Peacock Vastu Tips : మీ ఇంట సిరుల కాసుల వర్షం కురవాలంటే… ఈ దిశలో ఇది పెట్టండి…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Peacock Vastu Tips : మీ ఇంట సిరుల కాసుల వర్షం కురవాలంటే… ఈ దిశలో ఇది పెట్టండి…?

 Authored By ramu | The Telugu News | Updated on :25 July 2025,8:00 am

ప్రధానాంశాలు:

  •  Peacock Vastu Tips : మీ ఇంట సిరుల కాసుల వర్షం కురవాలంటే... ఈ దిశలో ఇది పెట్టండి...?

Peacock Vastu Tips : వాస్తు శాస్త్రం ఏం చెబుతుంది అంటే, ఇంట్లో వాస్తు మూలాలు , వాటి దిశలనుబట్టి ఆ ఇంట్లో కలిగే ప్రభావాలను తెలియజేస్తుంది. అదృష్టమైన, దుదృష్టమైన ఇంట్లో వాస్తు ప్రభావం వలన సంభవిస్తాయి. అయితే ఇంట్లో ఈ దిశలో గనుక వెండితో చేసిన నెమలి పించం కలిగిన నెమలిని పెట్టినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం తప్పక కలుగుతుంది అని చెబుతున్నారు వాస్తు నిపుణులు. ఇంటికి అందాన్ని,అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఇంకా వాస్తు దోష నివారణ కూడా చేస్తుంది. వెన్నతో చేసిన నెమలిని ఒక ప్రముఖ ప్రదేశంలో ఉంచుతారు లేదా పూజా స్థలంలో ఉంచవచ్చు. ఇది మీ ఇంట్లో ఉన్నట్లయితే కుటుంబంలో సామరస్యాన్ని, ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందిస్తుంది అని వాస్తు నిపుణులు పేర్కొంటున్నారు. వెండి మెరుపు, నెమలి అందం ఇంట్లో సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఇది శాంతిని కూడా పెంచుతుంది.

Peacock Vastu Tips మీ ఇంట సిరుల కాసుల వర్షం కురవాలంటే ఈ దిశలో ఇది పెట్టండి

Peacock Vastu Tips : మీ ఇంట సిరుల కాసుల వర్షం కురవాలంటే… ఈ దిశలో ఇది పెట్టండి…?

ఇంట్లో అయిన వాస్తు సరిగా ఉంటేనే ఆ ఇంట్లో లాభనష్టాలైనా, సుఖసంతోషాలైనా ఆధారపడి ఉంటాయి. సానుకూల శక్తి శ్రేయస్సు పెరగాలంటే వాస్తు శాస్త్రంలో అనేక నియమాలు ఉన్నాయి. అలాగే నివారణలు కూడా సూచిస్తున్నారు వాస్తు నిపుణులు. శక్తివంతమైన నివారణ ఒకటి వెండి నెమలి. ఇంట్లోని వాస్తు దోషాన్ని తొలగించడమే కాదు మీ ఇంట సిరుల పంట కురిపించేలా లక్ష్మీదేవి ఆశీర్వాదం కూడా తప్పక లభిస్తుంది. వెండి నెమలి మీ ఇంటి వాస్తుకు అనుగుణంగా, సంపన్నులుగా చేస్తుంది. వెండి నెమలిని మీ ఇంట్లో ఏ దిశలో పెడితే మంచిదో తెలుసుకుందాం…

Peacock Vastu Tips ఇంట్లో ఏ దిశలో పెడితే మంచిది

వెండి నెమలిని వాస్తు శాస్త్రం ప్రకారం శుభ చిహ్నంగా పరిగణిస్తారు. ఇది శ్రేయస్సు,శక్తిని సూచిస్తూ శ్రీ మహాలక్ష్మి,ఆ కార్తికేయ తో ముడిపడి ఉంటుంది అందుకే ఇంట్లో వెండి నెమలి ప్రతికూల శక్తిని సానుకూల శక్తిని ప్రసరింపజేస్తుంది. నెమలిని మీ ఇంట్లో సరైన దిశలో ఉంచినట్లయితే మీ ఇంటికి ఉన్న వాస్తు దోషం పూర్తిగా తొలగిపోతుంది. దీంతో సంపద, ఆనందం, శాంతి మీ ఇంట్లో నెలకొంటుంది. అంతేకాదు, వెండి నెమలి శుక్ర గ్రహానికి, చంద్రునికి సంబంధించినది. కాబట్టి,శుక్రుడు ప్రేమ, ఐశ్వర్యం, శ్రేయస్సుకు కారకుడు అని చెబుతారు. అలాగే, చంద్రుడు మనశ్శాంతిని పెంచుతాడు. అందుకే ఇంట్లో వెండి నెమలి ఉంటే ఆ ఇంటికి అందం, అదృష్టం కూడా కలిసి వస్తుంది. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే దీనిని మీ పూజ స్థలంలో లేదా ఇంట్లో ఒక ప్రముఖ ప్రదేశంలో ఉంచండి. ఇది మీ కుటుంబంలో సామరస్యాన్ని, ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుంది అని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

వాస్తు శాస్త్రం ప్రకారం..వెండి తో చేసిన నెమలి విగ్రహాన్ని ఈశాన్యం వైపు ఉంచితే మంచిది. ఈ దిశ పవిత్రమైనదిగా పరిగణించడం జరిగింది.ఈ దిశలో వెండి నెమలిని ఉంచితే ఇంట్లో ఆనందం,శాంతి, శ్రేయస్సు కలుగుతాయి.సంపద వృద్ధి చెందుతుంది.నెమలి విగ్రహాన్ని కొనుగోలు చేసేటప్పుడు నెమలి నృత్యం చేస్తున్నట్లు లేదా కదిలే స్థితిలో ఉండే విగ్రహాన్ని కొనుగోలు చేస్తే చాలా మంచిది.ఇది ఇంట్లో సానుకూల శక్తిని ప్రసరింపజేసి వాసు దోషాన్ని తొలగిస్తుంది.ఇంకా లక్ష్మీదేవి కటాక్షాన్ని మీకు కలిగేలా చేస్తుంది. వాస్తు దోషం కారణంగా ఇంట్లో ఆర్థిక సంక్షోభం కుటుంబ శాంతి, వెండి నెమలి ప్రభావంతమైన నివారణ ఇది ప్రతికూల శక్తిని గ్రహిస్తుంది. ఇంటి వాతావరణ శుద్ధి చేస్తుంది.ముఖ్యంగా, మీ ఇంటి ప్రధాన ద్వారం లేదా ప్రార్థన స్థలంలో తప్పు దిశలో ఉంటే వెండి నెమలిని ఉంచడం వల్ల ఆ దోషం ప్రభావం తగ్గుతుందని చెబుతారు. వెండి నెమలి సంపదను మాత్రమే కాదు,కుటుంబ సంబంధాలలో మాధుర్యాన్ని కూడా పెంచుతుంది. దీనిని లివింగ్ రూమ్ లో ఉంచితే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అవగాహన పెరుగుతుంది. ఉద్రిక్తతలు అపార్థాలను తొలగించేసి వెండి మెరుపుకు, నెమలి అందానికి ఇంట్లో సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది.ఇది శాంతిని నెలకొల్పుతుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది