Shani Jayanthi : జూన్ 6న శని జయంతి…ఈ మూడు రాశుల వారికి సమస్యలు…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Shani Jayanthi : జూన్ 6న శని జయంతి…ఈ మూడు రాశుల వారికి సమస్యలు…!

Shani Jayanthi : శని జయంతి 2024 : శని జయతి అనగా శని దేవుని పుట్టినరోజు. నీతిమంతుడు అయినా శని దేవుడు వైకాసి మాసంలో అమావాస్య రోజున జన్మిస్తాడు. ఆ రకంగా 2024 లో శని జయంతి 6 తారీఖున వచ్చినది. శని దేవుడు అనగానే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక భయం ఉంటుంది. ఎందుకు అంటే. శని దేవుడు తమ కర్మకు తగిన ఫలాలను ఎల్లప్పుడూ కూడా అనుభవించేలా చేస్తాడు. కాబట్టి. అయితే […]

 Authored By ramu | The Telugu News | Updated on :3 June 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Shani Jayanthi : జూన్ 6న శని జయంతి...ఈ మూడు రాశుల వారికి సమస్యలు...!

Shani Jayanthi : శని జయంతి 2024 : శని జయతి అనగా శని దేవుని పుట్టినరోజు. నీతిమంతుడు అయినా శని దేవుడు వైకాసి మాసంలో అమావాస్య రోజున జన్మిస్తాడు. ఆ రకంగా 2024 లో శని జయంతి 6 తారీఖున వచ్చినది. శని దేవుడు అనగానే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక భయం ఉంటుంది. ఎందుకు అంటే. శని దేవుడు తమ కర్మకు తగిన ఫలాలను ఎల్లప్పుడూ కూడా అనుభవించేలా చేస్తాడు. కాబట్టి. అయితే వాస్తవానికి శని దేవుడు అంటే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేస్తేనే భయపడాలి. ఏ తప్పు చేయకుంటే శని భగవానుడికి భయపడాల్సిన అవసరం లేదు. వాస్తవానికి శని దేవుడు సంతోషకరమైన జీవితాన్ని గడపటానికి మార్గ నిర్దేశం చేస్తాడు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చూస్తే. శని గ్రహాల అన్నిటిలో కూడా నెమ్మదిగా కదిలే గ్రహం ఇది. ఈ శని 2 1/2 సంవత్సరాల వరకు కూడా రాశిలో ఉంటాడు. ఈ ఏడాది శని జయంతి రోజున శని దేవుడు తన మూల త్రికోణ రాశి అయినటువంటి కుంభరాశిలో ప్రవేశిస్తాడు. ఈ కారణం వలన కొన్ని రాశుల వారికి మాత్రం శని దేవుని ప్రత్యేక అనుగ్రహం అనేది కలుగుతుంది. అదే టైమ్ లో శని మరియు రాహులు ఒకే టైమ్ లో వక్రంలో తిరుగుతారు. అలాగే కుజుడు తన సొంత రాశిలో ఉంటాడు. ఈ గ్రహాల స్థానాల కారణం వలన, శని జయంతి కారణం వలన రాశి చక్రంలోని కొంతమంది వారి జీవితాలలో ఎన్నో సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ఆ రాశుల వారు ఎవరు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం…

Shani Jayanthi : మేష రాశి

మేష రాశికి చెందిన వారు శని జయంతి రోజున కాస్త జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఏ పని చేసినా సరే చాలా జాగ్రత్తగా చేయాలి. ఏ నిర్ణయం తీసుకోవాలన్న ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. కావున డబ్బు విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కావున డ్రైవింగ్ చేసేవారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులు కంపెనీలో మంచి ఫలితాలను పొందలేరు.

Shani Jayanthi జూన్ 6న శని జయంతిఈ మూడు రాశుల వారికి సమస్యలు

Shani Jayanthi : జూన్ 6న శని జయంతి…ఈ మూడు రాశుల వారికి సమస్యలు…!

Shani Jayanthi సింహరాశి

సింహరాశి వారికి కూడా శని జయంతి అనేది అసలు మంచిది కాదు. పనిలో ఎలాంటి ఫలితాలను కూడా పొందలేరు. కొందరికి ఆర్థిక నష్టం కూడా కలుగుతుంది. ఎన్నో వాదనలలో పాల్గొంటారు. దీని కారణం వలన ఎన్నో పనులకు అంతరాయం అనేది ఏర్పడుతుంది. ఆరోజున శత్రువుల సంఖ్య కూడా ఎంతగానో పెరుగుతుంది. మీ ఆరోగ్య విషయాలో కూడా కొన్ని సమస్యలు వస్తాయి. ఇన్వెస్ట్ చేసే ప్లాన్ ఏమైనా ఉన్నట్లయితే దానిని వెంటనే కొంత కాలం వరకు వాయిదా వేయటం చాలా మంచిది అని సూచిస్తున్నారు. కుటుంబ సభ్యులతో కూడా కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి…

Shani Jayanthi వృశ్చిక రాశి

శని జయంతి రోజు వృశ్చిక రాశికి ఇతర సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమస్యలను విస్మరించి, నిర్లక్ష్యం చేసినట్లయితే అది పెద్ద సమస్యలకు కూడా దారి తీయవచ్చు. కావున ముఖ్యంగా మీరు డబ్బు సమస్యలు లేక ఆర్థిక నష్టాలను కూడా ఎదుర్కొంటారు. కోర్టు కేసుల్లో కూడా ఫలితాలు అనుకూలంగా ఉండకపోవచ్చు. కావున మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది