sravana masam : శ్రావణమాసం రానే వచ్చేసింది. ఈ శ్రావణ మాసంలో ఎంతో మంది మాంసాహారానికి చాలా దూరంగా ఉంటారు. ఈ సాంప్రదాయం వెనక మతపరమైన కారణాలు మాత్రమే కాక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి అని మీకు తెలుసా.అవును ఇది నిజం. ఇంతకీ దీని వెనక ఉన్నటువంటి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…
ముఖ్యంగా ఈ వర్షాకాలం జలచరాలకు సంతాన ఉత్పత్తి కాలం అని చెప్పొచ్చు. అందుకే ఈ టైంలో మానవులు చేపలు పట్టుకొని తింటే అది జలచరాల పునరుత్పత్తికి ఎంతో ఆటంకం కలుగుతుంది. అంతేకాక చాపల సంఖ్య కూడా తగ్గుతుంది. దీంతో సృష్టి లయ అనేది పోతుంది. కావున ఈ టైంలో చేపలతో సహా మాంసాన్ని కూడా ఎక్కువగా తీసుకోరు. ఈ వాన కాలంలో నీరు ఎక్కువగా కలుషితం అయ్యే అవకాశం కూడా ఉన్నది. ఈ నీటిలో నివసిస్తున్న చేపలు లేక కలుషిత నీటిపై ఆధారపడినటువంటి ఎన్నో జంతువులు ఇతర నీటి ద్వారా సంక్రమించే వ్యాధులకు గురి అవుతాయి.
కావున శాఖాహారమే మన రక్షణకు అనుకూలం అని పెద్దలు అంటుంటారు. ఈ శ్రావణ మాసంలో వానాకాలం ముగియకపోవడం మరియు ఎండలు లేకపోవటం కూడా మరొక కారణం అని చెప్పొచ్చు. ఈ కాలంలో వెలుతురు కూడా చాలా తక్కువగా ఉంటుంది.
మన శరీరంలో జీవక్రియ అనేది ఎంతో వేగంగా జరుగుతుంది. దీని వల్ల మాంసం లాంటి గట్టి ఆహారం శరీరానికి జీర్ణం కావడం ఎంతో కష్టం అవుతుంది. అందుకే ఈ కాలంలో మాంసం తినటం మంచిది కాదు అని అంటారు. మొత్తం మీద ఇది మన మానవ శరీరానికి మరియు ఆరోగ్యానికి జంతువులు,పకృతి సంక్షేమానికి ఉత్తమం. వీటిని దృష్టిలో పెట్టుకొని మన పెద్దలు ఎన్నో ఏళ్లుగా దీనిని పాటిస్తున్నారు. వీలైతే ప్రతి ఒక్కరు దీనిని పాటిస్తే మంచిది.
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
This website uses cookies.