BHOGI PALLU : పిల్లల తలపై భోగి పళ్ళు పోయడానికి కారణమేంటి.. పురాణాలలో ఈ కథ గురించి తెలుసా?
ప్రధానాంశాలు:
BHOGI PALLU : పిల్లల తలపై భోగి పళ్ళు పోయడానికి కారణమేంటి.. పురాణాలలో ఈ కథ గురించి తెలుసా?
BHOGI PALLU : సంక్రాంతి సంబురాలు అంతటా మొదలయ్యాయి. ఇప్పటికే పిల్లలకి సెలవులు ఇవ్వడంతో అందరు కూడా ఊర్లకి బయలుదేరారు. గొబ్బెమ్మలు, భోగి మంటలు, గంగిరెద్దులు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, రథం ముగ్గులు, కోడి పందేలు ఇలా సంకాంత్రి వచ్చిందంటే ఆ సందడే వేరు. మకర సంక్రాంతి Pongal ముందు రోజు జరుపుకొనేదే భోగి పండుగ. భోగి మంటలతో మొదలయ్యే సంక్రాంతి వేడుకలో భోగిపళ్లది ప్రత్యేక స్థానం. భోగి రోజు చిన్నపిల్లలకు భోగి పళ్లు పోస్తారు. భోగి పళ్ళు పోయడం ద్వారా చెడు దృష్టి తొలగిపోయి నారాయణుడి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. అంతేకాదు దీనికి ఒక శాస్త్రీయ కారణం కూడా ఉంది. తల పైభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుందట.
BHOGI PALLU అసలు కారణం ఇది..
భోగి పండ్లు పోసి దానిని ప్రేరేపించడం ద్వారా పిల్లల జ్ఞానం పెరుగుతుందని భావిస్తారు. రేగుపండ్లు, చెరకుగడలు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణేలను కలిపి భోగి పండ్లుగా పిల్లల తలపై పోస్తారు. ఎరుపు రంగులో ఉండే ఈ రేగు పండ్లను సూర్యుడికి ప్రతీకగా భావిస్తారు. తద్వారా ఆదిత్యుడి ఆశీస్సులు పిల్లలకు లభిస్తాయని భోగి పళ్ళను Bhogi Pallu పోస్తారు. అప్పట్లో శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి నారాయణులు బదరికావనంలో తప్పస్సు చేస్తూ ఉన్నారట. అయితే ఆ సమయంలో దేవతలు వారి తలలపై బదరీ ఫలాలను కురిపించారట. ఆ సంఘటనకు ప్రతీకగా చిన్న పిల్లలను నారాయణుడిగా భావించి.. వారి తలలపై భోగి పళ్ళు పొసే సంప్రదాయం ఏర్పడిందని చెబుతారు.
చిన్నపిల్లలపై భోగి పళ్లు పోసేటప్పుడు “ఓం సారంగాయ నమః” అనే నామం చెప్పాలి. కార్యక్రమం పూర్తైన తర్వాత వాటిని ఎవరూ తొక్కని ప్రదేశంలో లేదా పారే నీటిలో వదిలిపెట్టాలని చెబుతున్నారు. ఈ పళ్లను Regi Pallu తినవద్దని చెబుతున్నారు. ఎందుకంటే, పిల్లలకు ఉన్న దిష్టి పోవాలని తీసి వేసే పళ్లు కనుక వాటిని తినటం మంచిది కాదట.పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి, సూర్యుడికి ప్రతీకగా, పోషకాల ఖజానాగా పిలిచే వీటిని తలపై పోస్తే ఆయురారోగ్యాలతో ఉంటారనీ, వారిపై ఉన్న చెడు దిష్టి మొత్తం పోతుందనీ చెబుతున్నారు.