లక్ష్మీదేవికి ఏ రోజు ఏ అభిషేకం చేయాలి ?
లక్ష్మీదేవి.. సకల సంపదలకు నిలయం. అయితే ఆ అమ్మవారి అనుగ్రహం కోసం ఆయా తిథులలో ఆయా రకాల అభిషేకాలను చేస్తే విశేష ఫలితాలు వస్తాయి. వాటి గురించి తెలుసుకుందాం…
పాడ్యమి తిథి రోజు ఆవునెయితో అభిషేకం చేస్తే సకల రోగాలు నివారణ అవుతాయి. ఇక విదియనాడు అమ్మవారికి చక్కరతో అభిషేకం చేస్తే దీర్ఘాయువు, ఆరోగ్యం లభిస్తుంది. తదియనాడు అమ్మవారికి ఆవుపాలతో అభిషేకం చేస్తే అపమృత్యుదోషాలు, భయాలు పోతాయి. దీర్ఘాయువు లభిస్తుంది. చవితినాడు అమ్మవారికి అభిషేకం చేస్తే విద్యాప్రాప్తి, విఘ్ననివారణ కలుగుతుంది. షష్టి రోజు తేనే లేదా మధువుతో అమ్మవారిని అభిషేకం చేస్తే కీర్తి ప్రతిష్టలు, ప్రఖ్యాతలు వస్తాయి. అదేవిధంగా ప్రతిరోజు అమ్మవారి దగ్గర ఆవునెయ్యిదీపం లేదా ఇప్పనూనెతో దీపారాధన చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. ఇక ఇంట్లో అమ్మవారి కూర్చున్న ఫోటుతోపాటు పక్కన రెండు ఏనుగులు ఉన్న ఫోటో పెట్టుకుని అమ్మవారిని ఆరాధిస్తే తప్పక సంపద పెరుగుతుంది. దీంతోపాటు శ్రీసూక్తం, కనకధార పారాయణం చేయడం వల్ల అనుకూలమైన శక్తి, విల్పవర్ పెరుగుతుంది.