Bhogi Festival : sankranti పండుగ వస్తుందనగానే సతీమణులందరూ ఇంటిని శుభ్రం చేసే పనిని పెట్టుకుంటారు. ఈ సమయంలో ఇంట్లో పనికిరాని వస్తువులు, విరిగిపోయిన కుర్చీలు, అవి చెక్క కుర్చీలు మాత్రమే, పాత వస్తువులను, సంవత్సరం మొత్తం ఇంట్లో ఉన్న వేస్టేజ్ వస్తువులను భోగి మంటల్లో వేస్తారు. దీంతో ఇల్లు శుభ్రమైపోతుంది. వీటితో పాటు మన మనసులో ఉన్న చెడు వ్యసనాలను చెడు గుణాలను భోగి రోజున మంటలోనికి వదిలేయాలని పెద్దలు చెప్పే వారిని అంటున్నారు. మన తెలుగు రాష్ట్రాలలో మన తెలుగువారి పండుగలు పడి ఉన్నాయని విశాఖపట్నంలోని బీవీకే కళాశాల తెలుగు ఉపాధ్యాయులు డాక్టర్ మోహన్ రావు అంటున్నారు. ఈ తెలుగు పండగ అయినా మకర సంక్రాంతి పండుగ ముందు మొదటి రోజు భోగి పండుగ చేసుకుంటామని అంటున్నారు. తెల్లవారు జామునే లేచి నలుగు పెట్టుకొని, పరిపూర్ణమైన తలంటు స్నానం చేస్తారని అంటున్నారు. ఇప్పుడు కాలంలో ఉన్న పిల్లలకు భోగి పండుగ గురించి పిల్లలకు అస్సలు తెలియదని అంటున్నారు.
ఇప్పుడు ప్రస్తుత కాలంలో చిన్న పిల్లలు, యువతీ, యువకులు పండుగలు వచ్చినప్పుడు చాలా లేటుగా అంటే ఎనిమిది,తొమ్మిది గంటల సమయంలో నిద్ర నుంచి లేచి స్నానం చేస్తున్నారు. ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాలలో పల్లెటూర్లలో తెల్లవారుజామున లేచి స్నానం చేసి భోగి మంటల్ని కాలుస్తూ సాoప్రదాయాన్ని పాటిస్తున్నారు. శీతాకాలం కావడంతో ప్రజలు భోగి మంటలను వేసి వెచ్చగా చలి మంటను కాచుకుంటారు. అంతే కాకోకుండా వ్యాధి నిరోధక శక్తి పెంచేందుకు వేపతో కూడినటువంటి చేదు కట్టెలను భోగి మంటలలో వేస్తారు. దీని నుంచే వచ్చే వేడి, పొగ సూక్ష్మ క్రిమనాశనాన్ని, క్రిమి సమహారక నాశనం చేయుటకు ఉపయోగపడుతుంది. అలాగే ఈ చేదుతో చేసిన పిండి వంటలు కూడా ఉంటుంది. చేదు తినడం ద్వారా శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది అంటున్నారు. పాతకాలం రోజుల్లో గొంతులోని కఫం, అజీర్తి వంటి సమస్యలు ఈ చేదు తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుందని అంటున్నారు. కానీ ఇప్పుడు ప్రజలు మాత్రం మాత్రలతో సరిపెడుతున్నారు.
పూర్వ రోజుల్లో bhogi mantalu భోగి మంటలు గ్రామీణ ప్రాంతంలో పంట పొలాల ఆరుబయట ఉంచి వాటిపై పచ్చటి కొమ్మలు వేసేవారని అంటున్నారు. రైతులు ఆ సంపద ఇంటికి రావడంతో పూజలు కార్యక్రమాలు కూడా చేసుకుని దైవాన్ని ప్రార్థిస్తారు. ఇలా దేవుని పూజించడం వల్ల ప్రతి సంవత్సరం మంచి పంటలు, పండి ఇంటికి వస్తుందని భావిస్తారు. ఇప్పుడు రోజుల్లో అధునాతన యంత్రాలు వచ్చినప్పటికీ ధాన్యం తీసి ఇంటికి తీసుకువచ్చేస్తున్నారని అంటున్నారు. భోగి పండుగ రోజున ఇంట్లో పాలు పొంగించి, చక్కెర పొంగలిని చేస్తారు, ఈ చక్కెర పొంగలి తయారు చేయుటకు, పండిన కొత్త ధాన్యాన్ని అంటే వడ్ల గింజలని రోట్లో వేసి దంచి, అలా చేసి తీసిన ధాన్యమును, భోగి పండుగ రోజున, బెల్లంతో కలిపి దేవునికి నైవేద్యంగా పరమన్నాన్ని వండుతారు. ఇలా చేయటం వలన భోగి పండుగ రోజు పాలు పొంగిస్తే, మీ ఇంట్లో కూడా అలా పాలు పొంగినట్లుగా మన కుటుంబం కూడా పాలు పొంగినట్లుగా సంపద వృద్ధి చెందుతుందని పురాతన కాలంలో భావించేవారు. ఆనాటి సాంప్రదాయం ఇప్పటికీ కూడా కొత్తగా పండించిన ధాన్యమును, ఇంటికి రాగానే మొదట దేవునికి నైవేద్యంగా పెట్టటం కొనసాగుతూ వస్తుంది. ఆ మొదటి పంటను దేవునికి సమర్పిస్తే దేవుని యొక్క దీవెనలు మన కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి.
అయితే భోగి మంటలలో ఇంట్లో ఉన్న వ్యర్ధాలు ఆరోజు శుభ్రం చేసి భోగి మంటలు వేసే వారిని అంటున్నారు. రోజున భోగి మంటలలో వస్తువులు అయితే ఎలా అయితే వేస్తామో మన చెడు గుణాలను, చెడు వ్యసనాలను bhogi mantalu భోగి రోజున వదిలేయాలని పెద్దలు చెప్పేవారు. అయితే ప్రస్తుత కాలంలో ఇటువంటి సాంప్రదాయాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఉమ్మడి కుటుంబాల ఆదరణే కరువైపోయింది. నేటి తరంలోని యువత కూడా ఈ పండగలను గురించి తెలుసుకోవాలి అని, భవిష్యత్తులో భోగి సంక్రాంతి కనుమ అంటే ఏంటో ఎలా ఉంటుందో తెలుసుకుంటే రాబోయే తరాలలో వేరు కూడా సంప్రదాయాన్ని కొనసాగించవచ్చు.
Mahakumbh Mela 2025 : భూమిపై అతిపెద్ద సమావేశంగా జరుపుకునే 45 రోజుల మహాకుంభమేళా Mahakumbh Mela 2025 సోమవారం…
Supreme Court : భారత సుప్రీంకోర్టు (SCI) లా క్లర్క్-కమ్-రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల కోసం 90 ఖాళీలను భర్తీ చేయడానికి…
Daku maharaaj : సంక్రాంతి బరిలో బాలయ్య మూవీ ఉంటే..బాక్సాఫీస్ దగ్గర కనిపించే ఆ కిక్కే వేరు. గత ఏడాది…
Bhogi : ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు పండగ అయిన సంక్రాంతి sankranti , భోగి Bhogi , కనుమ Kanuma …
Sankranthi Mugulu : సంక్రాంతి పండగ Sankrathi అంటే ముగ్గుల పండగ. ఈ పండగ వచ్చిందంటే అందరూ కూడా సంతోషంగా…
Sankranti Bhogi Ratham Muggu : సంక్రాంతి పండుగ వచ్చిందంటే ముగ్గులతో ఇల్లు కళకళలాడిపోతూ ఉంటాయి. పురాతన కాలంలో గీతల…
Pithapuram Varma : ఒకప్పుడు పిఠాపురం పేరు అందరికి పెద్దగా పరిచయం లేదు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ Pawan Kalyan…
Padi Kaushik Vs Sanjay : కరీంనగర్ జిల్లాలో ఆదివారం జరిగిన సమీక్షా సమావేశంలో గందరగోళం నెలకొంది. బిఆర్ఎస్ హుజురాబాద్…
This website uses cookies.