Ganesh Pooja : గణేషుని పూజలో తులసిని ఎందుకు వాడకూడదు? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ganesh Pooja : గణేషుని పూజలో తులసిని ఎందుకు వాడకూడదు?

 Authored By pavan | The Telugu News | Updated on :28 February 2022,3:30 pm

Ganesh Pooja : హిందూ పురాణాలు ప్రకారం మనం ఏ పూజ చేసినా, ఏ శుభకార్యం చేసినా ముందుగా వినాయకుడిని పూజిస్తాం. విఘ్నాలు తొలగించే ఈ విఘ్నేష్వరుడికి పూజ చేశాకేమిగిలిన పూజలు, పునస్కారాలు, వ్రతాలు, శుభకార్యాలు చేస్తాం. మనం చేయబోయే పూజలు, శుభకార్యాల్లో ఎలాంటి ఆటంకాలు కల్గకుండా ప్రశాంతంగా నిర్విఘ్నంగా ఆ శుభకార్యం పూర్తవ్వడం కోసమే వినాయకుడికి పూజ చేస్తుంటాం. అయితే వినాయకుడి పూజలో అనేక రకాల పూలు, పండ్లు, ఆకులను వాడుతుంటాం. కానీ తులసీ దళాలలను మాత్రం అస్సలే ఉపయోగించం. మనకు కారణం ఏమిటో తెలియకపోయినప్పటికీమన పెద్దలు వద్దాన్నారన్న ఒక్క కారణంతో వినాయకుడి పూజలో తులసీ దళాన్ని ఉపయోగించం. కానీ విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడి పూజలో తులసీ దళాలలను ఎందుకు వినియోగించరో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

తులసి మొక్కకు హిందూ సంప్రదాయాల్లో ఎంతో ప్రత్యేకత ఉంది. తలసి చెట్టును గౌరీ దేవిగా భావించి పూజలు చేస్తుంటాం. కార్తీక మాసంలో అయితే తలసి చెట్టుకు పెళ్లి కూడా చేస్తుంటాం. మరి అంత పవిత్రమైన తలసి చెట్టు ఆకులను మాత్రం వినాయకుని పూజలో ఉపయోగించం. ఇందుకో ఓ ప్రత్యేక కారణం ఉంది. అదేంటంటేవినాయకుడు ఓ నదీ పరీవాహక ప్రాంతంలో తపస్సు చేసేందుకు వెళ్లాడట. ఆ సమయంలో వినాయకుడిని చూసిన ధర్మ ద్వజ యువరాణిగణేషుడిని మోహిస్తుంది. పెళ్లి చేసుకోమన్ని వినాయకుడిని వేడుకుంటుంది. గణేషుడు ఆమెను పెళ్లి చేసుకుంటే తన తపస్సుకి భంగం కల్గుతుందని ఆమెతో వివాహానికి నిరాకరిస్తాడు.

reason behind the do not using thulasi in Ganesh Pooja

reason behind the do not using thulasi in Ganesh Pooja

అది తట్టుకోలేని ఆ యువరాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కోపంలో నీకు ఇష్టం లేని వారితో బలవంతంగా నీ పెళ్లి జరుగుతుందని శపిస్తుంది. ఇలా వినాయకుడి కి శాపం పెట్టడం వల్ల ఆగ్రహం చెందిన గణనాథుడు ధర్మ యువరాణి వివాహం ఒక రాక్షసుడితో జరుగుతుందని తిరిగి శాపం పెడతాడు. వినాయకుడి శాపం వల్ల తీవ్ర కుంగుబాటుకు గురైన ఆ యువరాణి తన తప్పును తెలుసుకుంటుంది. శాపవిమోచనం కల్పించమని వేడుకుంటుంది. కానీ అది సాధ్యం కాదనికానీ రాక్షసుడితో కొన్నేళ్లు జీవించినప్పటికీ.. తర్వాతి జన్మలో పరమ పవిత్రమైన తులసిగా నీవు జన్మిస్తావని వరం ఇస్తాడు. అయితే అలా జన్మించిన నీవు నా పూజకు అనర్హురాలువని చెప్తాడు. అలా తులసి మొక్కగా జన్మించిన యువరాణివినాయకుడి పూజకు పనికిరాదని మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే అప్పటి నుంచి గణేషుడి పూజలో తులసిని వాడరు.

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది