Gods Photos : పాడైపోయిన దేవుని ఫోటోలకు పూజ చేస్తే ఇంటికి దోషమా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Gods Photos : పాడైపోయిన దేవుని ఫోటోలకు పూజ చేస్తే ఇంటికి దోషమా..?

 Authored By prabhas | The Telugu News | Updated on :8 November 2022,6:30 am

Gods Photos : చాలామంది ఇంట్లో పాడైపోయిన పాత ఫోటోలు కూడా వాటిని పడే లేక వాటి కూడా పూజ చేస్తూ ఉంటారు. సహజంగా చాలామంది గృహాలలో పూజ గదిలో దేవుడి పటాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అయితే ఇలా పూజ రూమ్ లో ఎక్కువ ఫోటోలు ఉండకూడదు. ఎనకట కాలంలో ఒక సామెత చెప్పేవాళ్లు అది ఏమిటంటే రోజు పూజ చేసేవాడు పరమ దరిద్రుడు. నిత్య పూజారి పరమ దరిద్రుడు అనగా.. నిత్యం దేవునికి పూజ చేస్తూ ఉండేవాళ్లు దరిద్రంతో సమానం. ఆ విధంగా ఎందుకంటే దేవుడికి కూడా ఎక్కువగా పూజలు చేస్తే నచ్చదట. కావున దేవుని పూజ చేయాలి.

అనుకున్న వాళ్లు 40 నిమిషాలు మాత్రమే దేవునికి కేటాయించి పూజ చేసుకుంటే మంచిది. పూజ చేసిన తదుపరి పని చేసుకోవాలి. ఏదైనా పని చేస్తేనే తినడానికి తిండి ఉంటుంది. కావున పూజ తర్వాత పనిమీద ఆసక్తి చూపించాలి. అప్పుడే ఆ దేవున్ని చల్లని చూపు నీపై కలుగుతుంది. అదేవిధంగా పూజ గదిలో కొన్ని రకాల దేవుడి పటాలను అస్సలు పెట్టవద్దు. చాలామంది గృహాలలో దేవుడి పటాలు బూజు పట్టడం, అద్దాలు పగిలిపోవడం, వంగిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. అయితే అలాంటి దేవుడి ఫోటోలను ఎప్పుడూ గృహంలో ఉంచి పూజించకూడదు.

Puja to damaged photos of Gods is bad for the house

Puja to damaged photos of Gods is bad for the house

ఒకవేళ అలా విరిగిపోయిన, బూజు పట్టిన ఫోటోలకు పూజ చేయడం వలన మీరు ఎంత పూజ చేసిన ఫలితం ఉండపోగా ఆ శుభం జరుగుతుంది. మీ గృహంలో పాడైపోయిన ఫోటోలు ఉంటే వాటిని వెంటనే పారే నీటిలో నిమజ్జనం చేయాలి.పాడైపోయిన దేవుని పటాలను గృహంలో ఉంచుకొని పూజ చేయడం వలన అంత ఆ శుభమే జరుగుతుంది. కావున అలాంటప్పుడు ఆ దేవుడి ఫోటోలను వెంటనే తీసి ఎక్కడైనా పారే నీటిలో నిమజ్జనం చేయడం శుభకరం. అదేవిధంగా చాలా మంది గృహంలో విరిగిపోయిన విగ్రహాలను కూడా పెట్టుకుంటూ ఉంటారు. ఆ విధంగా కూడా పెట్టి పూజించకూడదు. ఆ విధంగా చేయడం వలన ఇంటికి కీడు జరుగుతుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది