Sravana Masam : శ్రావణ మాసంలో మాంసం తినకూడదా… దీని వెనుకున్న శాస్త్రీయ కారణం ఏమిటి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sravana Masam : శ్రావణ మాసంలో మాంసం తినకూడదా… దీని వెనుకున్న శాస్త్రీయ కారణం ఏమిటి…!

 Authored By ramu | The Telugu News | Updated on :15 August 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Sravana Masam : శ్రావణ మాసంలో మాంసం తినకూడదా... దీని వెనుకున్న శాస్త్రీయ కారణం ఏమిటి...!

sravana masam :  శ్రావణమాసం రానే వచ్చేసింది. ఈ శ్రావణ మాసంలో ఎంతో మంది మాంసాహారానికి చాలా దూరంగా ఉంటారు. ఈ సాంప్రదాయం వెనక మతపరమైన కారణాలు మాత్రమే కాక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి అని మీకు తెలుసా.అవును ఇది నిజం. ఇంతకీ దీని వెనక ఉన్నటువంటి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…

ముఖ్యంగా ఈ వర్షాకాలం జలచరాలకు సంతాన ఉత్పత్తి కాలం అని చెప్పొచ్చు. అందుకే ఈ టైంలో మానవులు చేపలు పట్టుకొని తింటే అది జలచరాల పునరుత్పత్తికి ఎంతో ఆటంకం కలుగుతుంది. అంతేకాక చాపల సంఖ్య కూడా తగ్గుతుంది. దీంతో సృష్టి లయ అనేది పోతుంది. కావున ఈ టైంలో చేపలతో సహా మాంసాన్ని కూడా ఎక్కువగా తీసుకోరు. ఈ వాన కాలంలో నీరు ఎక్కువగా కలుషితం అయ్యే అవకాశం కూడా ఉన్నది. ఈ నీటిలో నివసిస్తున్న చేపలు లేక కలుషిత నీటిపై ఆధారపడినటువంటి ఎన్నో జంతువులు ఇతర నీటి ద్వారా సంక్రమించే వ్యాధులకు గురి అవుతాయి.

కావున శాఖాహారమే మన రక్షణకు అనుకూలం అని పెద్దలు అంటుంటారు. ఈ శ్రావణ మాసంలో వానాకాలం ముగియకపోవడం మరియు ఎండలు లేకపోవటం కూడా మరొక కారణం అని చెప్పొచ్చు. ఈ కాలంలో వెలుతురు కూడా చాలా తక్కువగా ఉంటుంది.

Sravana Masam శ్రావణ మాసంలో మాంసం తినకూడదా దీని వెనుకున్న శాస్త్రీయ కారణం ఏమిటి

Sravana Masam : శ్రావణ మాసంలో మాంసం తినకూడదా… దీని వెనుకున్న శాస్త్రీయ కారణం ఏమిటి…!

మన శరీరంలో జీవక్రియ అనేది ఎంతో వేగంగా జరుగుతుంది. దీని వల్ల మాంసం లాంటి గట్టి ఆహారం శరీరానికి జీర్ణం కావడం ఎంతో కష్టం అవుతుంది. అందుకే ఈ కాలంలో మాంసం తినటం మంచిది కాదు అని అంటారు. మొత్తం మీద ఇది మన మానవ శరీరానికి మరియు ఆరోగ్యానికి జంతువులు,పకృతి సంక్షేమానికి ఉత్తమం. వీటిని దృష్టిలో పెట్టుకొని మన పెద్దలు ఎన్నో ఏళ్లుగా దీనిని పాటిస్తున్నారు. వీలైతే ప్రతి ఒక్కరు దీనిని పాటిస్తే మంచిది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది