Sunset : సూర్యాస్తమయం తర్వాత చీకటి పడుతుంది ఇది ప్రతికూలతకు చిహ్నంగా భావిస్తారు. ఈ సమయంలో ప్రతికూల శక్తులు చీకటిలో ఆధిపత్యం చేలాయిస్తాయి. అలాగే ఈ సమయంలో తంత్ర సాధన కూడా చేస్తారు. అయితే పురాణాల ప్రకారం సూర్యాస్తమయం తర్వాత కొన్ని పనులు చేయకూడదని పెద్దలు చెబుతుంటారు. ఇక ఈ పనులను చేయడం వలన జీవితంలో ఆర్థికంగా నష్టపోవడంతో పాటు ఇంట్లో లక్ష్మీదేవి నిల్వ ఉండదు. అంతేకాదు సాయంత్రం సమయంలో ఈ పనులు చేయడం వలన దరిద్రం పట్టుకుంటుందని చెబుతారు. ఇక హిందూమతంలో ఎన్నో విషయాల గురించి చెప్పబడ్డాయి. వీటిని అనుసరించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇవి మన జీవితంలో ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. అయితే కొంతమంది ఈ తప్పులను విమర్శిస్తారు. వీటివల్ల వారు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. మరి సూర్యాస్తమయం తర్వాత ఎటువంటి పనులను చేయకూడదో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
ఇంటిని శుభ్రం చేయకూడదు: సూర్యాస్తమయం తర్వాత చాలామంది ఇంటిని తుడవడం వంటివి చేస్తారు. కానీ ఇలా చేయకూడదు. దీనివల్ల ఇంట్లో ఆర్థిక నష్టాలు వస్తాయి. అంతేకాదు లక్ష్మీదేవికి చీపురుకి ముడిపడి ఉంటుంది కాబట్టి సాయంత్రం పూట చీపురుతో ఇంటిని శుభ్రం చేస్తే అక్కడ లక్ష్మీదేవి నివసించదు.
ఇంటి తలుపులు మూసి ఉంచవద్దు : సూర్యుడు అస్తమించిన తరువాత ఇంటి ప్రధాన ద్వారం యొక్క తలుపులను మూసివేయకూడదు. ఎందుకంటే హిందూ మత విశ్వాసం ప్రకారం సాయంత్రం పూట లక్ష్మీదేవి తో పాటు సహదేవతలు కూడా వస్తారు. ఇలా తలుపు మూసి ఉంచితే వారు బయట నుంచి తిరిగి వెళ్ళిపోతారు. అంతేకాదు సాయంత్రం పూట గుమ్మం ముందు దీపం వెలిగించాలి. దీంతో ఇంట్లో చీకట్లు ఉండవు.
నిద్రించకూడదు : కొంతమంది సాయంత్ర సమయంలో నిద్రపోతారు కానీ ఇలా అసలు చేయకూడదు. దీనివల్ల ప్రతికూల శక్తి ఏర్పడుతుంది. అలాగే లక్ష్మీదేవి అక్కడ నివసించదు. ముఖ్యంగా సూర్యాస్తమ సమయంలో ఇంట్లో నిద్రించడం వలన పురోగతి అనేది ఉండదు. సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి అక్కడ నివసించదు.
తులసి ఆకులు తెంచవద్దు : సూర్యాస్తమయం తర్వాత తులసి దళాలను తెంచకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం రావచ్చు. అలాగే ఇంట్లో దరిద్రం నెలకొంటుంది. కాబట్టి సాయంత్రం పూట తులసి పూజ చేసి దీపారాధన చెయ్యడం శుభప్రదం.
వీటిని దానం చేయవద్దు : సూర్యుడు అస్తమించిన తరువాత ఉప్పు పెరుగు పసుపు డబ్బులు మొదలైన వస్తువులను దానంగా ఇవ్వవద్దు. అంతేకాదు వెల్లుల్లిపాయలు సూదులు ఉల్లిపాయలు వంటివి సాయంత్రం పూట ఇంటి నుండి బయటకు తీసుకువెళ్లకూడదు. ఇది అశుభ్రంగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా సాయంత్రం పూట ఎవరికి డబ్బులను అప్పుగా ఇవ్వవద్దు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది.
బట్టలు ఉతకవద్దు : సూర్యాస్తమయం తర్వాత బట్టలు ఉతకడం శుభ్రం చేయడం వంటి అశుభకరమైన పనులను చేయకూడదు.ఇలా చేస్తే ఇంట్లో ఆర్థిక సమస్యలు నెలకొంటాయి కాబట్టి పొరపాటున కూడా సాయంత్రం పూట బట్టలను ఉతకకూడదు.
జుట్టు గోర్లు కత్తిరించవద్దు : సూర్యుడు అస్తమించిన తర్వాత గోర్లు లేదా జుట్టులను కత్తిరించకూడదు. ఎందుకంటే వాస్తు శాస్త్రం ప్రకారం సాయంత్రం పూట ఇలా చేస్తే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ త్వరగా వస్తుంది. కాబట్టి సూర్యాస్తమయం తర్వాత బట్టలు ఉతకడం గోర్లు జుట్టు కత్తిరించడం వంటి పనులను అసలు చేయకూడదు.
Rythu Bharosa : రైతు భరోసా పథకం కింద తెలంగాణా రాష్ట్రం రైతులకు విడతల వారీగా డబ్బుని వారి ఖాతాల్లో…
Empty Stomach : ప్రతి ఒక్కరి వంట గదిలో ఉండే మసాలా దినుసులలో లవంగం కూడా ఒకటి. అలాగే ఈ…
Mangal Dosha : జ్యోతిష్య శాస్త్రంలో కుజ గ్రహానికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఈ క్రమంలోనే అక్టోబర్ 21వ తేదీ నుండి…
Vastu Tips : కొన్ని మొక్కలు వాస్తు ప్రకారంగా ఇంట్లో పెడుతూ ఉంటారు. వాటిని ఉంచడం వలన వాస్తు దోషాలు…
కేంద్ర ప్రభుత్వం నగదుని తక్కువగా ఉంచుకుని కేవలం ఎక్కువగా డిజిటల్ లావాదేవీలే చేయమని అంటుంది. కృత్రిమ మేధస్సు పురోగతి వల్ల…
Money Born : నిజంగా మనిషికి ఈ డబ్బు money ఎంత అవసరమో మీకు చెప్పాల్సిన పనిలేదు. అందరూ డబ్బులు…
Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగిపోతుంది.…
Pushpa 2 The Rule Trailer : అల్లు అర్జున్ Allu Arjun సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప 1…
This website uses cookies.