Shani Dev : ఈ రాశుల వారిపై శని దేవుడి అనుగ్రహం .. ఇలా చేస్తే ఇంటి నిండా డబ్బే .. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Shani Dev : ఈ రాశుల వారిపై శని దేవుడి అనుగ్రహం .. ఇలా చేస్తే ఇంటి నిండా డబ్బే ..

 Authored By prabhas | The Telugu News | Updated on :9 March 2023,6:00 am

Shani Dev : చాలామంది శని దేవుడు అంటేనే భయపడిపోతుంటారు. శని దేవుడు ఎన్ని ఇబ్బందులను పెడతాడో అన్ని శుభాలను ఇస్తాడు. అయితే మార్చి 6న శని గ్రహ కదలిక వలన కొన్ని రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు కలగనున్నాయి. వృషభ రాశి వారికి శని గ్రహం వలన బాగా కలిసి వస్తుంది. త్వరలోనే ధనవంతులు అవుతారు. శని ప్రభావం వలన వృత్తి వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఉద్యోగ విషయంలో శుభవార్తలను ఉంటారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అలాగే సింహరాశికి కూడా శని గ్రహం వలన శుభముహూర్తాలు రాబోతున్నాయి.

Shani Dev effect these Zodiac signs get good luck

Shani Dev effect these Zodiac signs get good luck

శని దేవుడి అనుగ్రహం వలన సింహ రాశి వారు శుభవార్తలను వింటారు. సూర్యుడు సింహరాశి అధిపతి . సూర్యుడు, శని మధ్య మంచి స్నేహబంధం ఉంటుంది. అందువలన శని కారణంగా మీ జీవితంలో ఆనందం పెరుగుతుంది. అలాగే శని గ్రహం వలన కుంభ రాశి వారికి కూడా మేలు జరగబోతుంది. ఉద్యోగంలో ప్రశంసలు అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. కొత్త ఉద్యోగాలను పొందుతారు. జీవిత భాగస్వామి సపోర్టు ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పెళ్లి కాని వారికి పెళ్లి అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Shani Dev effect these Zodiac signs get good luck

Shani Dev effect these Zodiac signs get good luck

ఇకపోతే శనీశ్వరుడి తీవ్రతను తగ్గించుకోవాలంటే విష్ణు సహస్రనామాలను పఠించాలి. వీటితోపాటు హనుమాన్ చాలీసా, ఆంజనేయ దండకం, శని స్తోత్రం, శని చాలీసా చేస్తే మంచిది. ఈ శనివారం శని గ్రహ ఆలయంలో శని దేవుడిని ఆరాధించడం, నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, పక్షులకు ఆహారం వేయడం, పరమశివుడి పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే శని దేవుడు శుభం కలిగిస్తాడు. ముఖ్యంగా శివుడు ఆరాధన, ఆంజనేయుడు ఉపాసన చేయడం ద్వారా శని తీవ్రతను తగ్గించుకోవచ్చు. అలాగే శని త్రయోదశి రోజు శని దేవుడిని నువ్వుల నూనెతో ఆరాధిస్తే శని అనుగ్రహం కలుగుతుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది