Shasha Yoga : హోలీ పండుగ నాడు చంద్రగ్రహణం… శశ రాజయోగం ఏర్పడుతుంది… ఈ మూడు రాశులకు కాసుల వర్షం…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Shasha Yoga : హోలీ పండుగ నాడు చంద్రగ్రహణం… శశ రాజయోగం ఏర్పడుతుంది… ఈ మూడు రాశులకు కాసుల వర్షం…?

 Authored By ramu | The Telugu News | Updated on :10 March 2025,6:00 am

ప్రధానాంశాలు:

  •  Shasha Yoga : హోలీ పండుగ నాడు చంద్రగ్రహణం... శశ రాజయోగం ఏర్పడుతుంది... ఈ మూడు రాశులకు కాసుల వర్షం...?

Shasha Yoga : వేద జ్యోతిష్య శాస్త్రాలలో గ్రహాలలో శని భగవానునికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ పండుగ రోజున చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఆ రోజున కర్మ ప్రాధాత, న్యాయాధిపతి అయిన శని భగవానుడు శశ రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాడు. ఈ రాజయోగం వలన కొన్ని రాశులకు అదృష్టం పట్టబోతుంది. వీరికి ఎనలేని ఆర్థిక ప్రయోజనాలు పొందబోతున్నారు. ఈ సందర్భంలో శశ రాజయోగంతో కాసుల వర్షం ఈ రాశులకి వచ్చి పడుతుంది. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం. హోలీ పండుగ రోజున చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సంవత్సరంలో తొలి చంద్రగ్రహణం మార్చి 14న సంభవిస్తుంది.ఈ రోజు హోలీ పండుగ జరుపుకుంటారు. ఈ సంవత్సరంలో హోలీ రోజున వచ్చే చంద్రగ్రహణానికి ఎంతో ప్రత్యేకత ఉందని పండితులు అంటున్నారు. పాల్గొనమాసంలో పౌర్ణమి తిధి పైగా హోలీ పండుగ రోజున చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇలా జరగడం యాదృచ్ఛిక మని పండితులు అంటున్నారు.

Shasha Yoga హోలీ పండుగ నాడు చంద్రగ్రహణం శశ రాజయోగం ఏర్పడుతుంది ఈ మూడు రాశులకు కాసుల వర్షం

Shasha Yoga : హోలీ పండుగ నాడు చంద్రగ్రహణం… శశ రాజయోగం ఏర్పడుతుంది… ఈ మూడు రాశులకు కాసుల వర్షం…?

Shasha Yoga ఏర్పడునున్న శశరాజ యోగం

ఈ చంద్రగ్రహణం రోజున శనీశ్వరుడు రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాడు. దీన్నే శశ రాజ యోగం అని అంటారు. ఆ రోజున శని భగవానుడు తన సొంత కాశీ అయిన కుంభరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. మార్చి 14న చంద్రగ్రహణం రోజు, శనీశ్వరుడు కుంభ రాశిలో శశరాజ యోగాన్ని సృష్టిస్తున్నాడు. పండితులు ఈ శశరాజయోగం వలన శనీశ్వరుడు అనుగ్రహం ఈ రాశి వారిరు పొందగలుగుతారు అని పండితులు చెబుతున్నారు. అయితే ఈ యోగం కారణంగా కొన్ని రాశులకు చెందిన వ్యక్తులపై చంద్రగ్రహణ ప్రభావం తగ్గుతుంది. మీరు ఎన్నో రకాల ప్రయోజనాలను పొందగలరు. శశి రాజయోగాన్ని పొందే రాశులు ఏమిటో తెలుసుకుందాం…

మేష రాశి : రాశులలో మొదటి రాశి మేషరాశి. జ్యోతిష్య శాస్త్రంలో మొత్తం 12 రాశులు పరిగణించబడ్డాయి. అయితే శనీశ్వరుని యొక్క అనుగ్రహం చేత శశరాజ యోగ ప్రభావం వల్ల మేషరాశి వారికి ఆర్థికంగా ప్రయోజనాలు కలుగుతాయి. శని దేవుడి ఆశీస్సులతో మేష రాశి వారికి రాబోయే నెలలలో తమ వ్యాపారాల్లో భారీగా లాభాలను అందిపుచ్చుకుంటారు. మీరు ఏ పని చేసినా అన్నింటా విజయాలే. ఉద్యోగులకు ప్రత్యేకమైన ప్రయోజనాలు కలుగుతాయి.

మిధున రాశి : మీ మిధున రాశి వారికి శశి రాజయోగం వలన శనీశ్వరుని యొక్క అనుగ్రహంతో పట్టిందల్లా బంగారమే అవుతుంది. వీరికి ఎటువంటి సమస్యలు వచ్చినా పరిష్కరించుకోగలుగుతారు. ఈ సమయంలో మిధున రాశి వారికి ఆదాయం రెట్టింపు అవుతుంది. ఆదాయ వనరులో ఎక్కువే పెరుగుతాయి. మిధున రాశి వారికి రానున్న నెలలో భారీగా ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపారాలలో పురోగతిని చూస్తారు. వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. వీరి వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతారు.

కుంభరాశి : రాశి చక్రంలో కుంభ రాశి 11 వ రాశిగా పరిగణించబడింది. ఈ కుంభరాశిలో శనీశ్వరుడు శశరాజి యోగాన్ని ఏర్పరుస్తున్నాడు. శనీశ్వరుని ఆశీస్సులతో ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు కుంభరాశి వారు. ఉద్యోగస్తులకు కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. వ్యాపారాలు ఇంతకు ముందు కంటే ఎక్కువ లాభాల్ని చూస్తారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది