Mangal Dosha : జ్యోతిష్య శాస్త్రంలో కుజ గ్రహానికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఈ క్రమంలోనే అక్టోబర్ 21వ తేదీ నుండి జనవరి 12వ తేదీ వరకు కర్కాటక రాశిలో కుజుడు సంచరిస్తున్నాడు. కర్కాటక రాశిలో కుజుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారిపై కుజదోష ప్రభావం పడుతుంది.
కుజదోషాన్ని మంగళ దోషం అని కూడా అంటారు. అయితే ఏ రాశిలో అయినా కుజుడు ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాలలో సంచరిస్తే కుజదోషం ఏర్పడుతుంది. దీంతో కొన్ని రాశుల వారిపై దీని ప్రభావం పడుతుంది. మరి కుజ దోషం కారణంగా ఏ రాశులవారు ఎటువంటి కష్టాలను ఎదుర్కొంటారో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…
మేషరాశి : కుజుడు మేషరాశిలో చతుర్ధ స్థానంలో నీచత్వాన్ని పొందుతున్నందువలన ఈ రాశి వారి జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడతాయి. అలాగే కుటుంబ సౌఖ్యం తగ్గుతుంది. ఇక వృత్తి వ్యాపారాలలో పనిచేస్తున్న వారికి ప్రమాదాలు ఉంటాయి. ఈ సమయంలో కుటుంబంలో సమస్యలను జాగ్రత్తగా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంటుంది.
మిధున రాశి : మిధున రాశిలో కుటుంబ స్థానంలో కుజదోషం ఏర్పడింది. దీని కారణంగా వైవాహిక జీవితంలో మనస్పర్ధాలు ఏర్పడతాయి. ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలను తీసుకోవడం వలన చిక్కుల్లో పడతారు. కాబట్టి ఓర్పు సహనంతో వ్యవహరించాలి. ముఖ్యంగా కుటుంబ దాంపత్య జీవితంలో జాగ్రత్తగా వ్యవహరించాలి లేకుంటే నష్టం జరిగే అవకాశం ఉంటుంది.
కర్కాటక రాశి : కుజదోషం కారణంగా కర్కాట రాశి జాతకులకు అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఉద్యోగంలో పని భారం విపరీతంగా పెరుగుతుంది. అలాగే జీవిత భాగస్వామితో గొడవలు జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో కర్కాట రాశి జాతకుల ఖర్చులు అధికంగా పెరుగుతాయి.
సింహరాశి : మంగళ దోషం కారణంగా సింహ రాశి జాతకులకు వారి జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంటుంది. దీంతో వీరి వైవాహిక జీవితంలో సుఖసంతోషాలు సన్నగిల్లుతాయి. కుటుంబంలో కలహాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి.
మకర రాశి : మకర రాశి జాతకులకు సప్తమ స్థానంలో కుజసంచారం కారణంగా కుటుంబంలో మానసిక ఒత్తిడిలుపెరుగుతాయి. జీవిత భాగస్వామితో ఎక్కువగా గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగ మరియు వ్యాపార రంగంలో కాస్త ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ధనుస్సు రాశి : ధనుస్సు రాశిలో అష్టమ స్థానంలో కుజసంచారం కారణంగా ఏర్పడిన మంగళ దోషం వలన ఈ రాసి జాతకులకు ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. కుటుంబంలో మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంటుంది. దంపతుల మధ్య ఆప్యాయతా అనురాగాలు తగ్గుతాయి. ఈ సమయంలో ఈ రాశి జాతకులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. లేకపోతే చాలా నష్టపోవాల్సి ఉంటుంది.
Sunset : సూర్యాస్తమయం తర్వాత చీకటి పడుతుంది ఇది ప్రతికూలతకు చిహ్నంగా భావిస్తారు. ఈ సమయంలో ప్రతికూల శక్తులు చీకటిలో…
Vastu Tips : కొన్ని మొక్కలు వాస్తు ప్రకారంగా ఇంట్లో పెడుతూ ఉంటారు. వాటిని ఉంచడం వలన వాస్తు దోషాలు…
కేంద్ర ప్రభుత్వం నగదుని తక్కువగా ఉంచుకుని కేవలం ఎక్కువగా డిజిటల్ లావాదేవీలే చేయమని అంటుంది. కృత్రిమ మేధస్సు పురోగతి వల్ల…
Money Born : నిజంగా మనిషికి ఈ డబ్బు money ఎంత అవసరమో మీకు చెప్పాల్సిన పనిలేదు. అందరూ డబ్బులు…
Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగిపోతుంది.…
Pushpa 2 The Rule Trailer : అల్లు అర్జున్ Allu Arjun సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప 1…
Body Fat : ప్రస్తుతం జీవిస్తున్న విధానంలో ఎన్నో ఆహారం మార్పులు వలన చాలామంది అధిక బరువు పెరిగిపోతున్నారు. ఈ…
Naga Chaitanya Shobhitha : అక్కినేని నాగ చైతన్య శోభితల మ్యారేజ్ డేట్ ఫిక్స్ Wedding Invitation అయ్యింది. ఐతే…
This website uses cookies.