Friday : శుక్రవారం ఇలా ఉప్పు దీపం వెలిగిస్తే కోటీశ్వరులవుతారు…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Friday : శుక్రవారం ఇలా ఉప్పు దీపం వెలిగిస్తే కోటీశ్వరులవుతారు…!!

 Authored By prabhas | The Telugu News | Updated on :3 March 2023,12:20 pm

Friday : ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారు అనేక పరిహారాలు చేసి ఇప్పటికే విసిగి వేసారిన వారు ఈ ఒక్క పరిహారాన్ని చేస్తే చాలు మీకు డబ్బే డబ్బు శ్రీ మహాలక్ష్మి దేవిని ఆకర్షించేటువంటి ఆ దీపాన్ని మీరు ఏ విధంగా వెలిగించాలి. ఎప్పుడు ఎలా వెలిగించాలి. దాని వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి ఇంకా చేయాల్సినటువంటి పరిహారాలు ఎవరైతే ధనవంతులు కావాలి అని కోరుకుంటున్నారో ఆర్థిక కష్టాలు మాకు అవసరం లేదు అని కోరుకుంటున్నారు అటువంటి వారందరూ కూడా తప్పకుండా చూడండి అలాగే మీ బంధుమిత్రులతో కూడా పంచుకోండి. డబ్బు చుట్టూనే మనుషులైనా మానవ సంబంధాలైన అలానే ఎవరిని తప్పు పట్టడానికి లేదు. డబ్బుంటేనే మన ప్రతి అవసరము తీరుతుంది. ప్రతి సంతోషము మన దాకా వస్తుంది. అయితే డబ్బు ప్రతి ఒక్కరికి చాలా అవసరం

ఈ డబ్బు కోసమే మనలో అందరము కష్టపడుతూ ఉంటాం. కానీ డబ్బు అందరికీ దొరుకుతుందా.. అందరూ సుఖసంతోషాలతో ఉంటున్నారా అంటే కానీ కాదు ఆ డబ్బు కొందరికి మాత్రమే దక్కుతుంది. కొందరు మాత్రమే ఐశ్వర్యవంతులవుతారు. కొందరు మాత్రమే సుఖపడతారు. కొంతమంది ధనవంతులు ఉంటారు. అయితే అందరూ ధనవంతులు కావాలంటే ఆ కొంతమంది చేసే పనుల్ని అందరూ చేయాలి అప్పుడు తప్పకుండా ధనవంతులవుతారు. కొన్ని ఆధ్యాత్మిక ప్రక్రియలను పాటించాలి. కొన్ని పరిహారాలు చేయాలి మన కంటికి కనిపించని దోషాలు నరదిష్టి నరగోష ఇలాంటి ఎన్నో వాటిని పోగొట్టేటువంటి పరిహారాలు చేసుకుంటే తప్పకుండా ప్రతి ఒక్కరు ఐశ్వర్యవంతులవుతారు. చిన్నచిన్న దోషాలను తొలగించుకుంటూ మీ జీవితంలో ముందుకు వెళితే ఐశ్వర్యవంతులవటం ఖాయం. ఇందుకోసం మీరు ఒక దీపాన్ని వెలిగించాల్సి ఉంటుంది అనే సందేహం మీకు రావచ్చు.

Salt Deepam In Telugu in Uppu Deepam Importance

Salt Deepam In Telugu in Uppu Deepam Importance

ప్రతిరోజు దీపారాధన చేసిన కూడా దీపాన్ని వెలిగించి చేసేటువంటి పరిహారం మీకు ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది. ఈ దీపం మామూలు దీపం కాదు. దీన్ని ఐశ్వర్య దీపం అని కూడా అంటారు. ఐశ్వర్య దీపం అంటే ఉప్పుతో పెట్టేటువంటి దీపం ఇలా ఎందుకు పెడతారు. ఉప్పుతో దీపాన్ని ఎందుకు వెలిగించాలంటే సంపద నిలవకుండా వచ్చింది వచ్చినట్టు పోతు ఉంటుంది. కొంతమందికి వాళ్ళు చూడ్డానికి బాగా సంపాదిస్తారు కానీ చేతిలో నిలవదు కష్టాలు పోవు వచ్చింది వచ్చినట్టు పోతూనే ఉంటుంది. తగ్గాధనపు ఖర్చులు ప్రతినెలా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. అనారోగ్య సమస్యలకి ఖర్చులు విరిగిపోతూ ఉంటాయి. వాస్తు దోషాలు తొలగించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు ఒకదాని తర్వాత ఒకటి మీకు అనేక ఆర్థిక కష్టాలు వస్తూ ఉంటాయి. వచ్చిన సంపద నిలవకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటివారు కనుక ఈ ఉప్పుతో దీపాన్ని పెడితే మేలు కలుగుతుంది.

వ్యాపారంలో లాభాలు లేకుండా ఇబ్బందులు ఎవరైతే పడుతున్నారో వారికున్నటువంటి ఇబ్బందులన్నీ పోయి వారు సంతోషంగా జీవిస్తారు. శ్రీమహాలక్ష్మి దేవి కరుణాకటాక్షాలు కావాలి అంటే ఈ ఉప్పు దీపం కచ్చితంగా పెట్టాలి. ఈ ఉప్పు దీపాన్ని ఎప్పుడు వెలిగించాలి. ప్రతి శుక్రవారం వెలిగించాల్సి ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఏదైనా ఒక పరిహారం ఒక్కసారి చేస్తే ప్రయోజ నం దక్కదు దాన్ని అలవాటుగా చేసుకోవాలి. ప్రతి శుక్రవారం మీరు దీపారాధన చేసినప్పుడు ఈ ఉప్పు దీపాన్ని కూడా మీ ఇంట్లో వెలిగించండి. ఎప్పుడైతే శుక్రవారం దీపారాధనలు ఉప్పు దీపాన్ని వెలిగించడం మీరు ప్రారంభిస్తారు. మూడు వారాల్లోని మీ ఆదాయంలో మార్పులు చూస్తారు.

உப்பு தீபம் ஏற்றலாமா | Uppu deepam benefits in Tamil

ఇందుకోసం మీకు రెండు పెద్ద ప్రమిదలు కావాల్సి ఉంటుంది. చాలా పెద్దవి మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. నిత్యం దీపారాధనలో ఉపయోగించేటువంటి చిన్న ప్రమిదలు కాకుండా పెద్ద ప్రమిదలు రెండు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ రెండింటిని శుభ్రంగా కడిగి పసుపు కుంకుమ రాసిన తర్వాత నేల మీద చిన్న ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసి ఆ ముగ్గు మీద ఈ రెండు ప్రమిదలని ఒకదాని పైన ఒకటి పెట్టాలి. అప్పుడు పై ప్రమిదలో ఒక పావు కిలో రాళ్ల ఉప్పుని వేయాలి. రాళ్ల ఉప్పు ఎంతో శక్తివంతమైనటువంటి అనేక దోషాలు తొలగిస్తుంది. ఈ రాళ్ల ఉప్పుని ఆ పై ప్రమిదలో వేసి ఉప్పు మీద పసుపు కుంకుమ చల్లాలి. ఆ తరువాత ఈ ఉప్పు రాసి మీద ఒక చిన్న ప్రమిదను

పెట్టి ఆ ప్రమిదకి కూడా పసుపు కుంకుమ రాసి ఆ ప్రమిదలు నూనె కానీ నెయ్యి కానీ వేసి రెండు వత్తులని ఒక వత్తుగా చేసి దీపాన్ని వెలిగించాల్సి ఉంటుంది. ఇది ఉప్పు దీపాన్ని వెలిగించేటువంటి ప్రక్రియ ఆ తర్వాత పండ్లు కానీ పాలు కానీ పటిక బెల్లాన్ని కానీ కొబ్బరికాయ కానీ ఏదైనా నివేదనగా పెట్టి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా వేడుకోవాలి. సంకల్పం చెప్పుకోండి మీరు ఏ కష్టం నుంచి బయట పడాలని కోరుకుంటున్నారు. ఆ కష్టం నుంచి బయటపడేయండి అని ఆ శ్రీమహాలక్ష్మి దేవిని వేడుకోండి. వీలైన వారు కనకధార స్తోత్రాన్ని గాని లలిత సహస్రనామాన్ని గాని చదువుకోండి…

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది