Saturn Transits Into Pisces : మూడు దశాబ్ధాల తర్వాత మీన రాశిలోకి శని సంచారం.. ఈ రాశులకు అంతులేని ధనయోగం
ప్రధానాంశాలు:
Saturn Transits Into Pisces : మూడు దశాబ్ధాల తర్వాత మీన రాశిలోకి శని సంచారం.. ఈ రాశులకు అంతులేని ధనయోగం
Saturn Transits Into Pisces : నవగ్రహాల్లో అత్యంత కీలకమైన గ్రహం, నీతి, నిజాయితీలతో వ్యవహరించే రాశి శని. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి తన స్థానాన్ని మారుస్తుంటాడు. చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదిస్తాడు. మూడు దశాబ్దాల తర్వాత శనిదేవుడు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. అలాగే గ్రహాల రాకుమారుడైన బుధుడు ప్రస్తుతం మేషరాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ నెల 18న ఈ రెండు గ్రహాలు 45 డిగ్రీల కోణంలో కలుసుకుని అర్థకేంద్ర యోగాన్ని ఏర్పరుస్తాయి. ఈ యోగం వల్ల ఏ రాశులకు కలిసి వస్తుందో తెలుసుకుందాం.

Saturn Transits Into Pisces : మూడు దశాబ్ధాల తర్వాత మీన రాశిలోకి శని సంచారం.. ఈ రాశులకు అంతులేని ధనయోగం
మీన రాశి
అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఒంటరిగా ఉంటున్నవారికి త్వరలోనే వివాహం కుదురుతుంది. కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లే అవకాశాలు. కొత్తగా ఇంటిని లేదంటే స్థలాన్ని కొనుగోలు చేస్తారు. కొత్త వాహనాన్ని కొంటారు. ఏ పని తలపెట్టినా ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో పూర్తి చేస్తారు. నవ గ్రహాలకు ప్రదక్షిణ చేస్తే మంచిది.
కర్కాటక రాశి
శుభవార్తలు వింటారు. ఒంటరివారికి వివాహమయ్యే అవకాశం ఉంది. వీరు కూడా కోటీశ్వరులయ్యే అవకాశం. ఆకస్మిక ధనయోగం ఉంది. కుటుంబంలో శుభకార్యాలున్నాయి. ప్రేమ జీవితంలో ఉన్న ప్రేమికులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు. పెద్దలు ఒప్పుకునే అవకాశాలున్నాయి.
వృషభ రాశి
దాంపత్య జీవితం చాలా బాగుంటుంది. వ్యాపారస్తులకు, వృత్తిలో ఉన్నవారికి తిరుగులేని ఫలితాలు. వీరికీ కోటీశ్వరులయ్యే యోగం. జీవతంలో సంతోషం పెరగడంతో పాటు ఆర్థిక పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటాయి. ఏ పని తలపెట్టినా విజయమే. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయాలి. శనిదేవుడిని పూజిస్తే ఇంకా మంచి ఫలితాలు.