Sankranthi Mugulu : సంక్రాంతి పండగ Sankrathi అంటే ముగ్గుల పండగ. ఈ పండగ వచ్చిందంటే అందరూ కూడా సంతోషంగా వారి ఇంటి ముంగిట్లలో అందమైన రంగురంగుల రంగవల్లిలు అందంగా అలంకరించి వీధి వీధినా దర్శనమిస్తాయి. అంతేకాకుండా సంక్రాంతి పండుగనాడు. ఇంట్లో బంధువులతో కలకలలాడుతూ ఉంటుంది. ఇంటింటా గుమగుమలాడే పిండి వంటలు చేసుకుంటారు. ఇక పల్లెటూరు సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక్కడ కూడా వాకిట్లో ముగ్గులు పాతకాల డిజైన్స్, కొత్త డిజైన్స్, మెలికల ముగ్గులు, రథం ముగ్గులు, గీతల ముగ్గులు, చుక్కల ముగ్గులు, ఇలా అన్ని రకాల ముగ్గులు వాకిట్లలో దర్శనమిచ్చేవి. కానీ ఇప్పటి రోజుల్లో కొంతమంది కి అసలు ముగ్గులు వేయటం కూడా రావడం లేదు. ఇలాంటి వారి కోసమే మేము నేర్చుకొనుట కొరకు ముగ్గులను మీ ముందు ఉంచుతున్నాము. వచ్చిన వారికి కొత్త ముగ్గుల డిజైన్లను తెలియజేస్తాము. సంక్రాంతి పండుగ వచ్చిందంటేనే కొత్త ముగ్గులు నేర్చుకుని మరీ వేస్తూ ఉంటాము. సంక్రాంతి పండుగ వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా పెద్ద పండుగలా ఘనంగా జరుపుకుంటారు.
భోగి పండుగ రోజున భోగి మంటలు వేస్తున్నట్టు కట్టెల బొమ్మను గీసి, ఆ కట్టెలు మండుతున్నట్లుగా ముగ్గును వేయాలి. ఆ మండుతున్న కట్టెలపై ఒక కుండను వేసి, ఆ కుండలో పాలను మరిగించి, ఆ పాలు వండుతున్న కట్టెలపై పొంగి పడుతున్నట్లుగా అందంగా ముగ్గును నీట్ గా వేయాలి. ఈ కుండ నుంచి పాలు పొంగుతున్న ముగ్గురులో అందమైన రంగులను నింపాలి. కట్టెల డిజైన్ కి మెరూన్ కలర్, మంట మండుతున్న అగ్నికి ఆరెంజ్ కలర్, ఆ మంటపై ఉన్న కుండకి మీకు నచ్చిన రంగులో అందంగా డిజైన్ చేసుకోండి. కుండ నుంచి కనిపించే పాలను తెల్లని రంగుతో నింపాలి.
ఈ భోగి పండుగ నాడు కొన్ని గుండ్రటి ముగ్గులను కూడా వేస్తూ ఉంటారు. గుండ్రటి ముగ్గులు ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ వేస్తూ ఉన్నారు. ఈ రౌండ్ డిజైన్లు చాలా ఉన్నాయి. ఇలా వేయటం వల్ల చాలా అందంగా కూడా కనిపిస్తాయి. ఈ రౌండ్ డిజైన్లు భోగి కి సంబంధించిన డిజైన్స్ ను కూడా వేసుకోవచ్చు.
సంక్రాంతి పండుగ రోజున వేసే ముగ్గులు : సంక్రాంతి పండుగ రోజున వేసే ముగ్గులు, కొన్ని రకాల చుక్కల ముగ్గులు. ఒక మహిళ ముగ్గులు వేస్తున్నట్లు వేసే డిజైన్ ఒకటి, కుండలో పాలు పొంగిస్తున్నట్టు ఒక డిజైన్, కొంతమంది అయితే పీకాక్ డిజైన్లు కూడా వేస్తున్నారు. ఈ ముగ్గులు కూడా చాలా అందంగా ఉంటున్నాయి. సంక్రాంతి పండుగ రోజున ముగ్గులు కుండలో పాలు పొంగుతున్నట్టుగా వేసి, దాని ఇరువైపులా చెరుకు గడలను వేసి అందంగా డిజైన్ చేస్తారు. ఆ చెరుకు కడలకు జాయింట్ గా ధాన్యపు రాశుల కంకిని కూడా వేస్తారు. ఇంకా కైట్ బొమ్మలను కూడా వేస్తారు. ఎందుకంటే సంక్రాంతి పండుగ రోజున కైట్లను ఎగిరేసేది కూడా ఒక పండుగ జరుపుకుంటారు కాబట్టి. పండుగలు ఇలా అయితే జరుపుకుంటాము అలా ముగ్గులు వేస్తాం. ఇంకా కొంతమంది అయితే డూ డూ బసవన్న, సన్నాయి మేళాలతో వస్తున్నట్లు కూడా ముగ్గుతో చిత్రిస్తారు. ఇలా సంక్రాంతి పండుగ రోజున ఇంటి ముగ్గులను వేసుకుంటారు. ఇంకా మరెన్నో డిజైన్స్ ని కూడా వేస్తూ ఉంటారు.
కనుమ పండుగ రోజున వేసే ముగ్గులు రథం ముగ్గులు, ఈ కనుమ రోజున రథం ముగ్గులు మాత్రమే అందరూ వేస్తారు. అయితే, సంక్రాంతి పండుగ రోజున శివుడు రథంపై మన వాకిట్లోకి వచ్చి, ఇంట్లోకి వస్తాడని రథం ముగ్గు ద్వారా తెలియజేస్తారు. ఇదే రథం ముగ్గులు వేయడానికి గల కారణం, కనుమ రోజున శివుడు రథంపై ఇంటి నుంచి బయటికి వెళుతున్నట్లు రథం ముగ్గును వాకిట్లో వేసి తెలియజేస్తారు. సంక్రాంతి నాడు ఇంట్లోకి వేసిన రథం ముగ్గును, కనుమ రోజు తప్పనిసరిగా బయటికి వేసి ముగ్గులు వేయాలి. రథం ముగ్గు నువ్వు కనుమ రోజున బయటికి వెయ్యలేదు అంటే, సంక్రాంతి పండుగ నాడు కీడు వస్తుంది అని అంటూ ఉంటారు. కీడు అనేది మన ఇంటికి వస్తుందని, భావించి తప్పనిసరిగా బయటికి రథం ముగ్గులు వేస్తారు. సంక్రాంతి పండుగ నాడు ఇంట్లోకి ఆహ్వానించిన రథం ముగ్గును, నువ్వు నాడు తిరిగి బయటకు పంపేలా వేయాలి. ఇది ఆనాటి నుంచి ఈనాటి దాకా వస్తున్న సాంప్రదాయ ముగ్గు.
ఈ రథం ముగ్గు ప్రతి ఒక్కరి ఇంటి ముందా ముందర కనుమనాడు దర్శనమిస్తుంది. ధనుర్మాసం వచ్చిందంటే గీతల ముగ్గులు వేస్తూ ఉంటారు. ధనుర్మాసo ముగిసే ముందు గీతల ముగ్గులు వేయడం ఆపివేస్తారు. ధనుర్మాసంలో గీతల ముగ్గులకు ఒక ప్రత్యేకత ఉంది. సంక్రాంతి పండగ నాడు ఆంధ్రప్రదేశ్లో అనేక రకాల ముగ్గుల పోటీలు, కోడి పందాలు, ఎడ్ల పందాలు వంటివి ఎక్కువగా ఏర్పాట్లు జరుగుతాయి. మన తెలంగాణలోకు పందాలు తక్కువగా ఉంటాయి. సంక్రాంతి పండుగ ఆంధ్ర వాసులు ఎక్కువగా ఘనంగా చేసుకుంటారు. కోడిపందాలతో,కొత్త అల్లుళ్లతో జనంతో నిండిపోతుంది. సంక్రాంతి వచ్చిందంటే ప్రజలందరూ కూడా ఆనందంగా జరుపుకునే పెద్ద పండుగ. ఈ సంక్రాంతి పండుగలు మూడు రోజులు మూడు రకాలుగా ముగ్గులు వేసుకుంటారు. ఒక్కొక్క రోజున ఒక్కొక్క ముగ్గు ఒక ప్రత్యేకత దాగి ఉంది.
Supreme Court : భారత సుప్రీంకోర్టు (SCI) లా క్లర్క్-కమ్-రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల కోసం 90 ఖాళీలను భర్తీ చేయడానికి…
Daku maharaaj : సంక్రాంతి బరిలో బాలయ్య మూవీ ఉంటే..బాక్సాఫీస్ దగ్గర కనిపించే ఆ కిక్కే వేరు. గత ఏడాది…
Bhogi Festival : sankranti పండుగ వస్తుందనగానే సతీమణులందరూ ఇంటిని శుభ్రం చేసే పనిని పెట్టుకుంటారు. ఈ సమయంలో ఇంట్లో…
Bhogi : ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు పండగ అయిన సంక్రాంతి sankranti , భోగి Bhogi , కనుమ Kanuma …
Sankranti Bhogi Ratham Muggu : సంక్రాంతి పండుగ వచ్చిందంటే ముగ్గులతో ఇల్లు కళకళలాడిపోతూ ఉంటాయి. పురాతన కాలంలో గీతల…
Pithapuram Varma : ఒకప్పుడు పిఠాపురం పేరు అందరికి పెద్దగా పరిచయం లేదు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ Pawan Kalyan…
Padi Kaushik Vs Sanjay : కరీంనగర్ జిల్లాలో ఆదివారం జరిగిన సమీక్షా సమావేశంలో గందరగోళం నెలకొంది. బిఆర్ఎస్ హుజురాబాద్…
Kodi Pandalu : సంక్రాంతి Pongal పండగ వచ్చిందంటే చాలు మనందరికి ముందుగా గుర్తుకు వచ్చేది కోడి పందాలు. భోగి…
This website uses cookies.