Ganesh Pooja : హిందూ పురాణాలు ప్రకారం మనం ఏ పూజ చేసినా, ఏ శుభకార్యం చేసినా ముందుగా వినాయకుడిని పూజిస్తాం. విఘ్నాలు తొలగించే ఈ విఘ్నేష్వరుడికి పూజ చేశాకే… మిగిలిన పూజలు, పునస్కారాలు, వ్రతాలు, శుభకార్యాలు చేస్తాం. మనం చేయబోయే పూజలు, శుభకార్యాల్లో ఎలాంటి ఆటంకాలు కల్గకుండా ప్రశాంతంగా నిర్విఘ్నంగా ఆ శుభకార్యం పూర్తవ్వడం కోసమే వినాయకుడికి పూజ చేస్తుంటాం. అయితే వినాయకుడి పూజలో అనేక రకాల పూలు, పండ్లు, ఆకులను వాడుతుంటాం. కానీ తులసీ దళాలలను మాత్రం అస్సలే ఉపయోగించం. మనకు కారణం ఏమిటో తెలియకపోయినప్పటికీ… మన పెద్దలు వద్దాన్నారన్న ఒక్క కారణంతో వినాయకుడి పూజలో తులసీ దళాన్ని ఉపయోగించం. కానీ విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడి పూజలో తులసీ దళాలలను ఎందుకు వినియోగించరో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తులసి మొక్కకు హిందూ సంప్రదాయాల్లో ఎంతో ప్రత్యేకత ఉంది. తలసి చెట్టును గౌరీ దేవిగా భావించి పూజలు చేస్తుంటాం. కార్తీక మాసంలో అయితే తలసి చెట్టుకు పెళ్లి కూడా చేస్తుంటాం. మరి అంత పవిత్రమైన తలసి చెట్టు ఆకులను మాత్రం వినాయకుని పూజలో ఉపయోగించం. ఇందుకో ఓ ప్రత్యేక కారణం ఉంది. అదేంటంటే… వినాయకుడు ఓ నదీ పరీవాహక ప్రాంతంలో తపస్సు చేసేందుకు వెళ్లాడట. ఆ సమయంలో వినాయకుడిని చూసిన ధర్మ ద్వజ యువరాణి… గణేషుడిని మోహిస్తుంది. పెళ్లి చేసుకోమన్ని వినాయకుడిని వేడుకుంటుంది. గణేషుడు ఆమెను పెళ్లి చేసుకుంటే తన తపస్సుకి భంగం కల్గుతుందని ఆమెతో వివాహానికి నిరాకరిస్తాడు.
అది తట్టుకోలేని ఆ యువరాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కోపంలో నీకు ఇష్టం లేని వారితో బలవంతంగా నీ పెళ్లి జరుగుతుందని శపిస్తుంది. ఇలా వినాయకుడి కి శాపం పెట్టడం వల్ల ఆగ్రహం చెందిన గణనాథుడు ధర్మ యువరాణి వివాహం ఒక రాక్షసుడితో జరుగుతుందని తిరిగి శాపం పెడతాడు. వినాయకుడి శాపం వల్ల తీవ్ర కుంగుబాటుకు గురైన ఆ యువరాణి తన తప్పును తెలుసుకుంటుంది. శాపవిమోచనం కల్పించమని వేడుకుంటుంది. కానీ అది సాధ్యం కాదని… కానీ రాక్షసుడితో కొన్నేళ్లు జీవించినప్పటికీ.. తర్వాతి జన్మలో పరమ పవిత్రమైన తులసిగా నీవు జన్మిస్తావని వరం ఇస్తాడు. అయితే అలా జన్మించిన నీవు నా పూజకు అనర్హురాలువని చెప్తాడు. అలా తులసి మొక్కగా జన్మించిన యువరాణి… వినాయకుడి పూజకు పనికిరాదని మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే అప్పటి నుంచి గణేషుడి పూజలో తులసిని వాడరు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.