేపే శక్తివంతమైన నాగపంచమి ఆడవారు ప్రాణం పోయినా ఈ పొరపాట్లు చేయకండి…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Naga Panchami 2023 : రేపే శక్తివంతమైన నాగపంచమి ఆడవారు ప్రాణం పోయినా ఈ పొరపాట్లు చేయకండి…!!

Naga Panchami 2023 : ఆగస్టు 21వ తేదీన నాగపంచమి రాబోతుంది. అదే రోజు మొదటి శ్రావణ సోమవారం కూడా అయితే ఈ నాగపంచమి శ్రావణ సోమవారం కలిసి రావటం మూలంగా ఈరోజుకు ఎంతో విశిష్టత ఉంది. అయితే ఈ నాగపంచమి సోమవారం కలిసి రావటం మూలంగా ఈరోజు మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ఆడవారు ప్రాణం పోయినా కానీ ఈ నాలుగు పనులు అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఆరోజు ఈ పనులు కనక మీరు చేసినట్లయితే సర్పదేవతలకి […]

 Authored By aruna | The Telugu News | Updated on :20 August 2023,2:00 pm

Naga Panchami 2023 : ఆగస్టు 21వ తేదీన నాగపంచమి రాబోతుంది. అదే రోజు మొదటి శ్రావణ సోమవారం కూడా అయితే ఈ నాగపంచమి శ్రావణ సోమవారం కలిసి రావటం మూలంగా ఈరోజుకు ఎంతో విశిష్టత ఉంది. అయితే ఈ నాగపంచమి సోమవారం కలిసి రావటం మూలంగా ఈరోజు మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ఆడవారు ప్రాణం పోయినా కానీ ఈ నాలుగు పనులు అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఆరోజు ఈ పనులు కనక మీరు చేసినట్లయితే సర్పదేవతలకి కోపం వస్తుంది. ఈ విధంగా సర్పదేవతల కోపం కారణంగా మీరు అనేక సమస్యలను వస్తుంది. కాబట్టి ఈరోజు కచ్చితంగా మీరు ఏ తప్పులు చేయకూడదో తెలుసుకొని వాటి ప్రకార నడుచుకోవాలి. నియమ నిబంధనలు ఉల్లంఘించకుండా జాగ్రత్త పడ్డారంటే ఈ యొక్క సమస్య నుండి బయటపడగలుగుతారు.

ఆ సర్పదేవతల ఆగ్రహానికి బదులుగా అనుగ్రహం మీకు లభిస్తుంది. శ్రీమహావిష్ణువు జన్మనక్షత్రం శ్రావణ పేరుతో వచ్చే మాసం శ్రావణం చాంద్రమానం ప్రకారం తెలుగు సంవత్సరాది లో ఐదో నెల ఈ శ్రావణం ఈ నెలలో నోములు వ్రతాలు, పూజలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. భక్తితో వేడుకుంటే కోరిన వరాలను ప్రసాదించే కల్పవల్లి వరలక్ష్మి దేవిగా హిందువులు జరుపుకుంటు ఉంటారు. స్కంద పురాణంలో నాగపంచమే విశిష్టతను సాక్షాత్తు ఆ పరమశివుడే వివరించారు. మొదటి శ్రావణ సోమవారం కలిసి రావడంతో ఆరోజు మరింత ప్రత్యేకతను ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఆ రోజున ఖచ్చితంగా స్త్రీలు పొరపాటున కూడా ఈ నాలుగు పనులు చేయకండి.

Naga Panchami 2023 is on August 21 Do Not Make These

Naga Panchami 2023 is on August 21 Do Not Make These

ఒకవేళ ఆ పనులు చేశారంటే మీ జీవితంలో సుఖాలకు బదులు కష్టాలు చూస్తారు. మీ జీవితంలో అనేక సమస్యలను మీకు మీరే కొని తెచ్చుకున్న వారవుతారు. మీ జీవితంలో అనేక సమస్యలకి మీకు మీరే ఆజ్యం పోసుకున్నవారు అవుతారు. కాబట్టి ఈ నాలుగు పనులు అస్సలు చేయకండి. అయితే ఆ రోజున అంటే నాగపంచమి మొదటి శ్రావణ సోమవారం కలిసి వచ్చిన ఆ రోజున స్త్రీలు చేయకూడని మొదటి పని ఏమిటి అంటే కనుక ఆ రోజున కూరగాయలు తరగకూడదు.ఈ విధంగా చేశారంటే ఆ సర్పదేవతల కోపానికి చూడవల్సి వస్తుంది కాబట్టి ఆడవారు కూరగాయలు తరగకూడదు. అలాగే నాగలి పనిముట్లు లాంటివి ఉపయోగించకూడదు.. అలాగే నాగపంచమి అలాగే శ్రావణ సోమవారం కలిసి వచ్చిన ఆ రోజున స్త్రీలు చేయకూడని మరొక పని ఏమిటి అంటే కనుక చాలామంది నాగపంచమి రోజు పుట్ట దగ్గరికి వెళ్లి పాలు పోస్తూ ఉంటారు. అదేవిధంగా మరికొంతమంది గుడ్లు కూడా పెడుతూ ఉంటారు.

పాము గుడ్డు తింటుంది అని పుట్ట దగ్గర గుడ్డును పెడుతూ ఉంటారు. కానీ ఈ విధంగా మీరు అస్సలు చేయకూడదు. మీకు శుభం కంటే అశుభం కలిగే పరిస్థితిలో ఎక్కువగా ఉంటాయి. అలాగే మీరు చేయకూడని మరొక పని ఏమిటి అంటే కనుక ఆ రోజున పొట్లకాయ కూరను అస్సలు వండకూడదు. ఎందుకంటే పొట్లకాయ చూడటానికి పాములాగా కనిపిస్తుంది. కాబట్టి ఆ రోజున పొట్లకాయ కూరను వండకూడదు. అలాగే స్త్రీలు చేయకూడని మరొక పని ఏమిటి అంటే గనక మయిళతో ఉన్న స్త్రీలు పుట్ట దగ్గరికి వెళ్ళటం కానివ్వండి. పూజలో పాల్గొనటం కానివ్వండి. చేయకూడదు. ఈ విధంగా మీరు చేసినట్లయితే ఆ సర్పదేవతల యొక్క కోపానికి మీరు బలి కావలసి వస్తుంది. ఈ విధంగా సర్పదేవతలకి కోపం రాకుండా సర్పదేవతల యొక్క అనుగ్రహం కోసం మీరు నియమాలు కచ్చితంగా పాటించాలి.

Also read

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది